CM Revanth In US: రాష్ట్రాలతో కాదు.. ప్రపంచ దేశాలతోనే హైదరాబాద్‌‌ పోటీ పడుతోందన్న రేవంత్ రెడ్డి

Best Web Hosting Provider In India 2024

CM Revanth In US: తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యమే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అమెరికా పర్యటన ప్రారంభమైంది. అమెరికా చేరుకున్న రేవంత్‌ రెడ్డికి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. పెట్టుబడుల్ని ఆకర్షించడంలో తమకు ఇతర రాష్ట్రాలతో పోటీ లేదని, బెంగుళూరు, చెన్నై, ముంబై వంటి నగరాలతో పోటీ పడటం లేదని ఇతర దేశాలతోనే తమకు పోటీ ఉందని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

 

తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధితో పాటు పెట్టుబడుల కల్పన ద్వారా ఉద్యోగాల కల్పన, ఉపాధి కల్పనకు దోహదం చేసే పెట్టుబడులు తీసుకరావడం, వ్యూహాత్మక భాగస్వామ్యాలు చేసు కోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ప్రారంభించారు. విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి అభిమానులు ఘన స్వాగతం పలికారు.

అమెరికా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారుల బృందం ఉన్నారు. న్యూయార్క్ విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వ బృందానికి ఘన స్వాగతం లభించింది.

విమానాశ్రయంలో పలువురు ప్రవాస భారతీయులు, తెలుగు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ అభిమానులు, పారిశ్రామికవేత్తలు రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చాలు అందజేసి ఆహ్వానం పలికారు. న్యూయార్క్ నగరం నుంచే పెట్టుబడుల సాధన పర్యటన ప్రారంభించడంపై రేవంత్‌ హర్షం వ్యక్తం చేశారు.

తెలుగు సోదర సోదరీమణులు గుండెల నిండా ప్రేమతో తమకు స్వాగతం పలకడానికి విచ్చేసారని పెట్టుబడుల సాధన కోసం చర్చలను ప్రారంభించడానికి తాను ఆసక్తిగా ఉన్నానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌ పెట్టుబడుల్ని ఆకర్షించడంలో ఇప్పటికే ఎవరికి అందనంత ఎత్తుకు చేరిందని చెప్పారు.

 

దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో తెలంగాణకు ఎలాంటి పోటీ లేదని ఇతర దేశాలే తమకు పోటీ అని ప్రకటించారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అమెరికాలో అన్ని రంగాలను భారతీయులు ప్రభావం చూపుతున్నారని, రియల్‌ ఎస్టేట్‌ను శాసిస్తున్నారని గుర్తు చేశారు.

తెలంగాణను మరింత గొప్పగా అభివృద్ధి చేసుకోవడం కోసమే పర్యటన చేపట్టినట్టు చెప్పారు. న్యూయార్క్ నుంచి మొదలైన ఈ పెట్టుబడుల సాధన పర్యటన పది రోజుల పాటు సాగనుంది. రానున్న 10 రోజుల్లో అమెరికా, దక్షిణ కొరియాలోని వివిధ నగరాల్లో సమావేశాలు, చర్చలు జరగనున్నాయి. సీఎం పర్యటనలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొంటారు.

WhatsApp channel
 

టాపిక్

 
UsNri NewsNri News Usa TeluguCm Revanth ReddyHyderabad
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024