Bigg Boss Telugu 8: యష్మీని హగ్ చేసుకున్న నాగ మణికంఠ.. మెంటల్ టార్చర్ అంటూ ఏడ్చేసిన ముకుంద (వీడియో)

Best Web Hosting Provider In India 2024


Bigg Boss 8 Telugu Today Episode Promo: బిగ్ బాస్ తెలుగు 8 మూడో వారం నామినేషన్స్ కూడా రచ్చ రచ్చ గానే సాగాయి. థర్డ్ వీక్ నామినేషన్స్‌లో యష్మీని నాగ మణికంఠ నామినేట్ చేశాడు. దానికి యష్మీకి చాలా ఫీల్ అయింది. ఫ్రెండ్షిప్ పేరుతో మోసం చేశావని, తన హార్ట్ బ్రేక్ చేశావని మణికంఠతో అక్కడే చెప్పేసింది.

కూల్ చేయడానికి

అంతేకాకుండా, మణికంఠను కూడా తిరిగి నామినేట్ చేసింది యష్మీ. ప్రతి వారం తనను నామినేట్ చేస్తానని చెప్పుకొచ్చింది కృష్ణముకుంద మురారి సీరియల్‌లో విలన్ ముకుంద పాత్రలో అలరించిన యష్మీ. అయితే, నామినేషన్స్ అనంతరం యశ్మీని కూల్ చేయడానికి ట్రై చేశాడు నాగ మణికంఠ. దీనికి సంబంధించి బిగ్ బాస్ 8 తెలుగు సెప్టెంబర్ 17వ తేది ఎపిసోడ్ ప్రోమోను తాజాగా వదిలారు.

బిగ్ బాస్ తెలుగు 8 డే 16 ప్రోమోలో యష్మీని వెనుక నుంచి హగ్ చేసుకున్నాడు నాగ మణికంఠ. “అదంతా నామినేషన్ వరకే తీసుకో. ఇంకేం మార్చుకోవాల్సిన అవసరం లేదు” అన్నట్లుగా నాగ మణికంఠ హగ్ చేసుకుని యష్మీతో అన్నాడు. దానికి సరే వదిలేయ్ అని కాస్తా గట్టిగా బదులిచ్చింది యష్మీ. “చూడు సీరియస్‌గా చెబుతాది చూడి సరే.. వదిలేయ్ అని” అని నాగ మణికంఠ వెళ్లిపోయాడు.

ఉన్నన్ని రోజులు

“బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్.. టూ మచ్.. నాకు అవ్వట్లేదు. నాకు చాలా కోపం వస్తుంది” అని చెప్పిన యష్మీ ఒక్కసారిగా ఏడుపు స్టార్ట్ చేసింది. బెడ్‌పై పడుకుని కన్నీళ్లు పెట్టుకుంది. తర్వాత పృథ్వీతో మాట్లాడింది యశ్మీ. “నిజంగా నాకు మెంటల్ టార్చర్ అది. వచ్చి హగ్ చేయడం అది నాకు కంఫర్ట్‌బుల్‌గా లేదు. నేను చెప్పాను నాకు కంఫర్ట్‌బుల్‌గా లేదని. నిజంగా అతను ఫేక్. నేను ఉన్నన్ని రోజులు ప్రతి నామినేషన్‌లో వాడి పేరు పెడుతా” అని పృథ్వీతో చెప్పింది యష్మీ.

అనంతరం రేషన్ గెలుచుకోడానికి బిగ్ బాస్ మొదటి టాస్క్ ఫొటో పెట్టు.. ఆగే టట్టు ఇచ్చాడు. ఈ టాస్క్‌లో పృథ్వీ, నబీల్ చెరో క్లాన్ నుంచి పార్టిస్‌పేట్ చేశారు. నబీల్ ఫాస్ట్‌గా పెడుతుంటే.. తను పెడుతున్న ఫొటోలను పృథ్వీలాగేయడం, పక్కకు పడేయడం వంటి ఫౌల్ గేమ్ ఆడాడు. సంచాలక్‌గా ఉన్న సీత ఏం చెప్పలేకపోయింది.

ఫిజికల్ అయిన పృథ్వీ, నబీల్

నబీల్ టీమ్ చీఫ్ అది రాంగ్ అని అరిచాడు. అయినా కూడా పృథ్వీ వినలేదు. పృథ్వీ, నబీల్ ఇద్దరూ ఫిజికల్ అయ్యారు. తర్వాత సీతతో పృథ్వీది మైనసే అది. పట్టుకోవడం, నూకడం అని విష్ణుప్రియ, నబీల్ చెప్పారు. పృథ్వీని చూపిస్తూ ప్రోమోను ముగించారు. ఇదిలా ఉంటే, బిగ్ బాస్ తెలుగు 8 మూడో వారం నామినేషన్స్‌లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.

బిగ్ బాస్ 8 తెలుగు థర్డ్ వీక్ నామినేట్ అయిన వాళ్లలో నాగ మణికంఠ, ప్రేరణ, యష్మీ గౌడ, నైనిక, పృథ్వీరాజ్, విష్ణుప్రియ, కిర్రాక్ సీత, అభయ్ నవీన్ ఉన్నారు. వీరిలో చీఫ్ అయిన అభయ్ నవీన్ సెల్ఫ్ నామినేట్ కావడం గమనార్హం.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024