Best Web Hosting Provider In India 2024
Ntr: విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి కాంబోలో ఓ సినిమా రాబోతోంది. విజయ్ గత సినిమాలకు భిన్నంగా స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో విజయ్ దేవరకొండ కంప్లీట్ మాస్ లుక్‌లో కనిపించనున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌లో షార్ట్ హెయిర్ కట్, గడ్డంతో కనిపించాడు.
ఎన్టీఆర్ వాయిస్ ఓవర్…
కాగా వీడీ 12 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికర వార్త ప్రచారం జరుగుతోంది. విజయ్ దేవరకొండ సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌ను అందించనున్నట్లు సమాచారం. వీడీ 12 కథతో పాటు విజయ్ పాత్రను సినిమాలో ఎన్టీఆర్ పరిచయం చేస్తారని అంటున్నారు.వాయిస్ ఓవర్ కోసం పలువురు స్టార్ హీరోలను అనుకున్న సినిమా యూనిట్ చివరకు ఎన్టీఆర్ అయితేనే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతోన్నారు.
ఎన్టీఆర్‌తో అనుబంధం…
వీడీ 12 మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో ఎన్టీఆర్‌కు మంచి అనుబంధం ఉంది. ఈ నిర్మాణ సంస్థలో గతంలో అరవింద సమేత వీర రాఘవ సినిమా చేశాడు ఎన్టీఆర్. ఈ బ్యానర్‌లో వచ్చి టిల్లు స్క్వేర్ ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్ పాల్గొన్నాడు. ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ దేవరను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ రిలీజ్ చేయబోతున్నది. ఆ అనుబంధంతోనే ఎన్టీఆర్‌తోనే వాయిస్ ఓవర్‌ను చెప్పించాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
శ్రీలీల వర్సెస్ భాగ్యశ్రీ బోర్సే…
కాగా వీడి12లో హీరోయిన్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. తొలుత శ్రీలీలను హీరోయిన్‌గా తీసుకున్నారు. కానీ బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్స్ కారణంగా ఆమెను సినిమా నుంచి తప్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీలీల స్థానంలో భాగ్యశ్రీ బోర్సే వీడీ12 సినిమాలో హీరోయిన్‌గా కనిపించబోతున్నట్లుగా కొన్నాళ్లుగా పుకార్లు షికారు చేస్తోన్నాయి. ఈ రూమర్స్‌పై ఇప్పటివరకు చిత్ర యూనిట్ మాత్రం ఆఫీషియల్‌గా క్లారిటీ ఇవ్వలేదు. ఇందులో రష్మిక మందన్న గెస్ట్ రోల్‌లో నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి.
రిలీజ్ డేట్ ఇదే…
వీడీ 12 మూవీ 2025 మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవలే నిర్మాణ సంస్థ అఫీషియల్‌గా రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. ఇప్పటివరకు దాదాపు 80 శాతం వరకు ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. విజయ్ దేవరకొండ మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. దాదాపు ఎనభై కోట్ల బడ్జెట్‌తో వీడీ 12 మూవీ తెరకెక్కుతోన్నట్లు సమాచారం.
మరో రెండు సినిమాలు…
వీడీ 12తో పాటు మరో రెండు సినిమాలు చేస్తోన్నాడు విజయ్ దేవరకొండ. రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ మాస్ మూవీకి విజయ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం. దిల్‌రాజు నిర్మించనున్న ఈ సినిమాకు రౌడీ జనార్ధన్ అనే పేరును పరిశీలిస్తోన్నట్లు వార్తలొస్తున్నాయి.
అలాగే టాక్సీవాలా తర్వాత విజయ్, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ కాంబోలో మరో మూవీ రాబోతోంది. పీరియాడికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయబోతున్నది.
Best Web Hosting Provider In India 2024
Source / Credits