Aadhaar Free Update : ఉచితంగా ఆధార్ వివరాలు అప్డేట్, మరోసారి గడువు పెంచిన యూఐడీఏఐ

Best Web Hosting Provider In India 2024


Aadhaar Free Update : ఆధార్ అప్డేట్ పై యూఐడీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఉచితంగా ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు మరో అవకాశం కల్పించింది. నేటితో ముగిసిన ఉచిత అప్డేట్ గడువును మరోసారి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఉడాయ్ ఎక్స్ లో ట్వీట్ చేసింది. 2024 డిసెంబర్‌ 14 వరకు ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పెంచుతున్నట్లు వెల్లడించింది. దీంతో ఆధార్‌ కార్డులో మార్పు చేర్పులు చేసుకోవాలనుకొనేవారు ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు.

యూఐడీఏఐ నిబంధనల మేరకు ప్రతి 10 ఏళ్లకు ఒకసారి ఆధార్‌ ను అప్డేట్ చేసుకోవాలి. ఇందుకోసం వ్యక్తి తన గుర్తింపు పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ‘మై ఆధార్’ పోర్టల్ లో ఉచితంగా ఈ సేవలు పొందవచ్చు. ఆధార్ లోని పేరు, పుట్టినతేదీ, చిరునామా, అడ్రస్ వంటి మార్పు చేర్పులు చేసుకోవచ్చు. ఉచిత గడువు ముగిస్తే ఆధార్‌ కేంద్రాల్లో రూ.50 చెల్లించి అప్డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌లో ఆధార్‌ను ఎలా అప్‌డేట్ చేసుకోవాలి?

  • యూఐడీఏఐ వెబ్‌సైట్‌ https://uidai.gov.in/ ను సందర్శించి, మీకు నచ్చిన భాషను ఎంచుకోండి. అనంతరం మీ ఆధార్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వండి.
  • ‘ఆధార్ అప్‌డేట్’ ఎంపికపై క్లిక్ చేయండి. ఇది మీ బయోమెట్రిక్, ఇతర వివరాలను చూపుతుంది.
  • ఒకవేళ మీ ఆధార్ లోని మొత్తం సమాచారం సరిగ్గానే ఉంటే మీరు “పై వివరాలు సరైనవని నేను ధృవీకరిస్తున్నాను” అనే బటన్ పై క్లిక్ చేయవచ్చు.
  • లేకుంటే మీరు మీ వివరాలను మార్చుకోవాలనుకుంటే ఆ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయాలి. దీంతో మీ ఆధార్ లో వివరాల మార్పునకు అభ్యర్థన సబ్మిట్ అవుతుంది.
  • మీకు 14 అంకెలతో ట్రాకింగ్ నంబర్ వస్తుంది. మీరు అభ్యర్థన పురోగతిని ఈ నెంబర్ సాయంతో చెక్ చేసుకోవచ్చు.
  • పాత ఆధార్ కార్డు వేరే ఫోన్ నంబర్ లింక్ చేసి ఉంటే ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోలేరు. ఇందుకు మీరు సమీపంలోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కేంద్రాన్ని వెళ్లి మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి.

ఆధార్ లో ఫోటోను అప్డేట్ చేయడం ఎలా?

  • యూఐడీఏఐ వెబ్సైట్ https://uidai.gov.in/ నుంచి ఆధార్ నమోదు ఫారం డౌన్లోడ్ చేసుకోండి.
  • అవసరమైన వివరాలతో ఫారాన్ని నింపండి.
  • మీ సమీప ఆధార్ నమోదు కేంద్రం / ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించి బయోమెట్రిక్ సమాచారం ఇవ్వండి.
  • ఇక్కడ మీ లైవ్ ఫోటో తీయబడుతుంది. అలాగే, అప్ డేట్ రిక్వెస్ట్ నెంబరు (URN) తో కూడిన స్లిప్ తీసుకోండి.
  • మీ ఆధార్ అప్డేట్ స్టేటస్ ను ట్రాక్ చేయడానికి ఈ యూఆర్ఎన్ ను సురక్షితంగా ఉంచండి

సంబంధిత కథనం

టాపిక్

AadhaarAndhra Pradesh NewsTelangana NewsTrending ApTrending Telangana

Source / Credits

Best Web Hosting Provider In India 2024