Best Web Hosting Provider In India 2024
ఈ నెల 20న (మంగళవారం) వివాహిత మహిళలకు జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు వరంగల్ జిల్లా ఉపాధి కల్పనాధికారి ఉమారాణి వివరాలు వెల్లడించారు. వరంగల్ రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్ కంపెనీలో లైఫ్ ప్లానింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నాయని ఉమారాణి వెల్లడించారు. మొత్తం 50 ఖాళీలు ఉండగా.. వరంగల్ నగరం ములుగు రోడ్డులోని ఐటీఐ ప్రాంగణంలో ఉద్యోగాల ఎంపీక ప్రక్రియ ఉంటుందని వివరించారు. డిగ్రీ పూర్తిచేసిన వారు ఈ ఉద్యోగానికి అర్హులని చెప్పారు. ఏమైనా సందేహాలు ఉంటే.. 95735 85532 నంబర్‌కు ఫోన్ చేసి నివృత్తి చేసుకొవాలని సూచించారు.
ఆసక్తి ఉన్న మహిళలు ఈ నెల 20న ములుగు రోడ్డులోని ఐటీఐ కాలేజీకి రావాలని ఉమారాణి సూచించారు. వచ్చేటప్పుడు తమ బయోడేటా, విద్యార్హత సర్టిఫికేట్లు తీసుకురావాలని సూచించారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
టాపిక్