Brahmamudi Promo: ధాన్య‌ల‌క్ష్మి ప్లాన్ రివ‌ర్స్ – ప‌ర్మినెంట్‌గా అత్తింట్లోనే అప్పు – తండ్రి కోసం రిషి త్యాగం

Best Web Hosting Provider In India 2024


Brahmamudi Promo: అప్పును త‌న కోడ‌లిగా అంగీక‌రించ‌దు ధాన్య‌ల‌క్ష్మి. వ‌ర‌ల‌క్ష్మి వ్ర‌తం కోసం ఇంటికి వ‌చ్చిన అప్పును అడుగ‌డుగునా అవ‌మానిస్తుంది. మ‌రోసారి ఇంట్లో అడుగుపెట్ట‌కుండా చేయాల‌ని ఫిక్స‌వుతుంది. అప్పును నానా మాట‌లు అంటుంది. ధాన్య‌ల‌క్ష్మితో ఎలాంటి గొడ‌వ పెట్టుకోన‌ని క‌ళ్యాణ్‌కు ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి అత్త ఎన్ని మాట‌లు ఉన్నా అప్పు మౌనంగా భ‌రిస్తుంది.

ఒక్క ల‌క్ష‌ణం లేదు…

ధాన్య‌ల‌క్ష్మి, రుద్రాణితో పాటు వ‌ర‌ల‌క్ష్మి వ్ర‌తం కోసం ఇంటికొచ్చిన ముత్తైదువ‌లు కూడా అప్పును నానా మాట‌లు అంటారు. దుగ్గిరాల ఇంటి కోడ‌లికి ఉండాల్సిన ఒక్క ల‌క్ష‌ణం కూడా అప్పులో లేద‌ని అంటారు. మీ అమ్మ నిన్ను ఊరి మీదికి వ‌దిలేస్తే ఇలాంటి బుద్దులే వ‌స్తాయ‌ని కోప్ప‌డుతారు. అప్పు వ‌ల్ల పోనుపోను ఇంకా ఎన్ని ద‌రిద్రాలు చూడాల్సివ‌స్తుందో ధాన్య‌ల‌క్ష్మి, రుద్రాణి అంటారు.

కావ్య‌, రాజ్ మౌనం…

చెల్లెలిని త‌న క‌ళ్ల‌ ముందే ధాన్య‌ల‌క్ష్మి అవ‌మానిస్తున్నా కావ్య ఏం చేయ‌లేక‌పోయింది. రాజ్‌, క‌ళ్యాణ్ కూడా ధాన్య‌ల‌క్ష్మికి ఎదురుచెప్ప‌లేక సైలెంట్‌గా ఉంటారు. అప్పుకు ఇందిరాదేవి స‌పోర్ట్‌గా నిలుస్తుంది.

మంచి, మ‌ర్యాద‌, స‌భ్య‌త సంస్కారం నీకు ఉన్నాయో లేవో చూసుకోకుండా నిన్ను కోడ‌లిగా చేసుకొని మేము త‌ప్పు చేశామంటూ ధాన్య‌ల‌క్ష్మికి పంచ్ ఇస్తుంది ఇందిరాదేవి. అప్పు అన్ని ప‌నులు స‌రిగ్గానే చేస్తుంద‌ని అంటుంది. అయినా ధాన్య‌ల‌క్ష్మి వెన‌క్కి త‌గ్గ‌దు. కొడుకు, కోడ‌లితో క‌లిసి వ్ర‌తంలో కూర్చోవ‌డానికి ఒప్పుకోదు.

ఇంట్లో నుంచి వెళ్లిపోయిన క‌ళ్యాణ్‌, అప్పు…

వ్ర‌తంలో అప్పు, క‌ళ్యాణ్‌ల‌తో పాటు రాజ్‌, కావ్య‌, రాహుల్‌, స్వ‌ప్న కూర్చుంటారు. ఎలాంటి గొడ‌వ‌లు లేకుండా వ్ర‌తం ముగియ‌డంతో అంద‌రూ ఊపిరిపీల్చుకుంటారు. అప్పును దెబ్బ‌కొట్టే అవ‌కాశం కోసం ధాన్య‌ల‌క్ష్మి ఎదురుచూస్తుంటుంది. భోజ‌నాలు వ‌డ్డించే ద‌గ్గ‌ర అప్పుతో గొడ‌వ ప‌డుతుంది. క‌న‌కం నిన్ను స‌రిగా పెంచ‌లేద‌ని అంటుంది.

ధాన్య‌ల‌క్ష్మి మాట‌లు స‌హించ‌లేక అప్పును తీసుకొని క‌ళ్యాణ్ ఇంట్లో నుంచి వెళ్లిపోవ‌డానికి రెడీ అవుతాడు. కానీ అప్పు, క‌ళ్యాణ్ ఇక్క‌డే ఉంటార‌ని, వారు ఎక్క‌డికి వెళ్లాల్సిన ప‌నిలేద‌ని ఇందిరాదేవి తీర్పు చెప్పిన‌ట్లుగా బ్ర‌హ్మ‌ముడి లేటెస్ట్ ప్రోమోలో చూపించారు.

బ‌య‌ట‌ప‌డ్డ రిషి నాట‌కం…

తాను రంగ‌గా ఎందుకు న‌టించాల్సివ‌చ్చిందో వ‌సుధార చెబుతాడు రిషి. అస‌లు రంగాను కూడా భార్య‌కు ప‌రిచ‌యం చేస్తాడు. రంగా ద్వారానే త‌న అన్న‌య్య చేసిన దుర్మార్గాలు, కుట్ర‌లు తెలిసిపోయాన‌ని వ‌సుధార‌తో అంటాడు రిషి. త‌మ ముందు రంగాగా యాక్ట్ చేస్తున్న‌ది రిషినే దేవ‌యాని, శైలేంద్రకు నిజం తెలిసిపోతుంది.

తెలివిగా త‌మ‌ను దెబ్బ‌కొట్ట‌డానికి వ‌సుధార‌, రిషి కలిసి ఆడుతోన్న నాట‌కం ఇద‌ని అనుకుంటారు. వారినే రివ‌ర్స్ దెబ్బ‌కొట్టేందుకు స‌రోజ‌తో పాటు మ‌నును పావులుగా వాడుకుంటారు. మ‌నుకు తండ్రిపై ఉన్న ద్వేషాన్ని వాడుకుంటూ మ‌హేంద్ర‌ను చంపించాల‌ని శైలేంద్ర అనుకుంటాడు. అత‌డి ప్లాన్‌ను రిషి ఎలా క‌నిపెట్టాడు? తండ్రిని ఎలా కాపాడుకున్నాడ‌న్న‌ది గుప్పెడంత మ‌న‌సు నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూపించ‌నున్నారు.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024