Kalki 2898 AD Box Office: పతనమవుతున్న కల్కి 2898 ఏడీ కలెక్షన్స్- కానీ, కోట్లల్లో లాభాలు- ఎంతంటే?

Best Web Hosting Provider In India 2024


Kalki 2898 AD Box Office Collection: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కల్కి 2898 ఏడీ. ఇండియన్ మైథాలజీ కాన్సెప్ట్‌తో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన కల్కి మూవీ బాక్సాఫీస్ వద్ద ఇంకా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.

45 లక్షలు మాత్రమే

ఏడో వారంలోకి అడుగుపెట్టిన కల్కి 2898 ఏడీ మూవీ విజయవంతంగా ఇంకా ప్రదర్శితం కావడమే కాకుండా కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపిస్తోంది. కల్కి సినిమాకు ఇండియాలో 43వ రోజున రూ. 45 లక్షల నెట్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి. వాటిలో తెలుగు నుంచి 17 లక్షలు, తమిళం నుంచి లక్ష, హిందీ బెల్ట్ నుంచి రూ. 25 లక్షలు, కర్ణాటక నుంచి లక్ష, మలయాళం నుంచి మరో లక్ష రూపాయల వరకు వచ్చాయి.

6.25 శాతం తగ్గిన కలెక్షన్స్

అయితే, 42వ రోజున వచ్చిన కలెక్షన్స్‌తో పోలిస్తే 43వ రోజున 6.25 శాతం వసూళ్లు తగ్గిపోయాయి. ఇంతకుముందు కోటి రూపాయల వరకు వచ్చే కలెక్షన్స్ అరకోటి దాటలేక పతనం అవుతున్నాయి. ఇక కల్కి 2898 ఏడీ సినిమాకు ఇండియాలో 43 రోజుల్లో రూ. 641.56 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

హిందీలోనే ఎక్కువగా

ఈ కలెక్షన్స్‌లో తెలుగు నుంచి 285.64 కోట్లు, తమిళం నుంచి రూ. 36.02 కోట్లు, హిందీ నుంచి 289.9 కోట్లు, కర్ణాటక నుంచి రూ. 5.85 కోట్లు, మలయాళం నుంచి 24.15 కోట్లు వసూలు అయినట్లు సమాచారం. ఈ లెక్కల ప్రకారం చూస్తే తెలుగు కంటే హిందీలోనే ఎక్కువగా నెట్ కలెక్షన్స్ వసూలు అయినట్లుగా తెలుస్తోంది.

కల్కి 2898 ఏడీ ప్రాఫిట్

ఇక వరల్డ్ వైడ్‌గా కల్కి మూవీకి రూ. 536.81 కోట్ల షెర్ కలెక్షన్స్, రూ. 1055.70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ సంస్థలు వెల్లడించాయి. అలాగే రూ. 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను పూర్తి చేసిన కల్కి 2898 ఏడీ సినిమా రూ. 164.81 కోట్ల లాభాలు రాబట్టింది.

44వ రోజున కోటి

దీంతో వరల్డ్ వైడ్‌గా కల్కి హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా నిలిచింది. కాగా ప్రస్తుతం వచ్చిన సమాచారం ప్రకారం కల్కి 2898 ఏడీ సినిమాకు 44వ రోజున అంటే ఏడో శుక్రవారం (ఆగస్ట్ 9) రూ. కోటి వరకు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషించాయి. ఇప్పటివరకు ఇవాళ అయిన బుకింగ్స్ పరంగా ఈ కలెక్షన్స్ చెబుతున్నాయి. నైట్ షో పూర్తయ్యే సరికి ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

ఆకట్టుకున్న డైరెక్టర్స్

ఇదిలా ఉంటే, వైజయందీ మూవీస్ బ్యానర్‌పై సి. అశ్వనీదత్ నిర్మించి కల్కి 2898 ఏడీ చిత్రంలో ప్రభాస్, దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటించారు. అలాగే ఇందులో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్‌తోపాటు డైరెక్టర్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, అనుదీప్ కేవీ కెమియోస్ చేసి ఆకట్టుకున్నారు.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024