Indian man puts eel in anus : రెండు అడుగుల ఈల్​ చేపను మలద్వారంలో దూర్చుకున్న వ్యక్తి!

Best Web Hosting Provider In India 2024


వియత్నంలో వైద్యులు షాక్​ అయ్యే ఘటన ఒకటి జరిగింది. అక్కడ నివాసముంటున్న ఓ భారతీయుడు, అతని మలద్వారంలో ఒక సజీవంగా ఉన్న ఈల్​ చేపను దూర్చుకున్నాడు! అది, అతని పేగులను తినేసింది. దానిని బయటకు తీయడానికి వైద్యులు చాలా కష్టపడ్డారు.

 

ఇదీ జరిగింది..

వియత్నం రాజధాని హనోయిలో జులై 27న జరిగింది ఈ ఘటన. ఓ భారతీయ వ్యక్తి తీవ్ర కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరాడు. అతడిని వెంటనే చికిత్స అందించారు. కానీ నొప్పికి అసలు కారణం తెలుసుకుని వైద్యులే షాక్​కు గురయ్యారు. టెస్టులు చేయగా అతను, తన మలద్వారంలో 2 అడుగుల పొడవు, 4 ఇంచ్​ల డయాటీర్​తో ఉన్న ఈల్​ చేప దూర్చుకున్నట్టు తేలింది. అది బయటకు వచ్చేందుకు చాలా ప్రయత్నించింది. ఫలితంగా సదరు వ్యక్తి పేగులు కోసుకుపోయాయి.

 

దానిని బయటకు తీసేందుకు ప్రయత్నించగా డాక్టర్లకు మరో షాక్​ తగిలింది. ఈల్​ చేపను దూర్చుకున్న అనంతరం, ఒక పెద్ద నిమ్మకాయను కూడా తన మలద్వారంలో దూర్చుకున్నాడు ఆ వ్యక్తి. ఈల్​ చేపను తీసేందుకు అది మరింత అడ్డుగా మారింది. ఫలితంగా ఆ భారతీయుడి మీద ఎమర్జెన్సీ సర్జరీ నిర్వహించారు. సర్జరీ చేసి 2 అడుగుల పొడవున్న ఈల్​ చేపను బయటకు తీశారు. నిమ్మకాయను కూడా తొలగించారు. అనంతరం కొలొస్టొమీ నిర్వహించారు.

 

“ఈల్ ఆనోరోబిక్​ కండీషన్స్​లో బతకగలదు. అందుకే పేగులను కొరికేసింది. అందుకే ప్రజలు సజీవంగా ఉన్న జంతువులను, మలద్వారంలో పెట్టుకోకూడదు. ఏదీ పెట్టుకోకూడదు,” అని వియత్నం వైద్యులు తెలిపారు.

 

ఈ వార్త సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. అయితే వియత్నంలో ఇలాంటి ఘటన జరగడం ఇది తొలిసారి కాదు! విచిత్రంగా ఈ ఏడాదే ఇది రెండో ఘటన. ఓ 43ఏళ్ల వ్యక్తి తన మలద్వారంలో ఈల్​ చేపను దూర్చుకోగా, దానిని వైద్యులు బయటకు తీశారు.

 

పురుషాంగంలోకి బ్యాటరీలు..

ఇలాంటి చిత్ర విచిత్ర సంఘటనలు ఎప్పటికప్పుడు వార్తాల్లో నిలుస్తూనే ఉంటున్నాయి. కొన్ని నెలల క్రితం, ఓ వ్యక్తి తృప్తి కోసం తన పురుషాంగంలోకి బ్యాటరీలను తోసుకున్నాడు! చాలా బాధ అనుభవించాడు. ఈ వార్త ఇన్​స్టెంట్​గా వైరల్​గా మారింది.

 

ఆస్ట్రేలియాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి బయటకి వచ్చిన ఓ కథనం ప్రకారం.. ఆ వృద్ధుడి వయస్సు 73ఏళ్లు. లైంగిక తృప్తి కోసం తన పురుషాంగంలోకి చిన్న చిన్న వస్తువులు చొప్పించుకోవడం ఆయనకు అలవాటు. వాటిని ఏదో ఒక విధంగా మళ్లీ బయటకు తీసేసేవాడు. అదే విధంగా.. కొన్ని రోజుల క్రితం.. మూడు చిన్న సైజు, బటన్​ స్టైల్​ బ్యాటరీలను పీనిల్​ యురేత్రాలోకి తోసుకున్నాడు. కానీ.. ఈసారి.. అవి బయటకు రాలేదు! అక్కడే ఉండిపోయాయి. మళ్లీ ప్రయత్నిచేసరికి.. అవి ఇంకాస్త లోపలికి వెళ్లిపోయాయి. ఈ ఘటన 24 గంటల తర్వాత.. సదరు వృద్ధుడు వైద్యుల దగ్గరికి పరుగులు తీశాడు. పరిస్థితని వివరించాడు. ఆ మాటలు విన్న వైద్యులు.. షాక్​కు గురయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

 

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source link