Periods in Space: అంతరిక్షంలో మహిళలకు పీరియడ్స్ వస్తే ఏం వాడతారు? వాళ్లు ఆశ్రయించే మార్గాలివే

Best Web Hosting Provider In India 2024

మహిళలకు పీరియడ్స్ సమయంలో ఉండే అసౌకర్యం చెప్పలేనిది. కొంతమందికి పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులు, తీవ్ర రక్త స్రావం వల్ల కనీసం రోజూవారీ పనులు కూడా చేసుకోలేరు. అలాంటిది అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే ఏం జరుగుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? 1963లో మొట్టమొదటి సారిగా వాలెంటీనా టెరిష్కోవా అనే మహిళ అంతరిక్ష ప్రయాణం చేశారు. అప్పటినుంచి మొదలుకొని ఇప్పటిదాకా దాదాపు 60 మంది దాకా మహిళలు ఆకాశం అనే హద్దు చెరిపేసి అంతరిక్షంలోకి పయనించారు. అక్కడ నివసించారు. కానీ మహిళా వ్యోమగాములకున్న సవాళ్లలో నెలసరి కూడా ఒకటి.

 

పీరియడ్స్ వస్తాయా?

కొన్ని అంతరిక్ష ప్రయాణాలు వారాల వ్యవధిలో ముగుస్తాయి. కానీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు సంబంధించిన ప్రయాణాలు ఆరు నెలల దాకా అయినా ఉంటాయి. అంగారక గ్రహానికి సంబంధించిన అంతరిక్ష ప్రయాణమైతే ఏకంగా మూడు సంవత్సరాలైనా పట్టేస్తుంది. అంతరిక్ష ప్రయాణమంటే శరీరంలోనే విపరీతమైన మార్పులు వస్తాయి. కానీ పీరియడ్స్ మీద మాత్రం ఆ ప్రభావం ఉండదట. అంటే మహిళలు అంతరిక్షంలో పీరియడ్స్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది.

ఏ వసతులుంటాయి?

చెత్తను డిస్పోజ్ చేయడానికి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో కొన్ని ఏర్పాట్లుంటాయి. కానీ నెలసరి రక్త స్రావాన్ని డిస్పోజ్ చేయడానికి మాత్రం వాటిని మొదట ఏర్పాటు చేయలేదు. ఇక స్పేస్ స్టేషన్లో చిన్న వైరు, స్క్రూ లాంటివి పెట్టాలన్నా ప్రతి బరువు తూకం వేసి డిజైన్ చేస్తారు. అందుకే మహిళలకు నెలసరిలో అవసరమయ్యే ట్యాంపన్లు, శానిటరీ న్యాప్‌కిన్ల బరువును అచనా వేయడం కూడా మరో సవాలు. అందుకే ప్రతి ఒక్కరి అవసరాలను ప్రత్యేకంగా అంచనా వేస్తారు. వాళ్ల అవసరాలు, ప్రయాణ సమయం, శరీర గుణాన్ని బట్టి ఈ అంచనా ఉంటుంది. వాళ్ల వ్యక్తిగత అవసరాలను బట్టి వసతులు ఏర్పాటు చేస్తారు.

 

రక్తస్రావం అయితే?

గురుత్వాకర్షణ శక్తి అంతరిక్షంలో ఉండదు. కాబట్టి నీళ్ల లాంటి ద్రవ పదార్థాలు కూడా గాల్లో తేలుతాయి. చెప్పాలంటే ఒక గ్లాసు నుంచి నీళ్లు పడేస్తే అవి కిందికి పడవు. గాళ్లో తేలతాయి. అలా నోరు తెరిచి చేసి బిస్కట్ మింగినట్లు ఆ నీళ్లని మింగేయొచ్చు. మరి నెలసరి సమయంలో రక్తస్రావం అయితే రక్తం శరీరం బయటకు రాకుండా వెనుదిరిగి శరీరం లోపలికే ప్రవహిస్తుందా అనే సందేహం ఉంటుంది. కానీ అలాంటిదేం జరగదట. సాధారణంగా రక్తస్రావం అవుతుంది.

వద్దనుకుంటారట:

అంతరిక్షంలో పీరియడ్స్ మహిళలు వద్దనుకుంటారు. వాటిని ఆపడానికి గర్భనిరోధక మాత్రలు వాడతారు. ప్రయాణం కోసం శిక్షణ పొందేటప్పుడు, ప్రయాణంలో కూడా నెలసరి జోలికి పోరు. వాళ్లు అంతరిక్షంలో నెలసరిని ఎదుర్కోవడానికి సిద్దంగా లేరని నిపుణులు చెబుతున్నారు. దానికోసం వివిధ మార్గాలు అనుసరిస్తారు.

నెలల కొద్దీ వాడతారా?

వారాల వ్యవధిలో ఉన్న ప్రయాణాలకు గర్భనిరోధక మాత్రలు వాడితే పరవాలేదు. కానీ నెలల కొద్దీ ప్రయాణంలో వీటి ఉపయోగం మంచిదేనా అనే సందేహం వస్తుంది. అయితే ఇలా దీర్ఘకాలంలో వాటిని వాడటం వల్ల వచ్చే ప్రభావాల్ని తెల్సుకోడానికి ఇప్పటిదాకా ఏ పరిశోధనా జరగలేదు. పరిశోధన చేయడానికి అంతరిక్షంలో ప్రయాణించిన చాలా తక్కువ మంది మహిళలు ఉండటమే దీనికి కారణం.

 

ఎన్ని మాత్రలు?

సంవత్సరాల కొద్ది చేసే అంతరిక్ష ప్రయాణాల్లో ఈ మాత్రల సంఖ్య కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితి. ఒక ప్రయాణం పూర్తయ్యే లోపు దాదాపుగా కనీసం 1100 మాత్రలైనా వాడాల్సి వస్తుందట. కాబట్టి వీటి బరువు కూడా లెక్కలోకి తీసుకుంటారు. అందుకే చాలా మంది చాలా ఎక్కువ రోజులు ఉపయోగపడే రివర్సిబుల్ కాంట్రాసెప్టివ్ విధానాల మీద మక్కువ చూపుతున్నారట. ఇది శ్రేయస్కరమే కాకుండా మంచి ప్రత్యామ్నాయం అని చెప్పొచ్చు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. శ్యానిటరీ న్యాప్‌కిన్ల డిస్పోజల్ సమస్య ఉండదు. అసౌకర్యం అంతకన్నా ఉండదు.

లాభాలుంటాయట:

గర్భనిరోధక మాత్రలు వాడటం వల్ల మహిళా వ్యోమగాములకు కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. గురుత్వాకర్షణ లేని ప్రదేశంలో నెలల తరబడి గడుపాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ల ఎముకల సాంద్రత దెబ్బతింటుందట. మహిళలు, పురుషుల్లో ఈ సమస్య ఉంటుంది. ఎముకల మీద ఏ బలమూ ప్రయోగించబడదు. దాంతో క్రమంగా వాటి బలం తగ్గిపోతుంది. గర్భనిరోధక మాత్రల్లో ఉండే ఈస్ట్రోజెన్ ఆ సమస్య తగ్గిస్తుందనేది నిపుణుల మాట.

 
WhatsApp channel
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024