YS Jagan : ఏపీలో ముఠాల పాలన, ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో దాడులు – వైఎస్ జగన్

Best Web Hosting Provider In India 2024


YS Jagan : ఏపీలో ప్రజాస్వామ్య ప్రభుత్వం స్థానంలో ముఠాల పాలన కనిపిస్తోందని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 2 నెలల కాలంలో ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారుపేరుగా మారిపోయిందని విమర్శించారు. పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావడంలేదని, ప్రభుత్వంలో పెద్దల ప్రోత్సాహంతో జరిగే ఘటనలు, అధికారంలో తమపార్టీ ఉందనే ధీమాతో దాడులు జరుగుతున్నాయన్నారు. రాజకీయ ప్రేరేపిత దుశ్చర్యలు రాష్ట్రంలో ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నాయని మండిపడ్డారు.

 

నంద్యాల జిల్లాలో నిన్న రాత్రి జరిగిన హత్య, ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో జరిగిన దాడి ఘటన వీటికి నిదర్శనాలని జగన్ అన్నారు. ప్రజలకిచ్చిన హామీలను సీఎం చంద్రబాబు నిలబెట్టుకోలేకపోవడంతో, ఎవరూ ప్రశ్నించకూడదని, రోడ్డుపైకి రాకూడదని ప్రజలను, వైసీపీ నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడానికి ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ దారుణాల బాధితులకు అండగా ఉంటూ, పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు.

 

దాడి చేసింది టీడీపీ నేతలే? -వైసీపీ ఆరోపణ

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం నవాబుపేటలో వైయస్ఆర్సీపీ నాయకుడు గింజుపల్లి శ్రీనివాసరావు టిఫిన్ చేయడానికి హోటల్ వద్దకు వెళ్లగా కొందరు వ్యక్తలు దాడికి పాల్పడ్డారు. టీడీపీ నేతలు దాడి చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. శ్రీనివాసరావుపై కర్రలతో దాడికి చేశారు. ఈ దాడిలో ముగ్గురు గాయపడ్డారు. ఏపీలో రోజురోజుకీ లా అండ్ ఆర్డర్ దిగజారిపోతుందని వైసీపీ ఆరోపిస్తుంది. నంద్యాల జిల్లా మ‌హానంది మండ‌లం సీతారాంపురానికి చెందిన కొందకు వ్యక్తులు సుబ్బారాయుడు ఇంటిపై అర్ధరాత్రి రాళ్లు, కర్రలతో దాడి చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ దాడిలో సుబ్బారాయుడు భార్యకు కూడా తీవ్రగాయాలయ్యాయి.

 

నంద్యాల జిల్లాలో శనివారం అర్ధరాత్రి వైసీపీ నేత సుబ్బారాయుడిని అతి దారుణంగా హత్య చేశారు. మహానంది మండలం సీతారామపురంలో వైసీపీ నేత సుబ్బరాయుడిని కొంతమంది దుండగులు రాళ్లతో కొట్టి హత్య చేశారు. దాదాపు 40 మంది దుండగులు దాడి చేసినట్లు తెలుస్తోంది. గ్రామానికి చెందిన టీడీపీ నాయకులే తన భర్తను హత్య చేశారని సుబ్బరాయుడు భార్య ఆరోపిస్తు్న్నారు. ఈ ఘటనపై వైసీపీ అధినేత జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ముఠాల పాలన కనిపిస్తోందని మండిపడ్డారు.

 

సుబ్బరాయుడిని కిరాతకంగా హత్య చేస్తున్నప్పటికీ పోలీసులు అడ్డుకోలేదని కొందరు గ్రామస్తులు ఆరోపించారు. పోలీసులకు ఫోన్ చేసిన సకాలంలో స్పందించలేదన్నారు. దాదాపు రెండున్నర గంటల తర్వాత పోలీసులు గ్రామానికి వచ్చారన్నారు. పోలీసుల సమక్షంలోనే సుబ్బరాయుడిని హత్య చేశారని వైసీపీ ఆరోపిస్తుంది.

 

 

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్

YsrcpYs JaganChandrababu NaiduTdpAndhra Pradesh NewsTrending ApAp Politics
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024