Kolkata doctor rape-murder: కలకత్తా డాక్టర్ హత్యాచారం నేపథ్యంలో.. తెరపైకి పదేళ్ల నాటి మరో దారుణ గ్యాంగ్ రేప్ ఘటన

Best Web Hosting Provider In India 2024


Kolkata doctor rape-murder: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఆగస్టు 9న ట్రైనీ డాక్టర్ పై జరిగిన అత్యాచారం, హత్యపై పశ్చిమబెంగాల్ తో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నైట్ షిఫ్ట్ లో ఉన్న డాక్టర్ భోజనం అనంతరం సెమినార్ హాల్ లో రెస్ట్ తీసుకుంటుండగా, ఈ దారుణం జరిగింది. ఆ యువతిని దారుణంగా రేప్ చేయడంతో పాటు పాశవికంగా హింసించారు.

తెరపైకి 2013 నాటి ఘటన..

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ పై జరిగిన హత్యాచారం (Kolkata doctor rape-murder) ఘటన నేపథ్యంలో.. పశ్చిమ బెంగాల్లోని కామ్దునిలో జూన్ 2013లో జరిగిన సామూహిక అత్యాచారం, హత్య కేసు మరోసారి తెరపైకి వచ్చింది. కామ్దుని కేసును పశ్చిమ బెంగాల్ పోలీసుల క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం (CID) దర్యాప్తు చేసింది. ప్రస్తుతం కోల్ కతా పోలీస్ కమిషనర్ గా ఉన్న వినీత్ గోయల్ అప్పుడు సీఐడీలో స్పెషల్ ఇన్ స్పెక్టర్ జనరల్ (IG)గా ఆ దర్యాప్తును పర్యవేక్షంచారు.

కామదుని అత్యాచారం, హత్య కేసు

  • 2013 జూన్ 7న అండర్ గ్రాడ్యుయేట్ రెండో సంవత్సరం చదువుతున్న 20 ఏళ్ల విద్యార్థిని కోల్ కతా సమీపంలోని కామ్ దునిలోని తన ఇంటికి వెళ్తోంది. ఒంటరిగా ఉన్న ఆమెను అపహరించి నిర్మానుష్యమైన పొలంలోకి ఈడ్చుకెళ్లారు.
  • మరుసటి రోజు ఉదయం, ఆమె ఛిద్రమైన శరీరాన్ని స్థానికులు గుర్తించారు. ఆమె చాలా హృదయవిదారకమైన స్థితిలో కనిపించింది.
  • ఎనిమిది మంది ఆమెపై గ్యాంగ్ రేప్ చేశారు. ఆమెను అత్యంత పాశవికంగా హింసించారు. ప్రైవేట్ పార్ట్స్ ను ఛిద్రం చేశారు. ఎముకలు విరిచేశారు.
  • ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ తో పాటు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు, నిరసనలు వెల్లువెత్తాయి.
  • దాంతో రాష్ట్రంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది.
  • సీఐడీ స్పెషల్ ఐజీ వినీత్ గోయల్, ఇన్స్పెక్టర్ ఆనందమోయ్ ఛటర్జీ ఈ కేసు దర్యాప్తుకు నేతృత్వం వహించారు. మొత్తం 9 మందిని అరెస్టు చేయగా, వీరిలో రఫీకుల్ ఇస్లాం, నూర్ అలీ అనే ఇద్దరు సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా విడుదల అయ్యారు. గోపాల్ నస్కర్ విచారణ సమయంలో మరణించాడు.
  • 2016 జనవరిలో ట్రయల్ కోర్టు సైఫుల్ అలీ, అన్సార్ అలీ, అమీన్ అలీలకు మరణశిక్ష విధించింది. షేక్ ఇమానుల్ ఇస్లాం, అమీనుర్ ఇస్లాం, భోలా నస్కర్ లకు పదేళ్ల జైలు శిక్ష పడింది.
  • ప్రిసైడింగ్ జడ్జి ఈ నేరాన్ని ‘అరుదైన వాటిలో అరుదైనది’గా అభివర్ణించారు.
  • అక్టోబర్ 2023 లో, కలకత్తా హైకోర్టు సైఫుల్ అలీ, అన్సార్ అలీ ల మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చింది. అమీన్ అలీ నిర్దోషిగా విడుదలయ్యాడు.
  • యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించిన ముగ్గురు దోషులు శిక్షాకాలం పూర్తిచేసుకుని విడుదలయ్యారు.
  • మరణశిక్ష విధించడంలో ట్రయల్ కోర్టు ‘తప్పు చేసింది’ అని హైకోర్టు డివిజన్ బెంచ్ పేర్కొంది. ‘కుట్ర రుజువు కాలేదు’ అని పేర్కొంది.
  • హైకోర్టు తీర్పును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.

Best Web Hosting Provider In India 2024



Source link