Organs Transporting Guidelines : మెుదటిసారిగా అవయవ రవాణా మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం

Best Web Hosting Provider In India 2024


మొదటిసారిగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మానవ అవయవాలను ఎయిర్, రోడ్డు, రైలు, నీటి ద్వారా రవాణా చేయడానికి మార్గదర్శకాలను విడుదల చేసింది. అవయవ రవాణా ప్రక్రియను సులభతరం చేయడం ద్వారా త్వరగా ఉపయోగించేందుకు ఆస్కారం ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

 

అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న వారికి కొత్త ఆశలు కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఈ మార్గదర్శకాలు నాణ్యతా ప్రమాణాలకు కట్టుబడి ఉండేలా దేశవ్యాప్తంగా అవయవ పునరుద్ధరణ, మార్పిడి సంస్థలకు మార్గదర్శకాలు విడుదల చేశారు.

 

వాస్తవానికి అవయవ దాత, గ్రహీత ఇద్దరూ ఒకే నగరంలో లేదా వివిధ నగరాల్లోని వేర్వేరు ఆసుపత్రులలో ఉన్నప్పుడు, సజీవ అవయవాన్ని ఆసుపత్రుల మధ్య రవాణా చేయాలి. ఇందుకోసం కొన్ని నియమాలు అవసరం. వాటి గురించి చూద్దాం..

 

ఎయిర్‌క్రాఫ్ట్‌లో అవయవాలను రవాణా చేయాలంటే విమానంలో కెప్టెన్ ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలి. ఎయిర్‌పోర్ట్, ఎయిర్‌లైన్ సిబ్బంది అంబులెన్స్‌లకు అవయవాలు ఉన్న పెట్టెలను తీసుకెళ్లడానికి ట్రాలీలను ఏర్పాటు చేస్తారు. ఇది ఎటువంటి సమస్య లేకుండా బయటకు తీసుకురావడానికి సహాయపడుతుంది.

 

స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(SOP) ప్రకారం, అంబులెన్స్‌లు, ఇతర వాహనాల ద్వారా అవయవాలను రవాణా చేయడానికి నిర్దిష్ట అధికారులు లేదా ఏజెన్సీల అభ్యర్థనపై గ్రీన్ కారిడార్‌లు ఏర్పాటు చేయాలి. ఇందుకు సంబంధించి పోలీసు శాఖ నుంచి నోడల్ అధికారిని కూడా నియమించనున్నారు.

 

అవయవ మార్పిడి కోసం, మెట్రో స్టేషన్‌కు చేరుకునే వరకు అవయవ పేటికను మోసుకెళ్లే క్లినికల్ బృందంతో పాటు మెట్రో సెక్యూరిటీ గార్డు ఉండాలి. ఈ మేరకు భద్రతా తనిఖీల్లో జాప్యం జరగకుండా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు.

 

ఆర్గాన్ బాక్స్‌ను సరైన స్థానం, దిశలో ఉంచాలి. అంటే రవాణా సమయంలో ఉపరితలంపై నిటారుగా ఉంచాలి. అవయవ పెట్టెపై ‘జాగ్రత్తతో చూసుకోండి’ అనే లేబుల్‌ను ఉంచవచ్చు.

 

ఎక్కువ భద్రత కోసం ఆర్గాన్ బాక్స్‌ను సీట్ బెల్ట్‌తో భద్రపరచాలని మార్గదర్శకాలలో పేర్కొన్నారు.

 

అవయవ రవాణా నియమాలు NITI ఆయోగ్, సంబంధిత మంత్రిత్వ శాఖలు, నిపుణులతో సంప్రదించి అభివృద్ధి చేశారు. నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ (NOTTO) డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. అవయవాన్ని రవాణా చేయడం చాలా క్లిష్టమైన చర్య, ఎందుకంటే అవయవానికి పరిమిత షెల్ఫ్ జీవితం ఉంటుంది. దాని రవాణాలో వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయం ఉండాలి.. అని పేర్కొన్నారు.

 

‘అవయవ రవాణా ప్రక్రియను క్రమబద్ధీకరించడం ద్వారా విలువైన అవయవాల వినియోగాన్ని పెంచడం, మార్పిడి కోసం ఎదురుచూస్తున్న రోగులకు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ SOPలు దేశవ్యాప్తంగా ఉన్న అవయవ పునరుద్ధరణ, మార్పిడి సంస్థలకు ఉత్తమ పద్ధతులు పాటించేలా చేస్తాయి. ప్రమాణాలకు కట్టుబడి ఉండేలా ఒక రోడ్‌మ్యాప్ ఉంటుంది.’ అని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు.

 

టాపిక్

Best Web Hosting Provider In India 2024

Source link