Best Web Hosting Provider In India 2024
Chinese Garlic: వెల్లుల్లి ప్రపంచంలోని అనేక దేశాలలో ముఖ్యమైన పదార్థంగా మారింది. ముఖ్యంగా భారతీయ చైనీస్ వంటకాలలో వెల్లుల్లి కచ్చితంగా ఉండాల్సిందే. మసాలాలు, ఊరగాయలు, పచ్చళ్ళు వంటి వాటిలో వెల్లుల్లి ఉండాలి. అయితే చైనీస్ వెల్లుల్లి భారతదేశంలో నిషేధించారు. ఒకప్పుడు ఈ వెల్లుల్లి మనదేశంలో అధికంగా దొరికేది. కానీ ఇప్పుడు దీన్ని పూర్తిగా ఎందుకు నిషేధించారో తెలుసుకోవాలి.
చైనీస్ వెల్లుల్లి అంటే
చైనీస్ వెల్లుల్లి పేరుకు తగ్గట్టే చైనాలో పెరిగే ఒక రకమైన వెల్లుల్లి. దీనికి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ఎగుమతి అవుతుంది. ఇది చూడడానికి చిన్న చిన్న వెల్లుల్లి రెబ్బలను కలిగి ఉంటుంది. ఇది తెలుపు, గులాబీ రంగుతో కనిపిస్తుంది. చైనీస్ వెల్లుల్లి ఆసియా వంటకాలలో నూడుల్స్, ఫ్రైడ్ రైస్, సూప్ లలో వాడతారు. ఒకప్పుడు చైనీస్ వెల్లుల్లి మన దేశంలో అధికంగా వాడేవారు. ఇప్పుడు నిషేధించారు.
చైనీస్ వెల్లుల్లిని ఎందుకు నిషేధించారు?
భారతదేశంలో చైనీస్ వెల్లుల్లిపై నిషేధం విధించడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ వెల్లుల్లి సాగు చేసే సమయంలో పురుగుల మందులు, రసాయనాలలో అధికంగా వాడతారు. ఇది తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను తెచ్చిపెడతాయి. భారతీయ వెల్లుల్లిని సహజ వ్యవసాయ పద్ధతులకు ప్రాధాన్యతనిస్తూ పెంచారు. అలాగే చైనీస్ వెల్లుల్లి తరచుగా భారతీయ అధికారుల నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను చేరుకోదు. ఇది ఆరోగ్యానికి హాని కలిగించే సింథటిక్ పదార్థాలను, రసాయనాలను కలిగి ఉంటుంది. మన భారతీయ వెల్లుల్లితో పోలిస్తే చైనీస్ వెల్లుల్లి తక్కువ ధరకే లభిస్తుంది. అందుకే మన భారతదేశంలో ఒకప్పుడు అధికంగా దొరికేది. దీనివల్ల మన భారతదేశ వెల్లుల్లిని పండించే రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలకు గురవుతున్నారు. ఈ కారణాల వల్ల చైనా వెల్లుల్లిపై నిషేధం పడింది.
చైనీస్ భారతీయ వెల్లులి మధ్య కొన్ని రకాల తేడాలు ఉన్నాయి. భారతీయ వెల్లుల్లి బలమైన, ఘాటైన వాసనను కలిగి ఉంటుంది. రుచి కూడా బాగుంటుంది. ఇది వంటకాలలో వేస్తే ఎంతో రుచిగా ఉంటుంది. చైనా వెల్లుల్లికి అంత బలమైన వాసనను రుచిని కలిగి ఉండదు. దీన్ని వాడడం వల్ల ఆహారాలకు పెద్దగా రుచిరాదు. ఇక చైనీస్ వెల్లుల్లి మన భారతీయ వెల్లుల్లితో పోలిస్తే పరిమాణంలో చిన్నదిగా ఉంటుంది. మన భారతీయ వెల్లుల్లి పెద్దదిగా ఉండి తెలుపు రంగులో ఉంటే చైనీస్ వెల్లుల్లి కాస్త గులాబీ రంగును కలిగి ఉంటుంది. భారతీయ వెల్లుల్లి సహజ వ్యవసాయ పద్ధతుల ద్వారా పండిస్తారు. సేంద్రీయ పద్ధతిలో కూడా పండిస్తారు. కాబట్టి ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగదు.
భారతదేశంలో చైనీస్ వెల్లుల్లినిషేధించడానికి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం, భారతీయ రైతుల జీవనోపాధిని రక్షించడమే ప్రధానంగా నిర్ణయం తీసుకున్నారు. భారతదేశంలో ఈ చైనీస్ వెల్లుల్లి లభించకపోయినా… ఇతర ఆసియా దేశాల్లో ఈ వెల్లుల్లి అధికంగానే లభిస్తుంది. అక్కడ వీటిని వినియోగించే వారి సంఖ్య కూడా ఎక్కువ.
టాపిక్