Guppedantha Manasu August 7th Episode: గుప్పెడంత మనసు- ఎండీ సీటుపై దేవయాని కొత్త ప్లాన్- రిషిని రంగా అని నిరూపించలేమంటూ!

Best Web Hosting Provider In India 2024

Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో తమ ఇంటికి వెళ్లిపోతామని మహేంద్ర అంటాడు. ఎందుకు వద్దన్నా కూడా వెళ్లిపోతానని అంటావ్. కొడుకు కోడలు వచ్చేసరికి రెక్కలు వచ్చాయి. మీ అన్నయ్య గురించి నువ్ ఆలోచించట్లేదు అని దేవయాని అంటుంది. ఎందుకిలా అంటున్నావ్. నా తమ్ముడు నా గురించి ఆలోచించట్లేదని ఎలా అంటావ్ అని ఫణీంద్ర అంటాడు.

 

నాకు ఇష్టం లేదు

లేకపోతే ఏంటండి ఇంత చెప్పినా వెళ్లిపోతా అంటున్నాడు అని దేవయాని అంటుంది. వదినా గారు మీరు ఎంత చెప్పినా నేను వినను. వెళ్లిపోతాను అని మహేంద్ర అంటాడు. వామ్మో ఎంత చెప్పిన వినేలా లేరే. ఒకవేళ అక్కడికి వెళ్తే రంగా గాడు దొరికిపోతే పరిస్థితి ఏంటీ అని మహేంద్ర లోపల భయపడిపోతు ఉంటాడు. మహేంద్ర మీరు వెళ్లడం నాకు కూడా ఇష్టం లేదు. మీరు వెళ్లిపోతే మళ్లీ ఇంటి కళపోతుంది. మళ్లీ మా జీవితాల్లోని సంతోషం కనుమరుగైపోతుంది అని ఫణీంద్ర అంటాడు.

ఇన్నాళ్లు చాలా కష్టాలు పడ్డాం. ఇప్పుడు మన పరిస్థితులు మారాయి. మన రిషి, వసుధార వచ్చారు. మహేంద్ర నాకోసం ఇక్కడ ఉండలేరా అని ఫణీంద్ర అంటాడు. అందరం కలిసి ఉందాం. మీరు అక్కడ మేము ఇక్కడ ఎందుకు అని ధరణి అంటుంది. ఇంతలో వచ్చిన వసుధార, రిషి వస్తారు. కాలేజీకి వెళ్తామని చెబుతారు. అన్నయ్య వాళ్లు మనల్ని ఇక్కడే ఉందామంటున్నారు. ఉందామా అని వసుధారను అడుగుతాడు మహేంద్ర. రిషి వైపు చూసిన వసుధార మీరు ఏమనుకుంటున్నారు అని అడుగుతుంది.

కోడలి ఇష్టప్రకారమే

నీ ఇష్టం వసుధార. నువ్ ఎక్కడికి వెళ్దాం అంటే అక్కడికి వెళ్దాం అని మహేంద్ర అంటాడు. నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు మావయ్య. కాలేజీ నుంచి వచ్చాకా సాయంత్రం ఇక్కడి నుంచి వెళ్లిపోదాం అని వసుధార చెబుతుంది. వసుధార, రిషి వెళ్లిపోతారు. సారీ అన్నయ్యా. వసుధార ఇష్టాన్ని నేను కాదనలేను. ఏ విషయంలో అయినా తన ఇష్టప్రకారమే నడుచుకుంటాను అని మహేంద్ర చెప్పి వెళ్లిపోతాడు. మీరు మౌనంగా ఉంటారేంటీ. ఆర్డర్ వేస్తే ఇక్కడే ఉంటారు కదా అని దేవయాని అంటుంది.

 

నేను చెప్పి చూశాను కదా. నేను ఆర్డర్ వేయను. వాళ్లు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటే చాలు అని ఫణీంద్ర చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు రిషి, వసుధార రావడంపై ఏంజెల్ సంతోషిస్తుంది. మను, అనుపమ సైలెంట్‌గా ఉంటే.. వాళ్లు రావడం మీకు ఇష్టం లేదా అని ఏంజెల్ అడుగుతుంది. వాళ్లు రావడం నాకే ఎంతో సంతోషాన్ని ఇస్తుందని అనుపమ అంటుంది. మనం వెళ్లి వసుధార, రిషిని కలుద్దాం. కాలేజీకి వెళ్దాం అని ఏంజెల్ అంటుంది. లేదని, చెప్పిన నీకు అర్థం కాదని అనుపమ అంటుంది.

రిషి నాకు బెస్ట్ ఫ్రెండ్

మీకు ఎందుకత్తయ్య అంత పంతం, కోపం అని ఏంజెల్ అంటుంది. నాకు ఎవరి మీద కోపం, పంతం లేవు. నాకున్న పరిస్థితుల వల్ల నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. దానికి కట్టుబడే ఉంటాం. నేను, నా కొడుకు ఆ కాలేజీకి రాం. కావాలంటే నువ్ వెళ్లు. నాకు అభ్యంతరం లేదు అని అనుపమ చెప్పి వెళ్లిపోతుంది. రిషి నాకు బెస్ట్ ఫ్రెండ్. నాకు తోడుగా కాలేజీకి నాతోపాటు నువ్ కూడా రా అని ఏంజెల్ అంటుంది. నేను నీతో వస్తాను. కానీ, కాలేజీకి రాలేను అని మను అంటాడు.

