Best Web Hosting Provider In India 2024
అరటి పండు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని తెలిసిందే. కానీ అరిటాకును తిన్నా అనేక ప్రయోజనాలున్నాయి. దాని ఆకులు కూడా ఆరోగ్యానికి వరం. అయితే అరటి ఆకుల్లో భోజనం చేస్తే పోషకాలు వస్తాయి అనుకోకండి. అరిటాకును తింటారు కూడా. అరటాకుల్లో ఎసెన్షియల్ ఫైటో న్యూట్రియెంట్స్, సెలీనియం, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, డైటరీ ఫైబర్ వంటి పోషకాలున్నాయి. మరెన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అంతే కాదు అరటి పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు శరీరాన్ని అనేక వ్యాధులకు దూరంగా ఉంచుతాయి. అరటి ఆకుల వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో, వాటిని తీసుకోవడం సరైన పద్దతి ఏంటో తెలుసుకుందాం.
అరటి ఆకుల ప్రయోజనాలు:
రోగనిరోధక శక్తి:
అరటి ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల శరీర కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. అంతే కాదు, వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గించి త్వరగా కోలుకోవడానికి కూడా ఈ ఆకులు సహాయపడతాయి.
చర్మం ఆరోగ్యం:
అరటి ఆకుల సారం ఉన్న నీరు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడం ద్వారా చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది అలెర్జీలు, దద్దుర్లు మొదలైన వాటి నుండి ఉపశమనం పొందడానికి సాయపడుతుంది. చర్మం ఆరోగ్యం మెరుగుపడుతుంది.
రక్తహీనత:
అరటి ఆకుల రసం తాగడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. అరటి ఆకుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ పెంచడానికి సహాయపడుతుంది. దీనివల్ల శరీరంలో రక్త హీనత సమస్య చాలా మట్టుకు తగ్గిపోతుంది.
బరువు తగ్గడం:
మీరు మీ బరువు తగ్గించేందుకు ప్రయత్నిస్తుంటే.. ఈ అరటాకు జ్యూస్ తాగడం మొదలుపెట్టండి. అరటాకులో పీచు పుష్కలంగా ఉంటుంది. దీంతో ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటుంది. ఏమీ తినాలనిపించదు. దాంతో క్రమంగా బరువు తగ్గుతారు.
బ్లడ్ ప్రెజర్:
అరటి ఆకుల్లో ఉండే విటమిన్ బి6, పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.
అరటి ఆకులను ఎలా తినాలి?
అరటి ఆకులను నీటిలో మరిగించిన తర్వాత, ఈ నీటిని వడగట్టి తాగవచ్చు. అరిటాకు నీళ్లు సిద్ధం అయినట్లే. ఈ నీళ్లు తాగితే చర్మం ఆరోగ్యం మెరుగుపడుతుంది. లేదంటే అరిటాకులను నేరుగా నమిలేయొచ్చు. లేదా వీటిని మరిగించి హెర్బల్ టీ చేసుకుని వేడిగా తాగొచ్చు.
టాపిక్