Murari Tickets Bookings: మురారి రీ-రిలీజ్‍కు అదిరిపోయే రెస్పాన్స్.. భారీగా టికెట్ల బుకింగ్స్

Best Web Hosting Provider In India 2024

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈనెల ఆగస్టు 9వ తేదీన 49వ పుట్టిన రోజును జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా మహేశ్ హీరోగా నటించిన క్లాసిక్ మూవీ ‘మురారి’ రీ-రిలీజ్ కానుంది. 23 ఏళ్ల తర్వాత ఈ చిత్రం మళ్లీ థియేటర్లలోకి అడుగుపెడుతోంది. ఈ మూవీ రీ-రిలీజ్‍కు ముందు నుంచి చాలా హైప్ ఉంది. కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన మురారి చిత్రానికి మహేశ్ కెరీర్‌లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమాలో సోనాలి బింద్రే హీరోయిన్‍గా నటించారు. మహేశ్ పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9న మురారి చిత్రం రీ-రిలీజ్ కానుంది. ఇందుకు గాను టికెట్ల బుకింగ్స్ నేడు (ఆగస్టు 3) మొదలయ్యాయి.

సూపర్ రెస్పాన్స్

మురారి సినిమా రీ-రిలీజ్‍కు హైప్‍కు తగ్గట్టే భారీ రెస్పాన్స్ వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో బుకింగ్స్ నేడే ఆరంభమయ్యాయి. అడ్వాన్స్ టికెట్ల బుకింగ్స్ భారీ సంఖ్యలో జరుగుతోంది. రీ-రిలీజ్‍కు అదిరిపోయే స్పందన వస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‍లోని చాలా థియేటర్లలో ఇప్పటికే చాలా శాతం టికెట్లు అమ్ముడయ్యాయి. థియేటర్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది.

మురారి రీ-రిలీజ్ అయ్యే ఆగస్టు 9వ తేదీన థియేటర్లలో భారీ సందడి కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. మహేశ్ బాబు పుట్టిన రోజుకు ఈ రీ-రిలీజ్ స్పెషల్ గిప్ట్‌గా వస్తోంది. ఈ సినిమా సందడి కొన్ని రోజుల క్రితమే సోషల్ మీడియాలో షురూ అయింది. ఏకంగా ఇన్విటేషన్ కార్డులు ప్రింట్ చేసి మరీ వీడియోలు పోస్ట్ చేశారు. మురారి సినిమా హ్యాష్‍ట్యాగ్ ఎక్స్ (ట్విట్టర్)లో ట్రెండ్ అవుతోంది. అంతలా ఈ చిత్రాన్ని క్రేజ్ ఉంది.

మురారి చిత్రం రీ-రిలీజ్‍కు 4కే టెక్నాలజీతో వస్తోంది. ఇటీవలే వచ్చిన రీ-రిలీజ్ ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. రీ-రిలీజ్ కోసం 18 నిమిషాల రన్‍టైమ్‍ను కూడా మేకర్స్ తగ్గించాలి. సుమారు 2 గంటల 42 నిమిషాల రన్‍టైమ్‍‍తో ఈ మూవీ వస్తోంది. ఆగస్టు 9 కోసం మహేశ్ బాబు ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మురారి సినిమా గురించి..

మురారి సినిమాలో సూపర్ నేచురల్ ఫ్యామిలీ డ్రామా మూవీగా వచ్చింది. గ్రామీణ నేపథ్యంలో డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులకు మెప్పించింది. ఈ చిత్రంలో మహేశ్ బాబు, సోనాలి బింద్రే జంటగా నటించారు. మహేశ్ తల్లి పాత్రను సీనియర్ నటి లక్ష్మి పోషించారు. కైకాల సత్యనారాయణ, సుకుమారి, గొల్లపూడి మారుతీరావు, అన్నపూర్ణ, సుధ, ప్రసాద్ బాబు, శివాజీ రాజా, రవిబాబు, రఘుబాబు మురారిలో కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా 2001 ఫిబ్రవరి 17వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది.

మురారి సినిమా మంచి హిట్ అయింది. ఈ చిత్రంతో ఫ్యామిలీ ప్రేక్షకుల్లోనూ మహేశ్ బాబుకు క్రేజ్ పెరిగింది. సోనాలీ బింద్రే కూడా పాపులర్ అయ్యారు. కృష్ణ వంశీ మరో క్లాసిక్ అందించారు. రామ్ ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్ ఈ మూవీని నిర్మించింది. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఇచ్చిన మ్యూజిక్ కూడా చాలా ఆకట్టుకుంది. ఈ చిత్రంలోని ‘అలనాటి రామచంద్రుడు’ పాట క్లాసిక్‍గా నిలిచిపోయింది.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024