Wheat Kheer: నాగుల పంచమి రోజు నైవేద్యంగా పెట్టే గోధుమల పాయసం.. తయారీ ఇలాగే

Best Web Hosting Provider In India 2024


నాగుల పంచమి రోజు నైవేద్యంగా చాలా చోట్ల వివిధ ప్రసాదాలు నివేదిస్తారు. అందులో ఒకటి గోధుమల పాయసం. తెలంగాణ లోని కొన్ని ప్రాంతాల్లో గోధుమల పాయసం ఈ రోజు ప్రత్యేకంగా నైవేద్యంగా పెడతారు. ఈ పాయసం రుచి ఒక్కసారి తింటే మర్చిపోలేరు. గోధుమలతో పాయసం ఎలా తయారు చేసుకోవాలో వివరంగా చూడండి.

గోధుమల పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు:

3 కప్పుల గోధుమలు

3 కప్పుల బెల్లం

1 కప్పు బియ్యం పిండి

పావు కప్పు గసగసాలు

సగం కప్పు డ్రై ఫ్రూట్స్ (కాజూ, బాదాం, కిస్మిస్)

4 యాలకులు

2 చెంచాల నెయ్యి

గోధుమల పాయసం తయారీ విధానం:

1. ముందుగా గోదుమలను శుభ్రంగా కడిగి కనీసం గంట పాటు నానబెట్టుకోవాలి. దాంతో గోదుమలు నీళ్లు పీల్చుకుని కాస్త తేమగా తయారవుతాయి.

2. తర్వాత నీళ్ల నుంచి తీసిన గోధుమలను ఒక రోలులో వేసి దంచుకోవాలి. దాంతో గోదుమలు కచ్చాపచ్చాగ అయిపోయి కాస్త పొట్టు ఊడిపోతుంది.

3. రోలు లేకపోతే మిక్సీలోనే బరకగా పట్టుకోవాలి. మిక్సీ తిప్పుతూ ఆపేస్తూ ఉంటే కాసేపటికి గోదుమలు చిన్న చిన్న ముక్కల్లా అయిపోతాయి.

4. ఇప్పుడు వీటిని కనీసం రెండు గంటల పాటు మునిగేనన్ని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. తర్వాత కుక్కర్లో వేసుకుని 5 నుంచి 6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి.

5. ఒక కడాయిలో గసగసాలు వేసుకుని వేయించుకోవాలి. అవి చల్లారబెట్టుకోవాలి.

6. గసగసాలు చల్లారిపోయాక మిక్సీలో గసగసాలు, 1 కప్పు బియ్యం పిండి, యాలకులు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.

7. ఈ పొడిలో మరోకప్పు బియ్యం పిండి, నీళ్లు పోసుకుంటూ దోశపిండి లాగా పలుచగా కలుపుకోవాలి.

8. కడాయిలో బెల్లం మునిగేనన్ని నీళ్లు పోసుకుని వేడి చేసుకోవాలి. బెల్లం కరిగాక అందులో ఉడికించుకున్న గోదుమలు, నెయ్యి వేసి నిమిషం పాటు ఉడకనివ్వాలి.

9. వెంటనే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా కలుపుతూ ఉండల్లేకుండా కలుపుకోవాలి. స్టవ్ సన్నం మంట మీద పెట్టుకుని 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి.

10. డ్రై ఫ్రూట్స్ కూడా కాస్త నెయ్యి వేసుకుని వేయించుకోవాలి. వీటిని ఉడుకుతున్న పాయసంలో వేసుకుని కలపాలి. అంతే.. గోదుమల పాయసం రెడీ అయినట్లే. దీన్ని చల్లగా తినాలనుకుంటే ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు. లేదా అలాగే వేడిగా తినేయొచ్చు. పాయసం గట్టిగా అనిపిస్తే కొన్ని ఎక్కువ నీళ్లు పోసుకొని మీ ఇష్టాన్ని బట్టి తయారు చేసుకోవచ్చు.

Source / Credits

Best Web Hosting Provider In India 2024