Lakshya Sen: చిక్కినట్లే చిక్కి చేజారిన మెడల్.. బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో బోల్తా పడిన లక్ష్య సేన్

Best Web Hosting Provider In India 2024


Lakshya Sen: పారిస్ ఒలింపిక్స్ 2024లో ఎన్నో ఆశలు రేపిన స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్య సేన్ తృటిలో మెడల్ కోల్పోయాడు. సోమవారం (ఆగస్ట్ 5) మలేషియా ప్లేయర్ లీ జియాతో జరిగిన బ్రాంజ్ మెడల్ మ్యాచ్ లో లక్ష్య 21-13, 16-21, 11-21 తేడాతో లక్ష్య ఓడిపోయాడు. ఒక దశలో మెడల్ ఖాయమని అనిపించినా.. తర్వాత అతడు గాడి తప్పాడు.

మెడల్ చిక్కినట్లే చిక్కి..

ఒలింపిక్స్ చరిత్రలో బ్యాడ్మింటన్ సింగిల్స్ సెమీఫైనల్ చేరిన తొలి ఇండియన్ మేల్ ప్లేయర్ గా రికార్డు క్రియేట్ చేసిన లక్ష్య సేన్.. మెడల్ గెలిచి చరిత్ర సృష్టించేలా కనిపించాడు. ఈ మ్యాచ్ లో అతడు చాలా దూకుడుగా కనిపించాడు. మలేషియా ప్లేయర్ లీ జియాపై తొలి గేమ్ ను చాలా సులువుగా 21-13తో గెలిచాడు. తర్వాతి గేమ్ లోనూ ఒక దశలో 8-3 ఆధిక్యంలో నిలిచాడు. అయితే ఇక్కడి నుంచే కథ మారిపోయింది.

 

అనూహ్యంగా పుంజుకున్న లీ జియా వరుసగా 9 పాయింట్లు సాధించి 12-8 ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. రెండో గేమ్ హోరాహోరీగా సాగింది. లక్ష్య తన పదునైన స్మాష్ లతో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశాడు. అయితే చివరికి లీ జియా దూకుడు ముందుకు నిలవలేక 16-21తో గేమ్ కోల్పోయాడు.

 

ఇక మూడో గేమ్ లో లక్ష్య పూర్తిగా తేలిపోయాడు. రెండో గేమ్ గెలిచి మ్యాచ్ ను సమం చేసిన లీ జియా.. మూడో గేమ్ లో మరింత రెచ్చిపోయాడు. కోర్టులో దూకుడుగా కదులుతూ అన్ని మూలలా పాయింట్లు సాధించాడు. మంచి ఫిట్‌నెస్ ఉన్న లక్ష్య కూడా.. చివరి గేమ్ కు వచ్చేసరికి అలిసిపోయినట్లు కనిపించాడు. మూడో గేమ్ లో అతని బాడీ లాంగ్వేజ్ మ్యాచ్ కోల్పోయినట్లే అన్నట్లుగా అనిపించింది. చివరికి 11-21తో మూడో గేమ్ తోపాటు మ్యాచ్ కూడా ఓడిపోయాడు.

 

ఆ ఇద్దరికే మెడల్స్

ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ చరిత్రలో ఇప్పటి వరకూ ఇద్దరు ఇండియన్ ఫిమేల్ ప్లేయర్స్ మాత్రమే మెడల్స్ సాధించారు. సైనా నెహ్వాల్ బ్రాంజ్ మెడల్.. పీవీ సింధు సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ గెలిచారు. ఇప్పుడు మెడల్ గెలిచిన తొలి ఇండియన్ మేల్ ప్లేయర్ గా నిలిచే అద్భుత అవకాశం లక్ష్యకు దక్కినా చివరి మెట్టుపై బోల్తా పడ్డాడు. అటు ఇదే ఒలింపిక్స్ లో మెడల్ ఆశలు రేపిన సాయి సాత్విక్, చిరాగ్ శెట్టి జోడీ కూడా నిరాశ పరిచిన విషయం తెలిసిందే.

 

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source link