AP CID: ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అరెస్టు

Best Web Hosting Provider In India 2024


ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అరెస్ట్ అయ్యారు. వాసుదేవరెడ్డి ప్రస్తుతం సీఐడీ అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన్ను అదుపులోకి తీసుకున్న సీఐడీ అధికారులు.. అజ్ఞాత ప్రాంతంలో ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. వాసుదేవరెడిపై భారీగా అభియోగాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో వాసుదేవ రెడ్డిని మాజీ సీఎం జగన్ డిప్యూటేషన్‌పై రప్పించినట్టు వార్తలు వచ్చాయి. మద్యం కుంభకోణంలో వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించారని టీడీపీ చాలా రోజులుగా ఆరోపిస్తోంది.

వాసుదేవ రెడ్డికి మద్యం సేల్స్ బాధ్యతలను జగన్ అప్పగించినట్టు అప్పట్లోనే టీడీపీ ఆరోపించింది. డిస్టిలరీలు, డిపోలు, షాపులపై వాసుదేవ రెడ్డి అజమాయిషీ చలాయిస్తున్నారని విమర్శలు చేసింది. జే బ్రాండ్లు తీసుకురావటంలో వాసుదేవ రెడ్డి కీలక పాత్ర పోషించారని.. మద్యంపై ఆదాయాన్ని తాకట్టు పెట్టి వేల కోట్లు అప్పులు చేశారని తెలుగుదేశం ఆరోపించింది. వైసీపీ దోపిడీకి కర్త, కర్మ, క్రియ వాసుదేవ రెడ్డి అని టీడీపీ కీలక నేతలు ఆరోపించారు. కేసులు వెంటాడడంతో వాసుదేవ రెడ్డి 2 నెలలకుపైగా పరారీలో ఉన్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. వాసుదేవ రెడ్డి అరెస్టు ప్రాధాన్యత సంతరించుకుంది.

విజయవాడకు చెందిన వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో..

విజయవాడకు చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు వాసుదేవ రెడ్డిపై కేసు నమోదు చేశారు. జూన్ రెండో వారంలో హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో ఉన్న వాసుదేవ రెడ్డి ఇంట్లో అర్థరాత్రి వరకు సోదాలు నిర్వహించారు. కొన్ని ముఖ్యమైన ఫైల్స్, హార్డ్ డిస్క్‌లు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ఎక్సైజ్ పాలసీ, కొత్త బ్రాండ్ల విక్రయం, ఆఫ్‌లైన్‌లో భారీ మొత్తంలో మద్యం విక్రయాలు, కొత్త బ్రాండ్‌ల యజమానుల వివరాలు, సంబంధిత లావాదేవీలపై అధికారులు వివరాలు సేకరించారు.

టాపిక్

Ap CidLiquor ScamAndhra Pradesh NewsYsrcp Vs TdpTdpAp PoliceYs Jagan

Source / Credits

Best Web Hosting Provider In India 2024