Periods kit: ఈ ఎమర్జెన్సీ పీరియడ్ కిట్ ప్రతి అమ్మాయి బ్యాగులో ఉండాల్సిందే, అందులో ఏమేం ఉంటాయి?

Best Web Hosting Provider In India 2024


పీరియడ్స్ సమయంలో అసౌకర్యం ప్రతి వయసు అమ్మాయి ఎదుర్కుంటుంది. అనుభవంతో సంబంధం లేకుండా ప్రతిసారీ ఏదో ఒక రకమైన ఇబ్బంది నెలసరిలో వస్తూనే ఉంటుంది. కొందరిలో లీకేజీ సమస్య, కొందరిలో కడుపు నొప్పి, కొన్ని సార్లు అనుకోని సమయంలో వచ్చి ఇబ్బంది పెట్టడం.. ఒకటా రెండా.. చాలా రకాలుగా సతమతం చేసేస్తాయి. ముఖ్యంగా అనుకోని సమయంలో పీరియడ్స్ వస్తే చాలా ఇబ్బందులు రాకుండా పీరియడ్ కిట్ కాపాడుతుంది. మొదటిసారి పీరియడ్స్ వచ్చే టీనేజ్ అమ్మాయిల నుంచి పెద్దవాళ్ల దాకా ఇది ఉపయోగకరమే. 

పీరియడ్ కిట్

మీకు తెలుసా? మార్కెట్లో ఫస్ట్ పీరియడ్ కిట్స్ అని చెప్పి చూడ్డానికి చాలా చిన్నగా ఉండే బ్యాగుల్లాంటి కిట్స్ అందుబాటులోకి వచ్చాయి. పీరియడ్స్ అనుకోకుండా వస్తే కావాల్సిన సామాన్లన్నీ అందులో ఉంటాయి. స్కూలుకెళ్లే పిల్లల దగ్గర్నుంచి ఆఫీసుకెళ్లే అమ్మాయి దాకా ప్రతి ఒక్కరు దాన్ని బ్యాగులో ఉంచుకోవాల్సిందే. అయితే ప్రత్యేకంగా ఖర్చు పెట్టి వాటిని కొనక్కర్లేదు. మీరే ఒక మంచి పీరియడ్ కిట్ మీ అవసరానికి తగ్గట్లు తయారు చేస్తే మరీ మంచిది.

పీరియడ్ కిట్ ఇలా రెడీ చేసుకోండి

1. ముందు ఒక మేకప్ పౌచ్ లేదా వాటర్ ప్రూఫ్ పర్స్ తీసుకోండి. మేకప్ పౌచ్ అయితే అందులో దేనికదే పెట్టుకునేలా కొన్ని పాకెట్లుంటాయి. అది లేకపోతే మామూలు పౌచ్ లేదా ట్రావెల్ పర్స్ ఏదైనా సరిపోతుంది లేండి.

2. అందులో శానిటరీ న్యాప్‌కిన్లు రెండు మూడు పెట్టండి. అవి మీ అవసరానికి తగ్గట్లు హై ఫ్లో నుంచి లో ఫ్లో తగ్గట్లు రెండు మూడు రకాల్లో ఉండాలి.

3. ఒక అండర్ వేర్ మడిచి పెట్టండి.

4. ఒక రెండు ప్లాస్టిక్ బ్యాగులు ఉంచండి. జిప్ లాక్ బ్యాగ్ అయితే మంచిది. ఇది అనుకోకుండా వచ్చిన పీరియడ్ వల్ల పాడైన లోదుస్తులు పెట్టడానికి పనికొస్తుంది.

5. చిన్న శ్యానిటైజర్ డబ్బా ఒకటి తప్పనిసరి. లేదంటే పేపర్ సోప్స్ దొరుకుతున్నాయిప్పుడు. చిన్న పేపర్ సోప్ బాక్స్ ఒకటి పెడితే అందులో నుంచి ఒక పేపర్ తీసుకుని నీళ్ల కింది చెయ్యి పెడితే సబ్బులాగా నురుగొస్తుంది.

6. వెట్ లేదా డ్రై టిష్యూ పేపర్లు ఉంచండి. చిన్న ప్యాకెట్లు చూసి కొనండి.

7. ఈ పీరియడ్ కిట్ ను ఎప్పటికప్పుడు రీఫిల్ చేసుకుంటూ ఉంటేనే లాభం. ఒకవేళ మర్చిపోతే ఇబ్బంది పడొద్దు కాబట్టి అందులో కొన్ని డబ్బులు కూడా పెట్టుకోండి. పెద్దవాళ్ల దగ్గర ఎప్పుడూ డబ్బులుంటాయి కాబట్టి పరవాలేదు. స్కూలుకెళ్లే పిల్లలకు అత్యవసరంగా ఈ డబ్బులు పనికొస్తాయి.

8. టీనేజ్ పిల్లలైతే ప్యాడ్స్ బదులుగా పీరియడ్ అండర్ వేర్ వాడొచ్చు. అవసరమైతే దాన్నీ ఈ కిట్‌లో ఉంచండి.

9. ఈ పీరియడ్ కిట్ వీలైనంత చిన్న సైజులో ఉండాలి. అయితేనే అవసరానికి సులభంగా వాడుకుంటారు. అలాగే అందరిముందు పట్టుకొని బయటకు వెళ్లేలా పర్సు ఉండాలి. పాతదో, పనికి రానిదో దీని కోసం వాడితే పీరియడ్ కిట్ వాడటమే పెద్ద ఇబ్బంది అవుతుందని గుర్తుంచుకోండి.

వీటితో పాటే కొంతమందిలో నెలసరితో పాటే తలనొప్పి, కడుపునొప్పి మొదలైపోతాయి. సమస్య మరీ ఎక్కువుండే వాళ్లు వాటికి సంబంధించిన మాత్రలూ ఈ కిట్‌లో ఉంచుకోవాలి. ఒక డార్క్ చాకోలేట్ ఉంచుకున్నా మీకు సాయపడొచ్చు. మీ 

స్కూలుకెళ్లే పిల్లల స్కూలు బ్యాగుల్లో, బయటికి ఆఫీసుకు, చదువుకోడానికి, ఇంకేవైనా పనుల గురించి తరచూ తిరగాల్సి వచ్చే మహిళల బ్యాగుల్లో తప్పకుండా ఈ పీరియడ్ కిట్ ఉండాల్సిందే.

 

 

 

Source / Credits

Best Web Hosting Provider In India 2024