Best Web Hosting Provider In India 2024
Bigg Boss Telugu 8: బిగ్‍బాస్ ఫ్యాన్స్ వేచిచూస్తున్న తరుణం వచ్చేసింది. బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ షురూ అయింది. నేడు (సెప్టెంబర్ 1) గ్రాండ్ లాంచ్‍తో ఈ సీజన్ మొదలైంది. ఏడు సీజన్లు సక్సెస్ కాగా.. ఈ ఎనిమిదో సీజన్‍కు కూడా క్రేజ్ బాగానే ఉంది. ముఖ్యంగా లిమిట్‍సెట్ అంటూ కొంతకాలంగా వస్తున్న ప్రోమోలతో మంచి ప్రమోషన్ జరిగింది. ఈ 8వ సీజన్‍కు కూడా కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. గ్రాండ్ లాంచ్ ఈవెంట్‍లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు నాగార్జున. బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ తొలి కంటెస్టెంట్‍గా టీవీ యాక్టర్ యష్మి గౌడ అడుగుపెట్టారు.
అదిరిన నాగ్ ఎంట్రీ
బిగ్‍బాస్ గ్రాండ్ లాంచ్‍లో హోస్ట్ నాగార్జున ఎంట్రీ అదిరింది. కల్కి బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్‍తో మ్యాజిక్ స్టంట్స్‌తో నాగ్ అడుగుపెట్టారు. ఆ తర్వాత దేవర చిత్రంలోని ఫియర్ సాంగ్‍కు డ్యాన్స్ వేశారు. నాగార్జున ఎంట్రీ ఆకట్టుకుంది.
ఇంట్రెస్టింగ్‍గా బెడ్‍రూమ్‍ల పేర్లు
ఆ తర్వాత బిగ్‍బాస్ 8వ సీజన్ హౌస్‍ను నాగార్జున పరిచయం చేశారు. అడవి థీమ్‍తో హౌస్ ఉంటుందని చెప్పారు. ఈ హౌస్‍లో మూడు బెడ్‍రూమ్‍లు ఉన్నాయి. తూనీగ, నెమలి, జీబ్రా పేర్లతో ఈ బెడ్‍రూమ్‍లు ఉన్నాయి. కొత్తగా ఇన్ఫినిటీ రూమ్ కూడా ఉంది.
ఫ్లవర్స్ ఇచ్చిన యష్మి.. ముద్దుపెట్టిన నాగ్
బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో తొలి కంటెస్టెంట్‍గా అడుగుపెట్టారు టీవీ నటి యష్మి గౌడ. నాగభైరవి, కృష్ణ ముకుంద మురారి సీరియళ్లతో ఈ కన్నడ నటికి తెలుగులోనూ బాగా పాపులారిటీ వచ్చింది.
డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌తో గ్రాండ్ లాంచ్ వేదికపై మెప్పించారు యష్మి గౌడ. సెప్టెంబర్ 2న పుట్టిన రోజు జరుపుకున్న నాగార్జునకు బిలేటడ్ హ్యాపీ బర్త్‌డే అని చెప్పారు. “ఈ అమ్మాయి చూడడానికి చూడడానికి ఫ్లవర్‌లా ఉన్నా.. చాలా ఫైర్ ఉంది” అని యష్మి గౌడ గురించి అన్నారు నాగార్జున.
ఆ తర్వాత స్మైల్, లుక్స్, స్టైల్, హోస్టింగ్, మంచి సినిమాలు.. అంటూ ప్రశంసిస్తూ.. ఒక్కో పొగడ్తకు ఒక్క గులాబీ పువ్వను నాగార్జునకు ఇచ్చారు యష్మి గౌడ. “నాకు మీ మీద ఉన్న లవ్‍కు” అని అలా కూర్చున్నారు యష్మి. దీంతో ఆమె చేతిపై నాగార్జున ముద్దుపెట్టారు. ఆ తర్వాత నాగ్ చేతుల మీదుగా అడిగి మరీ ఓ ఫ్లవర్ అందుకున్నారు యష్మి.
బడ్డీ ఎవరంటే..
బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో కంటెస్టెంట్లు జోడీగానే అడుగుపెట్టాలనే రూల్ ఉంది. యష్మి గౌడకు బడ్డీగా హౌస్‍లోకి ఎంట్రీ ఇచ్చారు రెండో కంటెస్టెంట్ టీవీ యాక్టర్ నిఖిల్ మిలియక్కల్. గోరింటాకు, అనుపల్లవి సీరియళ్లతో బాగా ఫేమస్ అయ్యారు నిఖిల్.
బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో యష్మి గౌడ, నిఖిల్ తొలి జోడీగా హౌస్‍లో అడుగుపెట్టారు. మిగిలిన కంటెస్టెంట్లు కూడా బడ్డీతోనే లోపలికి వెళ్లాలి.
బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో నేడు గ్రాండ్ లాంచ్ ద్వారా 14 మంది కంటెస్టెంట్లు హౌస్‍లోకి అడుగుపెట్టనున్నారు. ఆ తర్వాతి వారాల్లో వైల్డ్ కార్డ్ ద్వారా కొందరు ఎంట్రీ అవకాశాలు ఉన్నాయి.
బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ రేపటి (సెప్టెంబర్ 2) నుంచి స్టార్ మా ఛానెల్‍లో సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుంది. శని, ఆదివారాల్లో రాత్రి 9.30 గంటలకు టెలికాస్ట్ అవుతుంది. డిజిటల్ విషయానికి వస్తే, డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
Best Web Hosting Provider In India 2024
Source / Credits