Telangana Tourism : ‘అరుణాచలం’ దర్శనానికి ప్లాన్ చేస్తున్నారా..? బడ్జెట్ ధరలోనే 4 రోజుల టూర్ ప్యాకేజీ, చూసే ప్రాంతాలివే.

Best Web Hosting Provider In India 2024


దక్షిణ భారతదేశంలోని0 తమిళనాడు రాష్ట్రంలో అరుణాచలం టెంపుల్ ఉంది. పంచభూత లింగా క్షేత్రాలలో అగ్ని భూతానికి సంబంధించినదిగా పరిగణిస్తారు. అరుణాచలంలో అరుణ అంటే ఎర్రని.. అచలం అంటే కొండ అని అర్థంగా చెబుతుంటారు. మన దేశంలోనే గొప్ప పుణ్యక్షేత్రాలలో అరుణాచలం ఒకటి. ఇక్కడ గిరిప్రదక్షిణ చేస్తే ఎంతో మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం.

దేశవ్యాప్తంగానూ అరుణాచలేశ్వరుడి దర్శనానికి చాలా మంది భక్తులు వెళ్తుంటారు. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇలాంటి వారికోసం తెలంగాణ టూరిజం సరికొత్త టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.

హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా అరుణాచలం తీసుకెళ్తోంది. 4 రోజుల పాటు ఈ పర్యటన సాగుతోంది. నెలలో ఒక్కసారి మాత్రమే ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీ… ప్రస్తుతం ఆగస్టు 16, 2024వ తేదీన అందుబాటులో ఉంది. ఒకవేళ ఈ తేదీ మిస్ అయితే… వచ్చే నెల(సెప్టెంబరు)లో వెళ్తే ఆలోచన ఉంటే ఆ తేదీలో బుకింగ్ చేసుకోవచ్చు. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవటంతో పాటు బుకింగ్ కూడా చేసుకోవచ్చు.

అరుణాచలం టూర్ – ప్యాకేజీ వివరాలు:

  • “HYDERABAD – ARUNACHALAM – Telangana Tourism” టూరిజం పేరుతో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది.
  • ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకునే వారు హైదరాబాద్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది.
  • ఈనెలలో చూస్తే ఆగస్టు 16, 2024వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఈ తేదీలో మిస్ అయితే వచ్చే నెలలో ప్రకటించే తేదీలో బుకింగ్ చేసుకోవచ్చు. ప్రతి నెలలో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.
  • టికెట్ ధరలు : పెద్దలకు రూ. 7500, పిల్లలకు రూ. 6వేలు
  • మొదటి రోజు సాయంత్రం 6:30 నుంచి హైదరాబాద్ లోని బషీర్ బాగ్ నుంచి బయల్దేరుతారు.
  • మరునాడు ఉదయం కాణిపాకం చేరుకుంటారు. 9 గంటల లోపు దర్శనం పూర్తి అవుతుంది. ఆ తర్వాత Thiruvanamalaiకి బయల్దేరుతారు. మధ్యాహ్నం 3 గంటలకు అరుణాచలం చేరుకుంటారు. దర్శనం పూర్తి చేసుకుంటారు. రాత్రికి అరుణాచలంలోనే ఉంటారు.
  • 3వ రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత…వేలూరుకు వెళ్తారు. శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దర్శనం ఉంటుంది. సాయంత్రం 4 తర్వాత హైదరాబాద్ బయల్దేరుతారు.
  • నాలుగో రోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్ కు చేరుకోవటంతో ఈ టూర్ ప్యాకేేజీ ముగుస్తుంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 9848540371 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు.
  • info@tstdc.in మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.
  • బుకింగ్ లింక్ : https://tourism.telangana.gov.in/toursList?type=Road&groupCode=2&serviceCode=342&journeyDate=2024-08-16&adults=2&childs=0

సంబంధిత కథనం

టాపిక్

IrctcIrctc PackagesTravelTourismAp TourismTelangana TourismTamil Nadu News

Source / Credits

Best Web Hosting Provider In India 2024