PM Modi: ప్రధాని మోదీ కుటుంబంలోకి కొత్త సభ్యుడు ‘దీప్ జ్యోతి’.. ఇంట్లో సందడి

Best Web Hosting Provider In India 2024


Deepjyoti: ఢిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్ లోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి శనివారం కొత్త సభ్యుడు వచ్చాడు. ఆ సభ్యుడి వివరాలను ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో పంచుకున్నారు. ఒక వీడియోను కూడా షేర్ చేశారు.

ఆవు దూడ..

‘గావ్: సర్వసుఖా ప్రద:’ అనే లేఖనాన్ని ప్రస్తావిస్తూ తన కుటుంబంలోకి కొత్త వ్యక్తి రాకను ప్రధాని మోదీ ప్రస్తావించారు. ‘‘’గావ్ సర్వసుఖ్ ప్రదాహ్’ అని మన గ్రంధాలలో చెప్పారు.. లోక్ కల్యాణ్ మార్గ్ లోని ప్రధాన మంత్రి నివాస ప్రాంగణానికి కొత్త సభ్యుడు శుభప్రదంగా చేరుకున్నారు’’ అని ప్రధాని మోదీ ఎక్స్ లో రాసిన ఒక హిందీ పోస్ట్ లో తెలిపారు. ప్రధాని నివాస ప్రాంగణంలోని ఒక ఆవుకు పుట్టిన దూడ తమ ఇంటి కొత్త మెంబర్ అని ప్రధాని తెలిపారు. ఆ దూడ నుదుటిపై ప్రత్యేకమైన దీపం ఆకారపు గుర్తు ఉండడం విశేషం. అందువల్ల ఆ దూడకు ప్రధాని మోదీ ‘దీప్ జ్యోతి’ (Deepjyoti) అని నామకరణం చేశారు.

దీప్ జ్యోతి..

‘ప్రధాని నివాసంలో ప్రియమైన గోమాత కొత్త దూడకు జన్మనిచ్చింది. దాని నుదుటిపై దీపం చిహ్నం ఉంది. అందుకే దీనికి ’‘దీప్ జ్యోతి’ అని పేరు పెట్టాను’ అని మోదీ తెలిపారు. ఈ వీడియోలో ప్రధాని మోదీ అప్పుడే పుట్టిన దూడపై ఆప్యాయత చూపడం, దానిని ముద్దు చేయడం, ఆడుకోవడం, దూడను పట్టుకుని తన తోటలో తిరగడం కనిపిస్తుంది. పూజ గదిలో కూడా ఆ దూడ సందడి చేయడం కనిపిస్తుంది. ప్రధాని మోదీ తన నివాసంలో దూడతో సమయం గడుపుతున్న ఫోటోలను కూడా పంచుకున్నారు.

హిందీ దివస్ శుభాకాంక్షలు

శనివారం హిందీ దివస్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘హిందీ దివస్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు’ అని ఆయన ఎక్స్ పై హిందీ పోస్ట్ లో పేర్కొన్నారు. 1949లో రాజ్యాంగ సభ హిందీని అధికార భాషగా స్వీకరించినందుకు గుర్తుగా ఏటా సెప్టెంబర్ 14న హిందీ దివస్ జరుపుకుంటారు. జమ్మూకశ్మీర్ లోని దోడా ర్యాలీలో ప్రధాని మోదీ (narendra modi) మాట్లాడుతూ జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదం చివరి దశకు చేరుకుందని అన్నారు.

Best Web Hosting Provider In India 2024



Source link