Best Web Hosting Provider In India 2024
This Week OTT Movies: ఈ వారం థియేటర్లలో రామ్ పోతనేని-పూరి జగన్నాథ్ కాంబో డబుల్ ఇస్మార్ట్, రవితేజ-హరీష్ శంకర్ కలయికలో మిస్టర్ బచ్చన్, తమిళ స్టార్ హీరో విక్రమ్ తంగలాన్ వంటి పెద్ద సినిమాలు అలరించేందుకు రెడీగా ఉన్నాయి.
అలాగే ఓటీటీలో కూడా ఈవారం ఓ మెగా వెబ్ సిరీస్‌తో కలిపి 23 డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. ఆగస్ట్ 12 నుంచి 18 వరకు డిజిటల్ ప్రీమియర్ అయ్యే ఈ సినిమాలు, వెబ్ సిరీసులు ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఉన్నాయో లుక్కేద్దాం.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ
డార్లింగ్ (తెలుగు సినిమా)- ఆగస్ట్ 13
స్టార్ వార్స్: యంగ్ జేడీ అడ్వెంచర్స్ సీజన్ 2 (హాలీవుడ్ యానిమేషన్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 14
మై పర్‌ఫెక్ట్ హస్బండ్ (తమిళ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 16
జియో సినిమా ఓటీటీ
ఇండస్ట్రీ సీజన్ 3 (హాలీవుడ్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 12
శేఖర్ హోమ్స్ (బెంగాలీ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 14
బెల్ ఎయిర్ సీజన్ 2 (హాలీవుడ్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 15
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
మాట్ రైఫ్: లూసిడ్- ఏ క్రౌడ్ వర్క్ స్పెషల్ (హాలీవుడ్ స్టాండప్ కామెడీ షో)- ఆగస్ట్ 13
డాటర్స్ (డాక్యుమెంటరీ)- ఆగస్ట్ 14
రెన్‌ఫీల్డ్ (హాలీవుడ్ మూవీ)- ఆగస్ట్ 14
వరస్ట్ ఎక్స్ ఎవర్ (క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్)- ఆగస్ట్ 15
యావరేజ్ జో సీజన్ 1 (వెబ్ సిరీస్)- ఆగస్ట్ 15
బ్యాక్‌యార్ట్ వైల్డర్‌నెస్ (హాలీవుడ్)- ఆగస్ట్ 15
ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 4 పార్ట్ 1 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 15
కెంగన్ అసుర సీజన్ 2 పార్ట్ 2 (యానిమేషన్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 16
ఐ కెనాట్ లివ్ వితౌట్ యూ (హాలీవుడ్ మూవీ)- ఆగస్ట్ 16
పెరల్ (ఇంగ్లీష్ హారర్ మూవీ)- ఆగస్ట్ 16
షాజమ్: ఫ్యూరీ ఆఫ్ గాడ్స్ (ఇంగ్లీష్ సూపర్ హీరో చిత్రం)- ఆగస్ట్ 17
ది గార్‌ఫీల్డ్ మూవీ (యానిమేషన్ సినిమా)- ఆగస్ట్ 17
జీ5 ఓటీటీ
మనోరతంగల్ (తమిళ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 15
కంటాయే కంటాయే (హిందీ చిత్రం)- ఆగస్ట్ 15
వీరాంజనేయులు విహారయాత్ర (తెలుగు కామెడీ సినిమా)- ఈటీవీ విన్ ఓటీటీ- ఆగస్ట్ 14
పరిణీత (వెబ్ సిరీస్)- హోయ్‌చోయ్ ఓటీటీ- ఆగస్ట్ 15
చమక్: ది కంక్లూజన్ (హిందీ మూవీ)- సోనీ లివ్ ఓటీటీ- ఆగస్ట్ 16
మెగా వెబ్ సిరీస్
ఇలా ఈవారం సినిమాలు, వెబ్ సిరీసులు కలుపుకుని మొత్తం 23 స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో చాలా స్పెషల్‌గా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మనోరతంగల్ వెబ్ సిరీస్. కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలు కలిసి నటించిన ఈ సిరీస్ ఈవారానికే మెగా ఓటీటీ సిరీస్. ఆ తర్వాత కామెడీ రొమాంటిక్ తెలుగు మూవీ డార్లింగ్, కామెడి చిత్రం వీరాంజనేయులు విహారయాత్ర కూడా స్పెషల్ అని చెప్పుకోవచ్చు.
4 సినిమాలు-4 సిరీస్‌లు
ఇక బాహుబలి కట్టప్ప సత్యరాజ్ నటించిన తమిళ వెబ్ సిరీస్ మై పర్‌ఫెక్ట్ హస్బండ్, ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 4 పార్ట్ 1 సిరీస్, హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ మూవీ పెరల్, సూపర్ హీరో సినిమా షాజమ్: ఫ్యూరీ ఆఫ్ గాడ్స్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ శేఖర్ హోమ్స్ కూడా ప్రత్యేకమైనవే. ఇలా 23 స్ట్రీమింగ్ కానుండగా.. వాటిలో 8 చాలా స్పెషల్‌గా ఉండి చూసేవిలా ఉన్నాయి. ఇంకా వీటిలో నాలుగు సినిమాలు, నాలుగు వెబ్ సిరీసులు ఉన్నాయి.
టాపిక్
Best Web Hosting Provider In India 2024
Source / Credits