Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2023/04/Yv-Subba-Reddy18.jpg)
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిపై కొన్ని పత్రికలు బురద జల్లడమే పనిగా పెట్టుకున్నాయని వైయస్ఆర్సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వంపైన, దేవుళ్లపైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. విజయ్‌కుమార్‌స్వామి విజయవాడ ఎవరి విమానంలో వచ్చారు? రామోజీ వియ్యంకుడి విమానంలోనే ఆయన వచ్చారని తెలిపారు. రామోజీ బంధువు ప్రత్యేక విమానంలో వాళ్ల కార్యక్రమం కోసమే స్వామి వచ్చారు. విజయ్‌కుమార్ స్వామిని తెచ్చుకున్నది మీరే. మీ మార్గదర్శి కేసు నుంచి బయట వేయించుకునేందుకు తెచ్చుకున్నారా? అని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. మీరు చేస్తే దైవాశీస్సులు? మేం చేస్తే లాబీయింగా? అని నిలదీశారు. మంగళవారం తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.