YouTuber Harsha Sai : యూట్యూబర్ హర్షసాయిపై యువతి ఫిర్యాదు, పెళ్లిపేరుతో రూ.2 కోట్లు చీట్ చేశాడని ఆరోపణ

Best Web Hosting Provider In India 2024


YouTuber Harsha Sai : యూట్యూబర్‌ హర్షసాయిపై ఓ యువతి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి పేరుతో తనని మోసం చేసి రూ.2 కోట్లు తీసుకున్నాడని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించింది. అడ్వొకేట్‌తో సహా నార్సింగి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన యువతి…హర్షసాయితో పాటు అతడి తండ్రిపైనా ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

పేద వారికి సాయం చేస్తూ ఫేమస్ అయిన యూట్యూబర్ హర్షసాయి…ఇటీవల హీరో అయ్యాడు. స్వీయ దర్శకత్వంలో ‘మెగా’ అని సినిమాలో హీరో చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో హర్షసాయి నెటిజన్లకు సుపరిచితం. పేదవారి పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తూ హర్షసాయి వీడియోలు చేస్తుంటారు. సామాజిక మాధ్యమాల్లో హర్షసాయికి ప్రత్యేకమమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని ఇటీవల ఇతనిపై విమర్శలు కూడా వచ్చాయి. లక్షల్లో డబ్బు తీసుకుని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని పలువురు విమర్శించారు.

టాపిక్

HyderabadCrime TelanganaTelangana NewsTelugu NewsYoutube

Source / Credits

Best Web Hosting Provider In India 2024