IRCTC Tirumala Tour Package : తక్కువ ఖర్చుతో తిరుమల శ్రీవారి దర్శనం-విశాఖ నుంచి ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవే

Best Web Hosting Provider In India 2024

IRCTC Tirumala Tour Package : తిరుమల శ్రీవారిని ఏడాదిలో కనీసం ఒక్కసారైనా దర్శించుకోవాలని భక్తులు భావిస్తుంటారు. అయితే తిరుమల దర్శనం అంత సులభం మాత్రం కాదు, దర్శన టికెట్లు, వసతి సదుపాయం ఇలా ఎంతో వ్యయప్రయాసలు ఉంటాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఐఆర్సీటీసీ విశాఖ నుంచి తిరుమల శ్రీవారి దర్శనం ఎయిర్ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం, తిరుచానూరు, తిరుమల, తిరుపతి ప్యాకేజీ అందిస్తోంది. రూ.20 వేల ప్రారంభ ధరలో విశాఖపట్నం నుంచి తిరుపతి ఎయిర్ టూర్ ప్యాకేజీని అందుబాటులో తెచ్చింది. మూడు రోజుల పాటు ఎయిర్ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. తదుపరి టూర్ ఆగస్టు 9, 23 తేదీల్లో అందుబాటులో ఉంది.

విమాన వివరాలు

తేదీ సెక్టార్ఫ్లైట్ నెంప్రారంభమయ్యే సమయంచేరుకునే సమయం
ఆగస్టు 9, 23 తేదీలుVTZ-TIR6E706310.2512.10
ఆగస్టు 11, 23 తేదీలుTIR-VTZ6E706417.0018.35

ఒక్కో వ్యక్తి ధర(09.08.2024)

క్లాస్సింగిల్ ఆక్యుపెన్సీడబుల్ ఆక్యుపెన్సీట్రిపుల్ ఆక్యుపెన్సీచైల్డ్ విత్ బెడ్(5-11 ఏళ్లు)చైల్డ్ వితవుట్ బెడ్(2-4 ఏళ్లు)
కంఫర్ట్రూ.23565రూ.20195రూ.20000రూ.18375రూ.17880

ఒక్కో వ్యక్తి ధర(23.08.2024)

క్లాస్సింగిల్ ఆక్యుపెన్సీడబుల్ ఆక్యుపెన్సీట్రిపుల్ ఆక్యుపెన్సీచైల్డ్ విత్ బెడ్(5-11 ఏళ్లు)చైల్డ్ వితవుట్ బెడ్(2-4 ఏళ్లు)
కంఫర్ట్రూ.24180రూ.20810రూ.20615రూ.18995రూ.18500

2 ఏళ్ల లోపు వయసున్న చిన్నారులకు రూ. 1500 నేరుగా విమానాశ్రయ కౌంటర్లలో చెల్లించాల్సి ఉంటుంది. తిరుమలతో పాటు పలు దేవాలయాల దర్శనాలకు భక్తులు తప్పనిసరి డ్రెస్ కోడ్ పాటించాలి.

  • జెంట్స్ : ధోతీ (తెలుపు), షర్టులు లేదా కుర్తాలు, పైజామా
  • లేడీస్ : చీర లేదా సల్వార్ ఖమీజ్
  • పర్యాటకులు ఆలయాల దర్శన సమయాల్లో టీ-షర్టులు, జీన్స్ దుస్తులను ధరించకూడదు.

టూర్ సర్క్యూట్‌లు వివరాలు : విశాఖపట్నం – తిరుపతి – కాణిపాకం – శ్రీనివాస మంగాపురం – శ్రీకాళహస్తి – తిరుచానూరు – తిరుమల – తిరుపతి – గోవిందరాజస్వామి ఆలయం – ఇస్కాన్ ఆలయం – విశాఖపట్నం

టూర్ వివరాలు :

డే 01 : విశాఖపట్నం -తిరుపతి

విశాఖపట్నం ఎయిర్ పోర్టు నుంచి ఉదయం 10:25 గంటలకు విమానం బయలుదేరుతుంది. మధ్యాహ్నం 12:10 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. తిరుపతి విమానాశ్రయం నుంచి పికప్ చేసి హోటల్ లో చెక్-ఇన్ చేస్తారు. హోటల్‌లో ఫ్రెష్ అయ్యి భోజనం చేసిన తర్వాత కాణిపాకం, శ్రీనివాస మంగాపురం ఆలయాల సందర్శనానికి వెళ్తారు. సాయంత్రం తిరిగి హోటల్‌కి చేరుకుని రాత్రికి హోటల్లోనే బస చేస్తారు.

డే 02 : తిరుపతి

హోటల్‌లో బ్రేక్ ఫాస్ట్ తర్వాత తిరుమల వెంకటేశ్వరుని దర్శనం కోసం వెళ్తారు. దర్శనం తర్వాత లంచ్ చేసి, శ్రీకాళహస్తి, తిరుచానూరు ఆలయాల సందర్శనకు తీసుకెళ్తారు. సాయంత్రం తిరిగి హోటల్‌కి చేరుకుని రాత్రికి హోటల్ బస చేస్తారు.

డే 03 : తిరుపతి -విశాఖపట్నం

బ్రేక్ ఫాస్ట్ తర్వాత, హోటల్ నుంచి చెక్ అవుట్ చేస్తారు. గోవింద రాజస్వామి దేవాలయం, ఇస్కాన్ ఆలయాలను సందర్శిస్తారు. మధ్యాహ్నం 3:00 గంటలకు తిరుపతి ఎయిర్ పోర్టులో డ్రాప్ చేస్తారు. సాయంత్రం 5 గంటలకు విశాఖకు తిరుపతి నుంచి విమానం బయలుదేరుతుంది. సాయంత్రం 6:35 గంటలకు విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.

విశాఖపట్నం-తిరుపతి ఐఆర్సీటీసీ ఎయిర్ టూర్ ప్యాకేజీ పూర్తి వివరాలు కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి

https://www.irctctourism.com/pacakage_description?packageCode=SCBA40A

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్

IrctcIrctc PackagesTirumalaTirupatiTemplesVisakhapatnam
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024