Best Web Hosting Provider In India 2024
Weapon Telugu OTT: సత్యరాజ్, వసంత్ రవి ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ మూవీ వెపన్ తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది. సూపర్ హీరో పాయింట్‌కు యాక్షన్ థ్రిల్లర్ అంశాలను జోడించి రూపొందిన ఈ మూవీకి గుహన్ సెన్నియప్పన్ దర్శకత్వం వహించాడు. జూన్ 7న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్ డిఫరెంట్‌గా ఉన్నా… అర్థవంతంగా తెరపై చెప్పడంలో తడబడ్డాడు. దాంతో తమిళ ఆడియెన్స్‌ను ఈ మూవీ మెప్పించలేకపోయింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ తెలుగు వెర్షన్ వాయిదాపడింది.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ…
తాజాగా థియేటర్లను స్కిప్ చేస్తూ వెపన్ తెలుగు వెర్షన్ నేరుగా ఓటీటీలో రిలీజైంది.
వెపన్ మూవీ తెలుగులో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళ వెర్షన్ మాత్రం ఆహా ఓటీటీలో రిలీజైంది. ఈ మూవీలో సత్యరాజ్, వసంత్ రవితో పాటు తాన్య హోప్, రాజీవ్ మీనన్, యాషికా ఆనంద్ కీలక పాత్రల్లో కనిపించారు.
సూపర్ హీరో…
అగ్ని (వసంత్ రవి) ఓ యూట్యూబర్. ప్రకృతి వనరుల పరిరక్షణ కోసం పాటుపడుతుంటాడు. తేని డిస్ట్రిక్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఓ సంస్థ దగ్గరలో బాంబు బ్లాస్ట్స్‌జరుగుతుంది. ఆ బాంబు బ్లాస్ట్ జరిగిన ప్రాంతంలో అగ్ని పోలీసులకు దొరుకుతాడు. టెర్రరిస్ట్ అనే అనుమానంతో అగ్నిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ప్రపంచానికి తెలియని సూపర్ హీరో మిత్రన్ గురించి తాను వెతుకుతున్నానని, తనకు ఈ బ్లాస్ట్‌లతో సంబంధం లేదని పోలీసులకు చెబుతాడు అగ్ని.
సూపర్ హీరో మిత్రన్‌కు అగ్నికి ఉన్న సంబంధం ఏమిటి? మిత్రన్ కోసం అగ్నితో పాటు బ్లాక్ సొసైటీ అధినేత డీకే కూడా ఎందుకు వెతుకుతున్నాడు. జర్మనీ నుంచి ఇండియాకు వచ్చిన ఓ సూపర్ సీరమ్ వల్ల మిత్రన్ సూపర్ హ్యూమన్‌గా ఎలా మారాడన్నదే వెపన్ మూవీ కథ.
వెపన్‌కు సీక్వెల్
టీజర్, ట్రైలర్స్‌తో వెపన్ మూవీ ఆడియెన్స్‌లో ఆసక్తిని రేకెత్తించింది. కానీ స్క్రీన్‌ప్లే కన్ఫ్యూజింగ్‌గా ఉండటం, ల్యాగ్, యాక్షన్ అంశాలు ఆశించిన స్థాయిలో ఎంగేజింగ్‌గా తెరకెక్కించలేకపోవడంతో సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. వెపన్ మూవీకి సీక్వెల్‌ను రూపొందించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
బాహుబలితో సెకండ్ ఇన్నింగ్స్…
బాహుబలిలో కట్టప్ప పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు సత్యరాజ్. జెర్సీ, ప్రతిరోజు పండగే, పక్కా కమర్షియల్, మిర్చితో పాటు పలు సినిమాలో విభిన్నమైన పాత్రల్లో కనిపించాడు. గత రెండేళ్లుగా టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చిన సత్యరాజ్ ప్రస్తుతం తమిళ, హిందీ భాషల్లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో నటిస్తున్నాడు.మరోవైపు జైలర్, అశ్విన్స్ వంటి డబ్బింగ్ సినిమాలో వసంత్ ర వి కూడా టాలీవుడ్ ప్రేక్షకులకు పలకరించాడు
టాపిక్