Best Web Hosting Provider In India 2024
Us Open 2024: యూఎస్ ఓపెన్ 2024 ఉమెన్స్ సింగిల్స్ టైటిల్‌ను బెలారస్‌కు చెందిన అరీనా సబలెంక సొంతం చేసుకున్నది. శనివారం జరిగిన ఫైనల్‌లో అమెరికాకు చెందిన జెస్సికా పెగులాపై 7-5 7-5 తేడాతో సబలెంక విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. తుది పోరులో పెగులాపై సబలెంక పూర్తిగా ఆధిపత్యం కనబరిచింది ఈ మ్యాచ్‌లు సబలెంక ఆరు డబుల్ ఏస్‌లు సాధించగా..పెగులా నాలుగు మాత్రమే సాధించింది. ఫైనల్ ముందు వరకు తన ఆటతీరుతో ప్రత్యర్థులకు గట్టిపోటీ ఇచ్చిన పెగులా తుది పోరులో మాత్రం తడబడిపోయింది.
ఫస్ట్ టైటిల్…
సబలెంక కెరీర్ ఇదే ఫస్ట్ యూఎస్ ఓపెన్ టైటిల్ కావడం గమనార్హం. గత ఏడాది యూఎస్ ఓపెన్‌లో ఫైనల్ చేరింది సబలెంక. కానీ ఫైనల్‌లో ఓటమి పాలై రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నది. ఈ సారి ఎలాంటి పొరపాట్లు లేకుండా టైటిల్ ఎగరేసుకుపోయింది.
29 కోట్లు…
యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచిన సబలెంక దాదాపు 29 కోట్ల (3.51 మిలియన్ డాలర్లు) ప్రైజ్‌మనీ దక్కింది. గత ఏడాదితో పోలిస్తే 2024లో తొమ్మిది కోట్లకుపైగా ప్రైజ్‌మనీని యూఎస్ ఓపెన్ నిర్వహకులు పెంచారు. గ్రాండ్‌స్లామ్ గెలుపుతో ఒక్కసారిగా మిలయనీర్‌గా మారిపోయింది సబలెంక. రన్నరప్‌గా నిలిచిన పెగులాకు పదిహేను కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది.
ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్…
సబలెంకకు మొత్తంగా కెరీర్‌లో మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్ ఇది కావడం గమనార్హం. 2023, 2024 లో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ గెలుచుకున్నది. ప్రస్తుతం ఏటీపీ ర్యాంకింగ్స్‌లో సబలెంక రెండో స్థానంలో ఉంది.
4.4 కోట్ల ఖర్చు…
కాగా యూఎస్ ఓపెన్ సెమీస్‌లో గెలిస్తే మ్యాచ్ చూడటానికి వచ్చిన వారందరికి ఉచితంగా డ్రింక్స్ పంపిణీ చేస్తానంటూ సబలెంక అనౌన్స్‌చేసింది. అన్నట్లుగానే తన మాట నిలుపుకుంది. ఈ డ్రింక్స్ కోసమే దాదాపు 4.4 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం.
క్వార్టర్ అడ్డంకి దాటినా…
మరోవైపు జెస్సికా పెగులాకు గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్ చేరడం ఇదే మొదటిసారి. గతంలో వివిధ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఏడు సార్లు క్వార్టర్ ఫైనల్ చేరింది. తొలిసారి క్వార్టర్స్ అడ్డంకిని దాటినా ఫైనల్ మాత్రం చేరుకోలేకపోయింది.
జానిక్ సినర్…
యూఎస్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్‌లో ఇటలీ ప్లేయర్ జానిక్ సినర్‌తో అమెరికన్ టెన్నిస్ సంచలన టేలర్ ఫ్రిట్జ్ అమీతుమీకి సిద్ధమయ్యాడు. వీరిద్దరికి ఇదే ఫస్ట్ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ కావడం గమనార్హం. ప్రస్తుతం సినర్ నంబర్ వన్ ర్యాంక్‌లో ఉండగా…ఫ్రిట్జ్ 12వ ర్యాంక్‌లో కొనసాగుతోన్నాడు.
టాపిక్
Best Web Hosting Provider In India 2024
Source link