Masturbation: హస్తప్రయోగం సంతాన సామర్థ్యం తగ్గిస్తుందా? అపోహలు, వాస్తవాలు తెల్సుకోండి

Best Web Hosting Provider In India 2024


హస్త ప్రయోగం వల్ల ఆనందం కలుగుతున్నా.. దానివల్ల ఎన్ని అనర్థాలుంటాయోననే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ముఖ్యంగా సంతాన సామర్థ్యం మీద దాని ప్రభావం పడుతుందేమోననే ఆందోళన ఉంటుంది. అసలు మితిమీరిన హస్తప్రయోగం అంటే ఏమిటి? ఎంత వరకు దాని వల్ల ప్రమాదం లేదనే విషయాలు తెల్సుకోండి.

మిలియన్ డాలర్ల ప్రశ్న:

హస్తప్రయోగం వల్ల సంతాన సామర్థ్యం తగ్గుతుందా? దాదాపు ప్రతి వ్యక్తిలోనూ ఉండే ప్రశ్న ఇది. హస్త ప్రయోగం చేసుకోవడం వల్ల శుక్రకణాల సంఖ్య తగ్గడం లేదా పూర్తిగా శుక్రకణాల సంఖ్య సున్నాకి చేరుకుంటుందనే అపోహలు చాలా మందిలో ఉంటాయి. మీకూ ఈ అపోహలే ఉంటే ఈ సమాధానం ఊరటనివ్వొచ్చు. ఎందుకంటే హస్త ప్రయోగం వల్ల స్పర్మ్ నాణ్యత, సంఖ్యమీద ప్రభావం ఉండదు. సంతాన సామర్థ్యం తగ్గదు.

హస్త ప్రయోగం అదుపులో ఉందా లేదా?

ఈ కింది లక్షణాల ప్రకారం మీకున్న అలవాటు ఎలాంటిదో తెలుస్తుంది.

మితిమీరిన హస్త ప్రయోగం:

అంటే రోజుకు ఒక్కసారి కన్నా మించి హస్త ప్రయోగానికి అలవాటు పడటం.. రోజూవారీ పనితీరు, జీవనశైలి, బాధ్యతలు, బంధాల మీద దీని ప్రభావం ఉంటే దీనికి అడిక్ట్ అయ్యారని అర్థం. ఇది ఆరోగ్యానికి చేటు చేస్తుంది కూడా.

సాధారణ స్థాయి :

దీనికి సరైన వివరణ ఇవ్వలేం. ఇది పూర్తిగా వ్యక్తిని బట్టి మారుతుంది. కానీ సౌకర్యం, ఆరోగ్యం మించిందేదీ సాధారణం మాత్రం కాదు.

మధ్యస్థం:

ఇన్నిసార్లు అని చెప్పలేం కానీ, మీకుండే శృంగార వాంఛలు తీర్చేలా ఉంటుంది సంఖ్య. మీ రోజూవారీ పనుల్ని ప్రభావం చేయదు. కానీ మీకు సంతృప్తినిస్తుంది.

హస్త ప్రయోగం ప్రభావం:

సాధారణ స్థాయి హస్తప్రయోగం వల్ల సంతాన సామర్థ్యం మీద ప్రభావం పడదు. కానీ అతిగా దీనికి అలవాటు పడితే ఎలాంటి ప్రభావాలుంటాయో చూడండి.

1. శుక్రకణాల సంఖ్య:

తరచూ హస్త ప్రయోగం చేయడం వల్ల స్మర్మ్ కౌంట్ తగ్గొచ్చు. కానీ అది తాత్కాలికమే. కానీ దానర్థం శరీరం శుక్రకణాలు తయారు చేసే సామర్థ్యం కోల్పోయిందని కాదు. వెంట వెంటనే హస్త ప్రయోగం వల్ల కాస్త సంఖ్య తగ్గొచ్చు. కొన్ని మళ్లీ శుక్రకణాల సంఖ్య సాధారణ స్థాయికి వచ్చేస్తుంది. పురుషుల వయసు, జీవనశైలి విధానం, కొన్ని రకాల వ్యాధులు, మందులు మాత్రం శుక్రకణాల సంఖ్య మీద ప్రభావం చూయిస్తాయి.

2. శుక్రకణాల నాణ్యత:

హస్త ప్రయోగం వల్ల స్పర్మ్ నాణ్యత తగ్గుతుందని చెప్పడానికి స్పష్టమైన ఆధారాల్లేవు. సంతాన సామర్థ్యానికి ఆటంకం ఉండదనే సర్వేలు చెబుతున్నాయి. కొన్ని పరిశోధనలు అయితే నియంత్రణ స్థాయిలో హస్త ప్రయోగం వల్ల పాత శుక్రకణాల చోటు కొత్త ఆరోగ్యకరమైన కణాలు భర్తీ చేస్తాయని చెబుతున్నాయి.

చెప్పేదేంటంటే:

మితిమీరిన స్థాయికి చేరనంత వరకు హస్త ప్రయోగం వల్ల కొన్ని లాభాలూ పొందొచ్చు. ఒత్తిడి తగ్గుతుంది. నిద్ర నాణ్యత పెరుగుతుంది. ఆనందం పెరుగుతుంది. శృంగార వాంఛ తీరుతుంది. కానీ అదుపులో లేకుండా అలవాటు పడితే మాత్రం శుక్రకణాల సంఖ్య తాత్కాలికంగా తగ్గుతుంది. నేరుగా హస్త ప్రయోగం వల్ల ప్రభావం లేకపోయినా దీనికి అలవాటు పడిపోతే జీవనశైలి చురుగ్గా ఉండదు. దాంతోపాటే పోషకాహార లోపం సమస్యలు చుట్టుముడితే క్రమంగా ఈ ప్రభావం సంతాన సామర్థ్యం మీద పడొచ్చు.

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024