OTT Thriller Movie: ఓటీటీలోకి తెలుగులో వస్తున్న తమిళ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Best Web Hosting Provider In India 2024

తమిళ థ్రిల్లర్ డ్రామా సినిమా ‘బర్త్‌మార్క్’ ఫిబ్రవరి 23న థియేటర్లలో రిలీజ్ అయింది. షబీర్ కల్లరక్కల్, మిర్నా మీనన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. విక్రమ్ శ్రీధరన్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ బర్త్‌మార్క్ చిత్రం ఇప్పుడు తెలుగు డబ్బింగ్‍తో రానుంది. తెలుగు వెర్షన్ ఓటీటీలోకి అడుగుపెట్టనుంది.

ఓటీటీ రిలీజ్ డేట్, ప్లాట్‍ఫామ్

బర్త్‌మార్క్ సినిమా తెలుగులో ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఆగస్టు 8వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చింది. “లోకం చూడబోతున్న శిశువు.. కానీ కాలమే తన శత్రువు. ఆగస్టు 8న ఆహాలో బర్త్‌మార్క్ ప్రీమియర్ అవుతుంది” అని ఆహా నేడు (ఆగస్టు 5) సోషల్ మీడియాలో వెల్లడించింది.

బర్త్‌మార్క్ సినిమాను థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కించారు డైరెక్టర్ విక్రమ్ శ్రీధరన్. షబీర్ కల్లరక్కల్, మిర్నా మీనన్ లీడ్ రోల్స్ చేయగా.. పోర్కొడి సెంథిల్, ఇంద్రజిత్, దీప్తి ఒరియెంతెలు, పీఆర్ వరలక్ష్మి, కవిత సురేశ్ కీలకపాత్రలు పోషించారు. విశాల్ చంద్రశేఖర్ ఈ మూవీకి మ్యూజిక్ అందించారు.

బర్త్‌మార్క్ సినిమా కథ బాగుందంటూ ప్రశంసలు వచ్చాయి. అయితే, కథనం విషయంలోనే మిశ్రమ స్పందన వచ్చింది. సాగదీతగా అనిపించిందనే టాక్ వచ్చింది. ఈ మూవీకి థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ దక్కింది. ఈ సినిమాను సపీన్స్ ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై శ్రీరామ్ శివరామన్, విక్రమ్ శ్రీధరన్ నిర్మించారు.

బర్త్‌మార్క్ స్టోరీలైన్

భారత ఆర్మీ లెఫ్టినెంట్ డానియెల్ (షబీర్ కల్లరక్కల్), గర్భిణిగా ఉండే ఆయన భార్య జెన్నిఫర్ (మిర్నా మీనన్) చుట్టూ బర్త్‌మార్క్ స్టోరీ తిరుగుతుంది. యుద్ధ భూమిలో పట్టుబడిన డానియెల్ ఆరు నెలల తర్వాత మళ్లీ తిరిగి ఇంటికి వస్తాడు. అప్పుడు అతడి భార్య జెన్నిఫర్ గర్భిణిగా ఉంటుంది. ఆమెకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీంతో సహజంగా ప్రసవం చేసే కేరళలోని ఓ గ్రామానికి జెన్నిఫర్‌ను డానియెల్ తీసుకెళతాడు. అయితే, అక్కడ మందులు కానీ, ఆసుపత్రులు ఏమీ ఉండవు. జెన్నీఫర్‌కు అక్కడ కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే, ఆపరేషన్ లేకుండా సహజ ప్రసవం కోసం ఈ గ్రామంలోనే ఉండాలని జెన్నిఫర్ చెబుతాడు. అయితే, తన కడుపులోని బిడ్డకు కావాలనే ప్రమాదంల తలపెట్టేందుకు ఎవరో ప్రయత్నిస్తున్నారని జెన్నిఫర్‌కు అర్థమవుతుంది. అసలు డానియెల్, జెన్నిఫర్ ఆ గ్రామానికి వేరే కారణం ఇంకేమైనా ఉందా? వారికి ఎదురైన సవాళ్లు ఏంటి? బిడ్డకు ఆమె ఇబ్బందులు లేకుండా జన్మనిచ్చారా? ప్రమాదం తలపెట్టాలని అనుకున్నదెవరు? అనే విషయాలు బర్త్‌మార్క్ మూవీలో ప్రధానంగా ఉంటాయి.

బర్త్‌మార్క్ సినిమా తమిళ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రెంట్‍కు అందుబాటులో ఉంది. అయితే, తెలుగు ఆహాలో అందుబాటులోకి వచ్చేస్తోంది. ఈ వారమే ఆగస్టు 8 నుంచి ఈ మూవీని తెలుగులో ఆహా ఓటీటీలో చూడొచ్చు.

తమిళ నటి మిర్నా మీనన్ 2016లో పట్టథారి చిత్రంతో తెరంగేట్రం చేశారు. 2022లో క్రేజీ ఫెలోస్ మూవీతో తెలుగులోనూ అడుగుపెట్టారు. అల్లరి నరేశ్ మూవీ ఉగ్రమ్‍లోనూ నటించారు. అయితే, గతేడాది జైలర్ చిత్రంలోనే మిర్నాకు బాగా పాపులర్ అయ్యారు. రజినీకాంత్ హీరోగా నటించిన ఆ చిత్రంలో వసంత్ రవికి జోడీగా మిర్నా మీనన్ నటించారు.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024