BRS MLA Harish Rao : సిద్దిపేట లో అర్ధరాత్రి హైటెన్షన్…! హరీశ్ రావు క్యాంప్ ఆఫీస్ పై దాడి

Best Web Hosting Provider In India 2024


బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అధికార నివాసం(ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్) పై శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. తాళాలు పగులగొట్టి పలు వస్తువులను ధ్వంసం చేశారు.

క్యాంప్‌ ఆఫీస్ వద్ద ఉన్న ఫ్లెక్సీలను చించేశారు. దాడి చేసేందుకు వచ్చిన వారు… జై కాంగ్రెస్‌, జైజై కాంగ్రెస్‌ అంటూ నినాదాలు చేశారు. రుణమాఫీ చేసినందుకు హరీష్‌రావు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే వచ్చిన వారిని అడ్డుకోవడానికి బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రావడంతో హరీష్‌ ఆఫీస్‌ దగ్గర అర్ధరాత్రి హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కాంగ్రెస్‌ కార్యకర్తలను బయటకు పంపించేశారు.

ఈ ఘటనపై ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. కాంగ్రెస్ గుండాలు క్యాంప్ ఆఫీస్ పై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. అర్ధరాత్రి దాడి చేయడాన్ని చూస్తే తీవ్ర ఆందోళనలను రేకెతుస్తోందని ఓ వీడియోను పోస్టు చేశారు. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇలా దాడి చేస్తే… సామాన్యలు భద్రతకు ప్రభుత్వం ఏం భరోసా ఉంటుందని ప్రశ్నించారు.

పోలీసుల సమక్షంలోనే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై డీజీపీ వెంటనే స్పందించి… తగిన చర్యలు తీసుకోవాలి కోరారు.

టాపిక్

SiddipetHarish RaoBrs

Source / Credits

Best Web Hosting Provider In India 2024