Sunny Leone: బోల్డ్ మూవీతో టాలీవుడ్‌లోకి స‌న్నీ లియోన్ రీఎంట్రీ – రిలీజ్ ఎప్పుడంటే?

Best Web Hosting Provider In India 2024


Sunny Leone: బోల్డ్ మూవీతో స‌న్నీలియోన్ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది. రెండేళ్ల త‌ర్వాత తెలుగు ప్రేక్ష‌కుల‌ను ముందుకు వ‌చ్చేందుకు సిద్ధ‌మైంది. క్యూజీ (కొటేష‌న్ గ్యాంగ్‌) పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ బోల్డ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీలో సన్నీలియోన్, ప్రియమణి, సారా అర్జున్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్నారు. మ‌రో ఇంపార్టెంట్ రోల్‌లో బాలీవుడ్ న‌టుడు జాకీ ఫ్రాఫ్ క‌నిపించ‌బోతున్నాడు.వివేక్ కుమార్ కన్నన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు

రా అండ్ ర‌స్టిక్‌…

క్యూజీ థియేట‌ర్ల ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ బోల్డ్ సినిమాను రుషికేశ్వర్ ఫిలిమ్స్ బ్యానర్ ద్వారా నిర్మాత ఎం. వేణుగోపాల్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.ఇటీవ‌ల టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు.

యాక్ష‌న్ అంశాల‌తో రా అండ్ ర‌స్టిక్‌గా ఈ టీజ‌ర్ సాగింది. క్రైమ్ సిండికేట్ గ్యాంగ్‌గా ఏర్ప‌డిన కొంత మంది మ‌హిళ‌లు ఎలా హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డారు? వారంతా కిల్ల‌ర్‌గా మార‌డానికి కార‌ణాలు ఏమిటి? త‌మ‌కు అడ్డొచ్చిన వారిని అతి కిరాత‌కంగా వారు ఎలా చంపార‌నే అంశాల‌ను బోల్డ్‌, క్రైమ్ అంశాలు క‌ల‌బోసి ఈ టీజ‌ర్‌లోచూపించారు.

దండుపాళ్యం త‌ర‌హాలో ఇందులోని విజువ‌ల్స్‌, యాక్ష‌న్ ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇందులో లేడీ గ్యాంగ్ లీడ‌ర్‌గా స‌న్నీలియోన్ క‌నిపిస్తోంది. ప్రియ‌మ‌ణి, సారా అర్జ‌న్ డీ గ్లామ‌ర్ పాత్ర‌ల్లో క‌నిపిస్తున్నారు.

త్వ‌ర‌లో రిలీజ్‌…

క్యూజీ టీజర్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంద‌ని నిర్మాత వెల్ల‌డించాడు. క్యూజీ మూవీకి జాకీ ష్రాఫ్, , ప్రియమణి, సన్నిలియోన్, సారా నటనహైలైట్‌గా ఉండ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించాడు.

త్వ‌ర‌లోనే ఈ బోల్డ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీని తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు నిర్మాత వేణుగోపాల్ ప్ర‌క‌టించాడు. క్యూజీ మూవీకి డ్ర‌మ్స్ శివ‌మ‌ణి మ్యూజిక్ అందించ‌బోతుండ‌టం గ‌మ‌నార్హం. అత‌డి బీజీఎమ్ సినిమాకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని మేక‌ర్స్ చెబుతోన్నారు. క్యూజీ మూవీ తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఒకేసారి రిలీజ్ కానున్న‌ట్లు స‌మాచారం.

మంచు మ‌నోజ్ క‌రెంట్ తీగ‌…

స‌న్నీలియోన్ తెలుగులో మంచు మ‌నోజ్ క‌రెంట్ తీగ‌లో గెస్ట్ రోల్ చేసింది. మంచు విష్ణు జిన్నాలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో క‌నిపించింది. గ‌రుడ‌వేగ‌తో పాటు మ‌రికొన్ని సినిమాల్లో ఐటెంసాంగ్స్‌లో ఆడిపాడింది. బాలీవుడ్‌లో బోల్డ్ రోల్స్‌తో పాపుల‌ర్ అయిన స‌న్నీలియోన్ ద‌క్షిణాదిలో మాత్రం పెద్ద‌గా విజ‌యాల్ని అందుకోలేక‌పోయింది.

డీ గ్లామ‌ర్ రోల్‌తో తెలుగులో హిట్ కొట్టాల‌ని భావిస్తోంది. ఉపేంద్ర సైన్స్ ఫిక్ష‌న్ మూవీ యూఐలో స‌న్నీలియోన్ ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది. ఇందులో స‌న్నీ లియోన్ క్యారెక్ట‌ర్ ఏమిట‌న్న‌ది మేక‌ర్స్ మాత్రం రివీల్ చేయ‌లేదు.

మ‌రోవైపు సెకండ్ ఇన్నింగ్స్‌లో ప్రియ‌మ‌ణి యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్ర‌లు చేస్తోంది. నాన్న సినిమాతో తెలుగు ఆడియెన్స్‌కు చేరువైంది సారా అర్జున్‌.

టాపిక్

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024