Tomato curry: కేరళ స్టైల్‌లో టమాటా కర్రీ.. నూనెలో మగ్గించడమే అక్కర్లేని టేస్టీ రెసిపీ

Best Web Hosting Provider In India 2024


వంటచేసే సమయం లేకపోతే చాలా మందికి టక్కున గుర్తొచ్చేది టమాటా కర్రీ. కానీ దాన్ని చాలా రుచిగా వండుకోవచ్చు. ఒక్కసారి కేరళ స్టైల్‌లో టమాటా కూర తింటే రుచికి ఫ్యాన్ అయిపోతారు. దాన్నెలా తయారు చేసుకోవాలో, కావాల్సిన పదార్థాలేంటో వివరంగా చూసేయండి.

టమాటా కర్రీకోసం కావాల్సిన పదార్థాలు:

పావు కేజీ బాగా పండిన టమాటాలు

2 పచ్చిమిర్చి

1 కరివేపాకు రెబ్బ

సగం టీస్పూన్ పసుపు

1 కప్పు కొబ్బరి తరుము

1 టీస్పూన్ జీలకర్ర

4 వెల్లుల్లి రెబ్బలు

తగినంత ఉప్పు

పావు టీస్పూన్ పంచదార

పావు టీస్పూన్ ఆవాలు

4 చెంచాల వంటనూనె

2 ఎండుమిర్చి

టమాటా కర్రీ తయారీ విధానం:

1. ముందుగా ప్రెజర్ కుక్కర్లో టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, చెంచా నూనె, సగం కప్పు నీళ్లు పోసుకుని రెండు విజిళ్లు వచ్చేదాకా ఉడికించుకోవాలి. లేదంటే ఒక వంటగిన్నెలో వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకున్నా పరవాలేదు.

2. ఇప్పుడు మిక్సీ జార్‌లో కొబ్బరి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మెత్తగా ముద్దలా చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకోండి.

3. ఇప్పుడు టమాటా తొక్కల్ని మీకు నచ్చకపోతే తీసేయండి. లేదంటే అలాగే ఉంచేయండి. దాంట్లోనే మిక్సీ పట్టుకున్న కొబ్బరి మిశ్రమం, ఉప్పు, పంచదార, పసుపు వేసుకుని కలుపుకోండి.

4. అందులోనే కప్పు నీళ్లు పోసుకుని మరిగి చిక్కపడేదాకా ఆగండి. ఇప్పుడు మరో పాత్రలో నూనె వేసి ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చితో పోపు పెట్టుకోండి. ఈ తాలింపును మరుగుతున్న కూరలో కలిపేసుకోండి.

5. ఈ కూరను చిక్కగా కాకుండా కాస్త పలుచగా చేసుకుంటే అన్నం మీద రసం లాగా పోసుకుని తింటే బాగుంటుంది. లేదా కాస్త చిక్కగా చేసుకున్నా పరవాలేదు.

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024