OTT Malayalam: ఓటీటీలో ఈ మలయాళం ఎమోషనల్ మూవీకి సూపర్ రెస్పాన్స్.. మస్ట్ వాచ్ అంటున్న నెటిజన్లు

Best Web Hosting Provider In India 2024

మలయాళంలో కొన్ని సినిమాలు ఎమోషనల్ పాయింట్‍తో హృదయాలను కదిలించేలా, విభిన్న కోణాల నుంచి ఆలోచించేలా చేస్తాయి. ఇలాంటి చిత్రాలకు ఓటీటీల్లో ఇతర భాషల ప్రేక్షకుల నుంచి కూడా ప్రశంసలు దక్కుతుంటాయి. అలాంటి చిత్రమే ‘ఉల్లోరుక్కు’. మలయాళంలో జూన్ 16న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. మంచి కలెక్షన్లు వచ్చాయి. సీనియర్ నటి ఊర్వశి, పార్వతి తిరువోతు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చాక ఈ ‘ఉల్లోరుక్కు’ మూవీకి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

స్ట్రీమింగ్ ఎక్కడ..

ఉల్లోరుక్కు సినిమా ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. మలయాళంలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లిష్ సబ్‍టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి.

ఉల్లోరుక్కు మూవీకి క్రిస్టో టామీ దర్శకత్వం వహించారు. కేరళలో వరదల బ్యాక్‍డ్రాప్‍లో ఈ ఎమోషనల్ ఫ్యామిడీ డ్రామాను తెరకెక్కించారు. జీవితంలో కఠిన పరిస్థితుల్లో పడిన ఇద్దరు మహిళల చుట్టూ ఈ స్టోరీ సాగుతుంది. ఊర్వశి, పార్వతి తిరవోతు ఈ మూవీలో అద్భుతంగా నటించారు. అర్జున్ రాధాకృష్ణన్, వీనా నాయర్, ప్రశాంత్ మురళి కూడా ఈ మూవీలో కీలకపాత్రలు చేశారు.

సూపర్ రెస్పాన్స్

ఉల్లోరుక్కు సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో చూసిన తర్వాత చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఈ మూవీ ఆద్యంతం ఎమోషనల్‍గా హృదయాన్ని హత్తుకునేలా సాగుతుందని, అద్భుతమైన రైటింగ్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు క్రిస్టోను పొగుడుతున్నారు.

మహిళకు బలవంతపు వివాహం ప్రభావం ఎలా ఉంటుందో ఉల్లోరుక్కు సినిమాలో ప్రభావవంతంగా చూపించారని ఓ యూజర్ ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో ప్రతీ సీన్ మనసును కదిలిస్తుందని కొందరు నెటిజన్లు అంటున్నారు. ఈ సినిమాలో ఊర్వశి, పార్వతి అద్భుతంగా నటించారని, ఆ పాత్రల సంఘర్షణ మనసులను కదిలించాయని రాసుకొస్తున్నారు. ఈ చిత్రాన్ని కచ్చితంగా చూడాలనేలా మస్ట్ వాచ్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఎండింగ్ చాలా బాగుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా ఓటీటీలో అద్భుతమైన స్పందన దక్కించుకుంటోంది ఉల్లోరుక్కు.

ఉల్లోరుక్కు స్టోరీలైన్

కేరళలోని అలప్పుజా ప్రాంతంలో వరద బ్యాక్‍డ్రాప్‍లో ఉల్లోరుక్కు మూవీ సాగుతుంది. రాజీవ్ (అర్జున్ రాధాకృష్ణన్)ను అంజు (పార్వతి తిరువోతు) ప్రేమిస్తోందని వారి కుటుంబ సభ్యులకు తెలుస్తోంది. దీంతో రాజీవ్‍కు ఉద్యోగం లేదనే కారణంగా అంజును థామస్‍కుట్టీ (ప్రశాంత్ మురళీ)కి ఇచ్చి బలవంతంగా పెళ్లి చేస్తారు. థామస్‍తో పాటు ఆమె తల్లి లీలమ్మ (ఊర్వశి) కూడా ఉంటారు. థామస్‍తో వివాహం అయినా రాజీవ్‍ను అంజు కలుస్తుంటుంది. ఈ క్రమంలో అతడి వల్ల గర్భవతి అవుతుంది. అయితే, తన కుమారుడు థామస్ వల్లే అంజు గర్భం దాల్చిందని లీలమ్మ అనుకుంటుంది. ఈ క్రమంలో వ్యాధిబారిన పడిన థామస్‍కుట్టీ చనిపోతాడు.

అదే సమయంలో వరదలు భారీగా రావడంతో థామస్ అంత్యక్రియలు చేసేందుకు ఆలస్యమవుతుంది. ఈ కార్యక్రమం చేసేందుకు అంజు, లీలమ్మ ప్రయత్నిస్తుండగా.. వర్షం ఏకధాటిగా పడుతుండటంతో సాధ్యం కాదు. వ్యాధి విషయం ముందే తెలిసిన థామస్‍ తల్లి దాచి పెట్టిందని అంజు తెలుసుకుంటుంది. రాజీవ్‍తో కలిసి వెళ్లి పోవాలని నిర్ణయించుకుంటుంది. అయితే, థామస్ అంత్యక్రియలు ఆలస్యమవుతూ ఉంటాయి. ఆ తర్వాత ఏం జరిగింది? ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనేదే ఉల్లోరుక్కు కథలో ప్రధాన అంశాలుగా ఉంటాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ చిత్రాన్ని చూడొచ్చు.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024