Attack on jupally: మంత్రి జూపల్లి కారుపై రాళ్ల దాడి చేసిన సొంత పార్టీ కార్యకర్తలు

Best Web Hosting Provider In India 2024


మంత్రి జూపల్లి కారుపై రాళ్ల సొంత పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. జూపల్లి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ.. నిరసన తెలిపారు. గద్వాల జిల్లాలో రిజర్వాయర్ల పరిశీలనకు వెళ్తున్న జూపల్లి కృష్ణారావు కారును అడ్డుకొని రాళ్లతో దాడికి దిగారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నందుకు నిరసనగా దాడి చేసినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నాయకురాలు సరిత వర్గీయులు ఈ దాడి చేసినట్టు సమాచారం. అయితే.. మంత్రి జూపల్లి సరిత తిరుపతయ్య ఇంటికి వెళ్లిగా.. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మధ్యలోనే కారు దిగి తన ఇంటికి వెళ్లిపోయారు. ఈ ఘటనతో జోగులాంబ గద్వాల జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

గొడవరకు కారణం ఏంటీ..

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిన కృష్ణమోహన్ రెడ్డి.. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన కొన్ని రోజుల్లోనే కేటీఆర్ సమక్షంలో మళ్లీ కారెక్కారు. సొంత గూటికి చేరుకున్నారని అనుకునేలోపే.. బండ్ల మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన్ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు మంత్రి జూపల్లి గట్టిగా ప్రయత్నించారు. అయితే.. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని గద్వాల కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలోనే మంత్రి జూపల్లి గద్వాలకు వెళ్లగా దాడి జరిగినట్టు తెలుస్తోంది.

టాపిక్

CongressJupally Krishna RaoTelangana NewsBrsTs Politics

Source / Credits

Best Web Hosting Provider In India 2024