National Merit Scholarship:ఇంటర్ పాసైన విద్యార్థులకు గుడ్ న్యూస్, అక్టోబర్ 31 వరకు నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ దరఖాస్తులు

Best Web Hosting Provider In India 2024

National Merit Scholarship : 2024లో ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు మెరిట్ స్కాలర్ షిప్ పొందే సదవకాశం లభించింది. ఇంటర్ పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అయిన విద్యార్థులు ‘నేషనల్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌’కు దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్‌బోర్డు ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇంటర్ పూర్తైన విద్యార్థులకు నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ అందిస్తోంది. 2024లో ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు ఫ్రెష్ గా దరఖాస్తు చేసుకునేందుకు, అలాగే గతంలో దరఖాస్తు చేసుకున్న వారు అప్లికేషన్ రెన్యువల్ చేసుకునేందుకు అక్టోబర్ 31, 2024 వరకు అవకాశం కల్పించారు. విద్యార్థులు https://scholarships.gov.in/ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది ఇంటర్ వార్షిక పరీక్షల్లో టాప్ 20 పర్సంటైల్ వచ్చిన మొత్తం విద్యార్థులు 59355 ఉన్నారు.

 

ఇంటర్‌ మార్కుల్లో టాప్‌-20 పర్సంటైల్‌లో నిలిచిన విద్యార్థుల జాబితా tgbie.cgg.gov.in వెబ్ సైట్ లో పొందుపర్చారు. మొత్తం 59,355 మంది విద్యార్థులు నేషనల్ మెరిట్ స్కాలర్‌ షిప్‌ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ఇంటర్ వెల్లడించింది. https://scholarships.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు.

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 2024-25 విద్యాసంవత్సరానికి దరఖాస్తులకు అక్టోబర్ 31 వరకు అవకాశం కల్పించారు. ఈ స్కాలర్ షిప్ నకు దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులు ముందుగా https://scholarships.gov.in/ అధికారిక వెబ్ సైట్ లో వన్-టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) చేసుకోవాలి.

కోటక్ స్కాలర్ షిప్

కార్పొరేట్ సంస్థలు సామాజిక సేవలో భాగంగా విద్యార్థులకు స్కాలర్ షిప్ లు అందించేందుకు ముందుకు వస్తున్నాయి. కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ విద్యార్థులకు ఏడాదికి రూ. 1.5 లక్షల స్కాలర్ షిప్ అందించనున్నట్లు ప్రకటించింది. ఉన్నత చదువులకు ఆర్థిక స్థోమత లేక కొందరు విద్యార్థులు ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి ఆర్థికంగా ఆదుకునేందుకు కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ కోటక్ కన్యా స్కాలర్ షిప్ 2024-25 పేరుతో ప్రతిభావంతులైన బాలికల ఉన్నత చదువులకు స్కాలర్‌ షిప్ అందిస్తోంది.

 

ఇంటర్ లో 75 శాతం మార్కులు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 30 లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, బీడీఎస్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బీ, బీఫార్మసీ, నర్సింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరే విద్యార్థినులు అప్లై చేసుకోవచ్చు. విద్యార్థినుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.6 లక్షల లోపు ఉండాలి. వారి ఆదాయ ధృవీకరణ సర్టిఫికెట్ దరఖాస్తు సమయంలో సమర్పించారు. స్కాలర్‌ షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి రూ.1.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తారు. విద్యార్థినులు ఈ లింక్ లో https://www.buddy4study.com/page/kotak-kanya-scholarship దరఖాస్తు చేసుకోవచ్చు.

 

 

 
WhatsApp channel
 

సంబంధిత కథనం

టాపిక్

 
Telangana NewsTrending TelanganaScholarshipsStudent ScholarshipsTs Intermediate
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024