బాబు, లోకేష్‌.. ఇతరుల సంతోషాన్ని చూసి ఓర్వలేక దుఃఖిస్తుంటారు!

Best Web Hosting Provider In India 2024

ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

తాడేపల్లి: సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ వంటి వ్యక్తులు ఇతరుల సంతోషాన్ని చూసి ఓర్వలేక దు:ఖిస్తుంటారని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఈ మేర‌కు వారిద్దరిపై  ట్విట్టర్‌ వేదికగా సెటైర్లు వేశారు.

 నారద ముని ఒక రోజు శ్రీకృష్ణుడిని అడిగాడు..
“ప్రభూ! చంద్రబాబు, అయన సుపుత్రుడు లోకేష్ ఎల్లప్పుడు దుఃఖంలో ఎంచుకుంటున్నారు?”
శ్రీకృష్ణుడు అద్భుత రీతిలో జవాబు ఇస్తూ, 
“ప్రతి మనిషికి ఆనందాలు ఉంటాయి. 
కానీ, చంద్రబాబు మరియు లోకేష్ లాంటి వారు ఇతరుల సంతోషాన్ని చూసి ఓర్వలేక దుఃఖిస్తుంటారు!’ అంటూ కామెంట్స్‌ చేశారు.

 
అంతకుముందు కూడా చంద్రబాబు పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సంపద సృష్టి లేదు-40 ఏళ్ల అనుభవం లేదు, వంకాయ లేదు.. అంతా దోపిడీనే!!. మళ్ళీ 3000 వేలకోట్ల అప్పు. ఎక్కడకి పోతుంది ఈ డబ్బు అంతా?. కార్పోరేషన్స్‌కి గ్యారంటీ ఇచ్చి తెచ్చిన అప్పుతో కలిపి ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు తెచ్చిన అప్పు దాదాపు 50 వేలకోట్ల పై మాటే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే నాటికి జీతాలు చెల్లించాక, ఖజానాలో ఉన్న డబ్బు దాదాపు 7000 కోట్లు. అది కాకుండా కేంద్రం నుండి వివిధ పద్దుల కింద వచ్చిన డబ్బు కూడా ఉంది.

పిల్లలు తినే గోరుముద్దతో సహా వైయ‌స్‌ జగన్ 38 సంక్షేమ పథకాల్లో ఏ ఒక్కటి చంద్రబాబు నడవడం లేదు. పాత బిల్లులు చెల్లించడం లేదు. 7800 కోట్ల రూపాయల వరద నష్టం అని అంచనా వేసి కేంద్రానికి నివేదిక 10 రోజుల క్రితమే పంపినా, ