OTT Horror Thriller: ఓటీటీలోకి వ‌చ్చిన క‌న్న‌డ హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ – క్లైమాక్స్ ట్విస్ట్‌ గూస్‌బంప్స్

Best Web Hosting Provider In India 2024


OTT Suspense Thriller: ఈ ఏడాది క‌న్న‌డంలో చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజ‌యాన్ని అందుకున్న హార‌ర్‌ థ్రిల్ల‌ర్ మూవీ కంగారూ ఓటీటీలోకి వ‌చ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. కంగారూ మూవీలో ఆదిత్య‌, ర‌జిని రాఘ‌వ‌న్‌ హీరోహీరోయిన్లుగా న‌టించారు. ఈ ఏడాది మే నెల‌లో ఈ హార‌ర్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజై ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది.

కంగారూ క‌థ‌, క‌థ‌నాలు, ట్విస్ట్‌ల‌తో పాటు ప్ర‌ధాన పాత్ర‌ధారుల యాక్టింగ్‌కు మంచి పేరొచ్చింది. సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌గా ద‌ర్శ‌కుడు కిషోర్ కంగారూ మూవీని అద్భుతంగా తెర‌కెక్కించాడంటూ ఆడియెన్స్ ప్ర‌శంస‌లు కురిపించారు. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ గూస్‌బంప్స్ అంటూ పేర్కొన్నారు. ఈ సినిమా ఐఎమ్‌డీబీలో ప‌దికిగాను 8.1 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది.

125 మిస్సింగ్ కేసుల‌ను సాల్వ్ చేసిన పోలీస్‌

పృథ్వీ (ఆదిత్య‌) చిక్‌మంగుళూరు పోలీస్ స్టేష‌న్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ మీద కొత్త‌గా వ‌స్తాడు. పృథ్వీ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఉన్న ఆంటోనీ గెస్ట్ హౌజ్ వ‌రుస‌గా మ‌ర‌ణాలు సంభ‌విస్తుంటాయి. ఆ గెస్ట్‌లో హౌజ్‌లో అడుగుపెట్టిన 125 మంది క‌నిపించ‌కుండా పోయార‌ని పృథ్వీ ఇన్వేస్టిగేష‌న్‌లో తేలుతుంది.

మ‌రికొంద‌రు చ‌నిపోతారు. మిస్సింగ్‌, మ‌ర్డ‌ర్స్‌ల‌కు సంబంధించి పోలీసుల‌కు చిన్న క్లూ కూడా దొర‌క‌దు. ఆ గెస్ట్ హౌజ్‌లో ఉన్న ద‌య్య‌మే అంద‌రిని చంపుతుంద‌ని ర‌క‌ర‌కాల పుకార్లు వినిపిస్తుంటాయి. ఈ మిస్సింగ్‌ల వెన‌కున్న మిస్ట‌రీని పృథ్వీ ఎలా ఛేదించాడు? ఈ కేసును సాల్వ్ చేయ‌డంలో పృథ్వీకా సాయం చేసిన మేఘ‌న (ర‌జిని రాఘ‌వ‌న్‌) ఎవ‌రు అన్న‌దే కంగారూ మూవీ కథ‌.

మాఫియా బ్యాక్‌డ్రాప్‌…

కంగారూ మూవీలో సాధుకోకిల‌, అశ్వినీ హాస‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. కాగా హీరో ఆదిత్య దాదాపు మూడేళ్ల త‌ర్వాత కంగారూ మూవీతో క‌న్న‌డంలోకి రీఎంట్రీ ఇచ్చాడు. 2021లో రిలీజైన ముంద‌వారేడ అధ్యాయ త‌ర్వాత సినిమాల‌కు బ్రేక్ తీసుకున్నాడు ఆదిత్య‌. 2004లో రిలీజైన ల‌వ్ మూవీతో క‌న్న‌డంలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆదిత్య ఇప్ప‌టివ‌ర‌కు 26 సినిమాలు చేశాడు.

కెరీర్‌లో ఎక్కువ‌గా మాఫియా, అండ‌ర్‌వ‌ర‌ల్డ్ బ్యాక్‌డ్రాప్ క‌థాంశాల‌తోనే ఆదిత్య సినిమాలు చేయ‌డం గ‌మ‌నార్హం. ఎడ‌గారికే, డెడ్లీ సోమాతో పాటు మోహిని సినిమాలు హీరోగా అత‌డికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. మ‌మ్ముట్టి, శివ‌రాజ్‌కుమార్‌, ద‌ర్శ‌న్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో ఆదిత్య కీల‌క పాత్ర‌లు పోషించాడు.

సీరియ‌ల్ యాక్ట‌ర్‌…

కంగారూ మూవీలో హీరోయిన్‌గా న‌టించిన ర‌జిని రాఘ‌వ‌న్ క‌న్న‌డంలో టాప్ సీరియ‌ల్ యాక్ట‌ర్స్‌లో ఒక‌రిగా కొన‌సాగుతోంది. అక్ష‌దీప‌, క‌న్న‌ధాతితో పాటు ప‌లు సీరియ‌ల్స్‌లో న‌టించింది. పుట్ట‌గౌరి మ‌ధువే సీరియ‌ల్ న‌టిగా ఆమెకు మంచి పేరుతో పాటు ప‌లు అవార్డుల‌ను తెచ్చిపెట్టింది. బిగ్‌బాస్ క‌న్న‌డ సీజ‌న్ 7లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న‌ది. స‌త్య మూవీతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది ర‌జిని రాఘ‌వ‌న్‌.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024