IRCTC Hyderabad To Thailand : బ్యాంకాక్ బీచ్ ల్లో, పటాయా వీధుల్లో చక్కర్లు-హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ

Best Web Hosting Provider In India 2024


IRCTC Hyderabad To Thailand : బిజీబిజీ లైఫ్ కు కాస్త బ్రేక్ ఇచ్చి బ్యాంకాక్ బీచ్ ల్లో ప్రశాంతంగా గడపాలని ఉందా? అయితే ఐఆర్సీటీసీ హైదరాబాద్ నుంచి థాయ్ లాండ్ 4 రోజుల టూర్ ప్యాకేజీ అందిస్తుంది. 34 మంది ప్రయాణికులకు ఎయిర్ టూర్ ప్యాకేజీ అందిస్తుంది. ట్రెజర్స్ ఆఫ్ థాయ్ ల్యాండ్ పేరుతో అందిస్తున్న ఈ టూర్ ప్యాకేజీలో బ్యాంకాక్, పటాయాలో విహరించవచ్చు. తదుపరి టూర్ సెప్టెంబర్ 26-29 తేదీల్లో అందుబాటులో ఉంది.

విమాన ప్రయాణ వివరాలు :

తేదీఫ్లైట్ నెంప్రారంభంసమయంగమ్యస్థానంసమయం
26-09-2024DD 959హైదరాబాద్ (HYD)00:45బ్యాంకాక్ (DMK)06:05
29-09-2024DD 958బ్యాంకాక్ (DMK)21:30హైదరాబాద్(HYD)23:45

ఒక్కో వ్యక్తికి టూర్ ప్యాకేజీ ధర

సింగిల్ షేరింగ్  డబుల్ షేరింగ్ట్రిపుల్ షేరింగ్చైల్డ్ విత్ బెడ్చైల్డ్ వితవుట్ బెడ్
రూ. 57,820రూ. 49,450రూ. 49,450రూ. 47,440రూ. 42,420

ప్రయాణం: బ్యాంకాక్ – పటాయా (03 రాత్రులు / 04 రోజులు)

01వ రోజు :

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అర్ధరాత్రి 12:45 గంటలకు విమానంలో బయలుదేరుతుంది. ఉదయం 06:05 గంటలకు బ్యాంకాక్ విమానాశ్రయానికి చేరుకుంటారు. విమానాశ్రయ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుని, బ్యాగేజీని తీసుకున్నాక.. బయట ఐఆర్సీటీసీ ప్రతినిధి పర్యాటకులను రిసీవ్ చేసుకుంటారు. టూరిస్టులను పటాయాకు తీసుకెళ్లి హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం వరకు హోటల్‌లో విశ్రాంతి తీసుకుంటారు. భోజనం తర్వాత పటాయాలోని జెమ్స్ గ్యాలరీని సందర్శిస్తారు. సాయంత్రం అల్కాజర్ షోను చూస్తారు. ఇండియన్ రెస్టారెంట్‌లో డిన్నర్, రాత్రికి పటాయాలోనే బస చేస్తారు.

02వ రోజు :

బ్రేక్ ఫాస్ట్ తర్వాత కోరల్ ఐలాండ్ పర్యటనకు వెళ్తారు. నాంగ్ నూచ్ ట్రాపికల్ గార్డెన్‌ను సందర్శిస్తారు. ఇండియన్ రెస్టారెంట్‌లో డిన్నర్, రాత్రికి పటాయాలో బస చేస్తారు.

03వ రోజు :

హోటల్‌లో అల్పాహారం తర్వాత చెక్ అవుట్ చేస్తారు. సఫారీ వరల్డ్ టూర్, మెరైన్ పార్క్ వీక్షిస్తారు. బ్యాంకాక్ హోటల్ లో చెక్ ఇన్ చేస్తారు. బ్యాంకాక్‌లోని హోటల్‌లో రాత్రి బస చేస్తారు.

04వ రోజు:

హోటల్ చెక్ అవుట్ చేసి బ్యాంకాక్ నగరాన్ని వీక్షించేందుకు బయలుదేరతారు. బ్యాంకాక్‌లోని ఇండియన్ రెస్టారెంట్‌లో భోజనం చేస్తారు. వాట్ ట్రిమిట్ (ది టెంపుల్ ఆఫ్ సాలిడ్ గోల్డెన్ బుద్ద), వాట్ ఫో (బుద్ధుని ఆలయం), ఇంద్ర మార్కెట్‌లో షాపింగ్ స్టాప్‌ను సందర్శించవచ్చు. సాయంత్రం 6:00 గంటలకు బ్యాంకాక్ విమానాశ్రయంలో డ్రాప్ చేస్తారు. దీంతో టూర్ ముగుస్తుంది.

హైదరాబాద్ నుంచి థాయ్ లాండ్ ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ బుకింగ్, పూర్తి వివరాలను కింద లింక్ లో తెలుసుకోవచ్చు.

https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHO12

సంబంధిత కథనం

టాపిక్

Telangana NewsIrctcIrctc PackagesTourismTourist PlacesHyderabad

Source / Credits

Best Web Hosting Provider In India 2024