Govt Jobs 2024 : ములుగు సెంట్రల్ ట్రైబల్ వర్సిటీలో ఉద్యోగాలు – ఖాళీలు, ముఖ్య తేదీలివే

Best Web Hosting Provider In India 2024


ములుగు జిల్లాలోని సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీలో 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గెస్ట్ ఫ్యాకల్టీ కింద నియామకాలు చేపట్టనున్నారు. 2024- 25 విద్యా సంవత్సరానికి సంబంధించిన సెమిస్టర్ కోసం బోధించాలని అధికారులు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు.

పోస్టుల వివరాలు..

ఎకనామిక్స్ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీ 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ 3 పోస్టులు అన్ రిజర్వ్‌డ్. 55 శాతం మార్కులతో ఎంఏ ఎకనామిక్స్ పీజీ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. అలాగే.. నెట్ లేదా జేఆర్ఎఫ్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. యూజీసీ నిబంధనల ప్రకారం వీరికి గౌరవ వేతనం చెల్లిస్తారు.

ఇంగ్లీష్ విభాగంలో..

ఇంగ్లీష్ విభాగంలో 3 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు ఉన్నాయి. వాటిల్లో 2 పోస్టులు అన్ రిజర్వ్‌డ్ కాగా.. ఒక పోస్టును ఓబీసీకి కేటాయించారు. ఎంఏ ఇంగ్లీష్‌లో 55 శాతం మార్కులు సాధించిన వారు అర్హులు. నెట్ లేదా జేఆర్ఎఫ్‌లో ఉత్తిర్ణత సాధించి ఉండాలి. ఇంగ్లీష్ లిటరేచర్‌లో పీహెచ్‌డీ చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. వీరికి కూడా యూజీసీ నిబంధనల ప్రకారం గౌవర వేతనం చెల్లిస్తారు.

ఈ సెమిస్టర్ వరకే..

2024 విద్యా సంవత్సరంలో జులై- డిసెంబర్ మధ్య ఉండే సెమిస్టర్‌కు సంబంధించి వీరు బోధించారు. ఈ కాలం వరకే పని చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రెన్యువల్ అంశంపై యూనివర్సిటీ అధికారులు నిర్ణయం తీసుకుంటారు. దరఖాస్తులను పరిశీలించిన తర్వాత అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి సమాచారం ఇస్తారు. వారిని ఇంటర్వ్యూ చేసి ఫైనల్ చేస్తారు.

దరఖాస్తు విధానం..

ఆసక్తి ఉన్న అభ్యర్థులు hr@uohyd.ac.in మెయిల్ ఐడీకి లేటెస్ట్ రెజ్యూమే పంపాలి. దానితో పాటు విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికెట్లను జత చేయాలి. సెప్టెంబర్ 12 వరకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తులను పరిశీలించిన తర్వాత ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు సమాచారం అందించి.. ఎప్పుడు జాయిన్ అవ్వాలనేది చెబుతారు.

టాపిక్

EducationJobsCentral UniversityTelangana NewsTelugu News

Source / Credits

Best Web Hosting Provider In India 2024