 

నాతో రా.. కానీ కాలేజీ గేట్ దగ్గరే ఆగిపో అని ఏంజెల్ అంటుంది. కానీ, గేట్ దగ్గరికి వచ్చాకా మళ్లీ కాలేజీలోకి రమ్మనమని అడగొద్దు అని మను అంటాడు. సరే నీ ముందు చూపు బాగానే ఉంది గానీ, రమ్మనమని చెప్పను అని ఏంజెల్ అంటుంది. సరే కానీ, ఈ విషయం అమ్మకు చెప్పొద్దు అని మను అడుగుతాడు. మీ తల్లికొడుకుల బంధం ఏంటో అర్థం కాదు అని అన్న ఏంజెల్ ఒప్పుకుంటుంది. మరోవైపు శైలేంద్ర బీపీ చెక్ చేసుకుంటాడు.

రంగా గాడు ఏం చేయాలి

దేవయాని వచ్చి ఏమైందిరా అని అడుగుతుంది. నేను ఎండీ కాకుండానే చనిపోతానని అనిపిస్తుందని శైలేంద్ర కంగారు పడిపోతుంటాడు. నాకు ఇంతకుముందు వచ్చిన పీడకలలు అన్ని నిజమయ్యాయి. ఇది కూడా నిజమైపోతుందని భయమేస్తుంది. గుండె పట్టేసినట్లు అవుతుంది. నా లక్ష్యం కోసమే కదా ఇన్ని తిప్పలు అని శైలేంద్ర అంటాడు. అదంతా పక్కన పెట్టి ఆ రంగా గాడు ఏం చేయాలి ఎలా చేయాలి అనేది ఆలోచించు అని దేవయాని అంటుంది.

నా మైండ్ బ్లాక్ అయింది. నువ్వే ఆలోచించు అని శైలేంద్ర అంటాడు. వసుధార చనిపోయిందనుకు ఈ ప్లాన్ వేశాం. కానీ, వసుధార వచ్చింది. ఇప్పుడు వాళ్లు సాయంత్రం ఇంటికి వెళ్లిపోతారు. రంగా గాడు వసుధార మాటలు వినో, ఆస్తిమీద కన్ను పడే డీల్ లేదు ఏం లేదు. నేను పర్మనెంట్‌గా రిషిలా ఉంటానని చెబితే మనం ఏం చేయలేం. అప్పుడు ఎవరు వచ్చిన వాడు రంగా అని నమ్మించలేం. కాబట్టి ఏం చేసినా ఇప్పుడే చేయాలి. మనకు కావాల్సింది ఎండీ సీటు. ఆ రంగా గాడితోనే ఆ ఎండీ సీటు దక్కించుకోవాలి. అందుకు ఓ పని చేయాలి అని శైలేంద్రకు దేవయాని కొత్త ప్లాన్ చెబుతుంది.

 

అంతా మన దగ్గరికి రావాల్సిందే

వావ్.. చాలా మంచి పాయింట్ పట్టావ్ మమ్మీ. ఇకచూడు నేను కాలేజీలో రెచ్చిపోతాను అని శైలేంద్ర అంటాడు. ఇంతకుముందు నేను వేసినా అన్ని ప్లాన్స్ ఫెయిల్ చేశావ్. ఇది మన చిట్ట చివరి ప్లాన్. దీన్ని గనుక ఫెయిల్ చేశావో అని దేవయాని అంటుంటే.. లేదు మామ్. నువ్ అనుకుంది సాధించి చూపిస్తాను. నేను ఇప్పుడే కాలేజీకి వెళ్లి మన ప్లాన్ అమలు చేస్తాను. దెబ్బకు అంతా మన దగ్గరికి రావాల్సిందే. ఎండీ సీటు మనకు కట్టబెట్టాల్సిందే అని శైలేంద్ర వెళ్లిపోతాడు.

మరోవైపు కాలేజీలో తమ క్యాబిన్‌లోకి వెళ్తారు రిషి, వసుధార. ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. నువ్ నా మాట కాదనవని నాకు తెలుసు అని రిషి అంటాడు. తర్వాత హార్ట్ తీసి దానికి సంబంధించిన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటాడు రిషి. అది తీసుకుని నేను బాధలో ఉన్నప్పుడు దీన్నే చూసుకుంటూ గడిపేదాన్ని అని వసుధార చెబుతుంది. వాళ్లిద్దరు మొదటిసారి కలిసింది. డ్యాన్స్ చేసింది. రిషి ప్రపోజ్ చేసింది. ఇద్దరూ కలిసి ప్రేమించుకుంది వసుధార గుర్తు చేస్తుంది.

నేను వినిపించుకోలేదు

మొదటి నుంచే నీపై కోపం, ద్వేషం ఉండేది. అది ప్రేమతో ఉన్న కోపమేనేమో. నువ్ ఒక్కరోజు కనిపించకపోయినా నాకు మనశ్శాంతిగా ఉండేది కాదు. నువ్ కనిపిస్తే ఏదో ఒక ఎమోషన్ చూపించేవాన్ని. చివరికి అది ప్రేమ అని అర్థం చేసుకున్నాను. అప్పటికీ అమ్మ నాతో అంది నీ మీద నాకు ఉన్నది ప్రేమ అని. నేనే వినిపించుకోలేదు అని రిషి చెబుతాడు. ఇలా వాళ్ల గురించి, ఒకటే అభిప్రాయం గురించి మాట్లాడుకుంటారు.

 

తర్వాత మన ప్రేమ ఇలాగే ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉంటుంది అని రిషి అంటాడు. నువ్ వర్క్ చూసుకో నేను కాలేజీ చూసి వస్తాను. చాలా రోజులు అయింది కదా అని రిషి వెళ్లిపోతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

WhatsApp channel
 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024