ఆంధ్ర, తెలంగాణలకు గుడ్ న్యూస్; 7 రాష్ట్రాలకు కొత్తగా 8 రైల్వే ప్రాజెక్టులు; కేబినెట్ ఆమోదం

Best Web Hosting Provider In India 2024


New railway projects: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ శుక్రవారం రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సుమారు రూ.24,657 కోట్ల అంచనా వ్యయంతో ఎనిమిది కొత్త ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.

తెలుగు రాష్ట్రాలకు కూడా..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని 14 జిల్లాలను ఈ ప్రాజెక్టులు కవర్ చేస్తాయని శనివారం కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఎనిమిది ప్రధాన కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులలో గుణుపూర్-తేరుబలి (కొత్త లైన్), జునాగఢ్- నబంగ్పూర్, బాదంపహర్-కందుఝర్గఢ్, బంగ్రిపోసి-గోరుమహిసాని, మల్కాన్ గిరి-పాండురంగాపురం (భద్రాచలం మీదుగా), బురమారా-చకులియా, జల్నా-జల్గావ్, మరియు బిక్రమ్షిలా-కటారియా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది.

ప్రధాని మోదీ న్యూ ఇండియా విజన్

ఈ ప్రాజెక్టులు ప్రధాని మోదీ (narendra modi) న్యూ ఇండియా విజన్ కు అనుగుణంగా ఉన్నాయని, ఇది ఈ ప్రాంతంలో సమగ్ర అభివృద్ధి ద్వారా ఈ ప్రాంత ప్రజలను “ఆత్మనిర్భర్”గా మారుస్తుందని, ఇది వారి ఉపాధి / స్వయం ఉపాధి అవకాశాలను పెంచుతుందని వైష్ణవ్ అన్నారు. ఈ రైల్వే మార్గాలు ఆర్థిక ప్రయోజనాలను తీసుకురావడమే కాకుండా ఉపాధి అవకాశాలను కూడా తెస్తాయని మంత్రి తెలిపారు.

కొత్తగా 64 స్టేషన్లు

ఈ ప్రాజెక్టులతో 64 కొత్త స్టేషన్లను నిర్మిస్తామని ప్రభుత్వం తెలిపింది. తూర్పు సింగ్బుమ్, భద్రాద్రి కొత్తగూడెం, మల్కన్ గిరి, కలహండి, నబరంగ్పూర్, రాయగడ జిల్లాలకు మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన అజంతా గుహలను ఇండియన్ రైల్వే నెట్ వర్క్ తో అనుసంధానం చేసి పెద్ద సంఖ్యలో పర్యాటకులకు సౌకర్యం కల్పిస్తామని కేంద్రం తెలిపింది. వ్యవసాయ ఉత్పత్తులు, ఎరువులు, బొగ్గు, ఇనుప ఖనిజం, ఉక్కు, సిమెంట్, బాక్సైట్, సున్నపురాయి, అల్యూమినియం పౌడర్, గ్రానైట్, బల్లస్ట్, కంటైనర్లు వంటి వస్తువుల రవాణాకు ఇవి అవసరమైన మార్గాలు.

సరుకు రవాణాకు ఉపయోగకరం

సామర్థ్యాన్ని పెంచే పనుల వల్ల ఏటా 143 ఎంటీపీఏ (మిలియన్ టన్నులు) అదనపు సరుకు రవాణా జరుగుతుంది. పర్యావరణ అనుకూల, ఇంధన-సమర్థవంతమైన రవాణా సాధనంగా రైల్వేలు వాతావరణ లక్ష్యాలను సాధించడానికి, దేశానికి లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడానికి, చమురు దిగుమతులను (32.20 కోట్ల లీటర్లు) తగ్గించడానికి, తక్కువ కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను (0.87 మిలియన్ టన్నులు) తగ్గించడానికి సహాయపడతాయి. ఏటా 1,300 స్టేషన్లను పునర్ అభివృద్ధి చేస్తున్నామని, 5,000 కిలోమీటర్ల ట్రాక్ లను కలుపుతున్నామని చెప్పారు. ప్రతి సంవత్సరం 1,200 లోకోలను తయారు చేయడంపై కూడా ప్రధాని (PM Modi) దృష్టి సారించారని రైల్వే అధికారి ఒకరు తెలిపారు.

Best Web Hosting Provider In India 2024



Source link