OTT Horror Comedy Movie: ఓటీటీలోకి రెండేళ్ల తర్వాత వస్తున్న హారర్ కామెడీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Best Web Hosting Provider In India 2024


OTT Horror Comedy Movie: హారర్ కామెడీ జానర్ సినిమాలను ఈ మధ్యకాలంలో చాలా మంది ఇష్టపడుతున్నారు. ఇక ఓటీటీ వల్ల ఒక్క తెలుగులోనే కాదు ప్రపంచంలోని ఎన్నో భాషల సినిమాలు సులువుగా అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడు అలాంటిదే ఓ ఇటాలియన్ హారర్ కామెడీ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. అది కూడా తెలుగులో కావడం విశేషం.

ఓటీటీ హారర్ కామెడీ మూవీ

హారర్ కామెడీ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద సక్సెస్ అవుతుందో ఈ మధ్యే వచ్చిన స్త్రీ2 నిరూపించింది. ఈ నేపథ్యంలో వివిధ ప్రపంచ భాషల్లో ఈ జానర్లో రూపొందిన సినిమాలను ఓటీటీలు మన దేశ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. అలా ఇటాలియన్ భాషలో రూపొందిన త్రీ మెన్ అండ్ ఎ ఘోస్ట్ మూవీ కూడా మూడు భారతీయ భాషల్లో ఓటీటీలోకి రాబోతోంది.

నిజానికి ఈ సినిమా 2022లో రిలీజైంది. ఇప్పుడు ఈ ఏడాది డిసెంబర్ 20న వ్రోట్ (Vrott) ఓటీటీ ద్వారా భారతీయ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈ మూవీ తెలుగుతోపాటు హిందీ, తమిళం భాషల్లో స్ట్రీమింగ్ కానుండటం విశేషం. ఓటీటీప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉన్నా కూడా ఈ సినిమాను మీరు చూడొచ్చు.

త్రీ మెన్ అండ్ ఎ ఘోస్ట్ మూవీ గురించి..

త్రీ మెన్ అండ్ ఎ ఘోస్ట్ మూవీని ఫ్రాన్సెస్కో ప్రిస్కో డైరెక్ట్ చేశాడు. మారిజియో కార్బోన్, గిసెప్ కాలెంటానో, నికోలా సెర్రోన్, రీటా కొరాడోలాంటి వాళ్లు నటించారు. ఇది చిన్ననాటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అయిన ముగ్గురు వ్యక్తుల చుట్టూ తిరిగే కథ ఇది. ఓ భారీ ప్రైజ్ మనీ కోసం వీళ్లు ఓ అడ్వెంచర్ టూర్ కు వెళ్తారు.

ఇంతకీ ఆ విలువైన ప్రైజ్ మనీ ఏంటో తెలుసా? ఓ అమాయకంగా కనిపించే అమ్మాయిని గెలుచుకోవడం. కానీ దీనికోసం ఆ ముగ్గురూ తమ ప్రాణాలనే పణంగా పెట్టాల్సి వస్తుందని తర్వాతగానీ వాళ్లకు తెలియదు. ఆ ప్రైజ్ తాము గెలవడానికి దగ్గరగా వచ్చామనుకున్న సమయంలో ఆ ముగ్గురి జీవితాలు పూర్తిగా నియంత్రణ కోల్పోయి ప్రమాదంలో పడిపోతారు.

చివరికి వాళ్ల మధ్య ఫ్రెండ్షిప్ కూడా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పటి వరకూ తెలియని రహస్యాలు బయటకు వస్తుంటాయి. మరి వీటి నుంచి ఆ ముగ్గురూ ఎలా బయటపడతారు? వాళ్ల స్నేహం అలాగే కొనసాగుతుందా లేదా అన్నది ఈ త్రీ మెన్ అండ్ ఎ ఘోస్ట్ మూవీలో చూడొచ్చు. ఈ సినిమా డిసెంబర్ 20 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కు రానుంది.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024