Best Web Hosting Provider In India 2024
శ్రీకాకుళం: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగిస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం నాయకుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు కోరారు. సోమవారం శ్రీకాకుళం 20వ డివిజన్ పరిధిలోని ఇలిసిపురంలో జగనన్నే మా భవిష్యత్తు,
మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు పాల్గొని ఇంటింటా పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి వైయస్ జగన్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ, మెగా పీపుల్స్ సర్వే బుక్‌లో వారి అభిప్రాయాలను నమోదు చేశారు. అనంతరం స్థానికుల అంగీకారంతో ఇంటి గోడలకు, తలుపులకు, సెల్‌ఫోన్లకు స్టిక్కర్లు అంటించి సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా ధర్మాన రామ్ మనోహర్ నాయుడు మాట్లాడుతూ.. నాలుగేళ్ల కాలంలో కుల,మతాలకు అతీతంగా సంక్షేమ పథకాల అమలు చేస్తున్నామన్నారు. ఇవాళ ప్రజలంతా ఈ నాలుగేళ్ల కాలంలో ఆనందంగా ఉన్నారని తెలిపారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి అన్నవి ఏక కాలంలో చేయగలుగుతున్నారు. రోడ్డు వేస్తేనే అభివృద్ధి కాదు. రోడ్లూ వేయాలి, సంక్షేమమూ చేయాలన్నారు. నాడు – నేడు పేరిట నిర్వహిస్తున్న స్కూల్స్ ను చూడండి ఏవిధంగా అభివృద్ధి చెందాయో అన్నది మీకు తెలుస్తుంది. అలానే చిన్నారులకు ఆధునిక సాంకేతికతతో కూడిన విద్య, విలువలతో కూడిన విద్యను అందిస్తూ ఉన్నామని, మధ్యాహ్న భోజన పథకం అమలులో భాగంగా పోషకాహారం అందిస్తున్నామని, అలానే ధనవంతుల పిల్లలతో సమానంగా పేద బిడ్డలు చదువుకునేందుకు వీలుంగా సౌకర్యాలు కల్పించాం. వారికి బుక్స్, షూ, యూనిఫాం అందించారని వివరించారు.