Kasi Halwa: కాశీ హల్వా ఎప్పుడైనా తిన్నారా? దీని రెసిపీ చాలా సులువు, ఒకసారి ప్రయత్నించండి

Best Web Hosting Provider In India 2024


Kasi Halwa: కాశీ హల్వా పేరు చాలా తక్కువ మందికి తెలుసు. కాశి హల్వా అంటే బూడిద గుమ్మడికాయతో చేసే హల్వా. దీన్ని దూది హల్వా, లౌకి హల్వా అని కూడా పిలుచుకుంటారు. ఇది చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. దీన్ని చాలా సులువుగా ఇంట్లోనే చేసేయొచ్చు. అరగంటలో ఈ స్వీట్ రెడీ అయిపోతుంది.

కాశీ హల్వా రెసిపీకి కావలసిన పదార్థాలు

బూడిద గుమ్మడికాయ తురుము – రెండు కప్పులు

పంచదార – ఒక కప్పు

కుంకుమ పువ్వు రేకులు – 10

జీడిపప్పులు – పావు కప్పు

నెయ్యి – మూడు స్పూన్లు

కాశీ హల్వా రెసిపీ

1. రెండు స్పూన్ల వెచ్చని నీటిలో కుంకుమపువ్వు రేకులను వేసి నానబెట్టాలి.

2. ఇప్పుడు లోతుగా, మందంగా ఉన్న గిన్నెను తీసుకొని స్టవ్ మీద పెట్టి నెయ్యి వెయ్యాలి.

3. ఆ నెయ్యిలో జీడిపప్పులను వేసి వేయించుకోవాలి.

4. ఆ జీడిపప్పులను తీసి పక్కన పెట్టుకోవాలి.

5. ఇప్పుడు అదే నెయ్యిలో బూడిద గుమ్మడికాయ తురుమును వేసి వేయించుకోవాలి.

6. చిన్న మంట మీద దీన్ని వేయించుకుంటే మాడిపోకుండా ఉంటుంది.

7. బూడిద గుమ్మడికాయ తురుము మెత్తబడి నీరంతా ఇంకిపోయే వరకు వేయిస్తూనే ఉండాలి.

8. నీరంతా ఇంకి, అది మెత్తబడి దగ్గరగా అవుతుంది.

9. ఆ సమయంలో ముందుగా నానబెట్టిన కుంకుమ పువ్వు రేకులను వేసి కలుపుకోవాలి. తర్వాత పంచదారను వేసి కలపాలి.

10. పంచదార కరిగి నీళ్లలా అవుతుంది, ఆ మొత్తం దగ్గరగా హల్వాలా అయ్యేవరకు చిన్న మంట మీద ఉడికిస్తూనే ఉండాలి.

11. అది హల్వాలా దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి.

12. ముందుగా వేయించుకున్న జీడిపప్పులను చల్లుకోవాలి. అంతే టేస్టీ కాశీ హల్వా రెడీ అయినట్టే. దీన్ని తింటే మళ్లీమళ్లీ తినాలనిపించేలా ఉంటుంది.

గుమ్మడికాయ ఎన్నో పోషకాలను కలిగి ఉంటుంది. కాబట్టి ఈ స్వీట్ తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. కాకపోతే దీనిలో పంచదారను వాడాము. సాధారణ వైట్ పంచదార కన్నా బ్రౌన్ షుగర్ వాడుకుంటే మంచిది. బ్రౌన్ షుగర్ వల్ల హల్వా రంగు కాస్త ముదురుగా వస్తుంది. ఈ కాశీ హల్వాను నైవేద్యాలుగా కూడా వాడుకోవచ్చు.

గుమ్మడికాయతో చేసిన ఆహారాలు అప్పుడప్పుడు తినాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వైరస్‌లు, ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని అందిస్తుంది. కాబట్టి క్యారెట్ హల్వా, బీట్రూట్ హల్వాలాగే అప్పుడప్పుడు ఇలా గుమ్మడికాయ హల్వాను ప్రయత్నించండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.

Source / Credits

Best Web Hosting Provider In India 2024