Best Web Hosting Provider In India 2024
Kangana Office: సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు రెండు వార్తలు బాగా ఆసక్తి రేపుతున్నాయి. ఓ టాప్ హీరోయిన్, ఎంపీ అయిన కంగనా రనౌత్ తన నెక్ట్స్ మూవీ ఎమర్జెన్సీ రిలీజ్ వాయిదాల మీద వాయిదా పడుతుండటంతో ముంబైలోని తన ఆఫీస్ అమ్మేసుకుంది. మరోవైపు ఆమె ఆఫీస్ అమ్మిన ప్రాంతంలోనే సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ లగ్జరీ ఇల్లు కొన్నాడు.
ఆఫీస్ అమ్ముకున్న కంగనా రనౌత్
బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు, బీజేపీ ఎంపీ అయిన కంగనా రనౌత్ ఇప్పుడు ఎమర్జెన్సీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలుసు కదా. ఏడాదిగా ఈ మూవీ రిలీజ్ వాయిదా పడుతూనే ఉంది. సెప్టెంబర్ 6నే ఈ ఎమర్జెన్సీ రిలీజ్ కావాల్సి ఉన్నా.. సీబీఎఫ్‌సీ సర్టిఫికెట్ రాకపోవడంతో మరోసారి వాయిదా పడింది.
భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తానే సొంతంగా నిర్మించి, డైరెక్ట్ చేసి, నటించింది కంగనా. మూవీ రిలీజ్ వాయిదా పడటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు రూ.32 కోట్లకు తన ఆఫీస్ అమ్ముకుంది. ముంబైలోని పాలీ హిల్స్ లో ఉన్న తన మణికర్ణిక ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌజ్ అమ్మేసింది.
తప్పలేదంటున్న కంగనా
తన ఆఫీస్ అమ్ముకోవడంపై తాజాగా కంగనా స్పందించింది. “నా సినిమా రిలీజ్ కావాల్సింది. నా వ్యక్తిగత ఆస్తులన్నీ దానిపైనే పెట్టాను. ఇప్పుడా సినిమా రిలీజ్ కాలేదు. దీంతో తప్పలేదు. అయినా ఆస్తులు ఉన్నవి అందుకే కదా. సంక్షోభాల్లో ఆదుకుంటాయి” అని కంగనా అనడం గమనార్హం.
ముంబైలోని పాలీ హిల్, బాంద్రాలో ఉన్న ఈ ఆఫీస్ ను ఆమె 2017లో రూ.20 కోట్లకు కొనుగోలు చేసింది. 2019లో అక్కడే తన మణికర్ణిక ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌజ్ ప్రారంభించింది. 2020లో ఇదే ఆఫీస్ ను నిబంధనలు ఉల్లంఘించిందంటూ అధికారులు కాస్త కూలగొట్టారు. ఇప్పుడీ ఆఫీస్ అమ్మేసిన ఆమె.. అంధేరీలో రూ.1.56 కోట్లు పెట్టి మరో చిన్న ఆఫీస్ తీసుకుంది.
రూ.30 కోట్లు పెట్టి ఇల్లు కొన్న సుకుమారన్
మరోవైపు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ముంబైలోని అదే పాలీ హిల్ ఏరియాలో రూ.30 కోట్లు పెట్టి ఇల్లు కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. చాలా మంది సినిమా సెలబ్రిటీలు ఇప్పుడిదే ప్రాంతంలో ఇళ్లు కొంటున్నారు. సుకుమారన్ కూడా రూ.30 కోట్లతో ఓ డూప్లెక్స్ కొన్నట్లు స్క్వేర్ యార్డ్స్ రిపోర్టు వెల్లడించింది.
2971 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటిని రూ.30.6 కోట్లకు కొనుగోలు చేయగా.. అతడు స్టాంప్ డ్యూటీ రూపంలో రూ.1.84 కోట్లు చెల్లించాడు. పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఈ డూప్లెక్స్ ను కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో ఉంది. ఇది అతని సొంత ప్రొడక్షన్ హౌజ్.
నిజానికి అదే ప్రాంతంలో గతంలోనే సుకుమారన్ ఓ ఇల్లు కొన్నాడు. ఆ అపార్ట్‌మెంట్ ను అతడు రూ.17 కోట్లకు కొనుగోలు చేశాడు. గతేడాది ప్రభాస్ నటించిన సలార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుకుమారన్.. ఎల్2: ఎంపురాన్ మూవీలో నటిస్తున్నాడు.
Best Web Hosting Provider In India 2024
Source / Credits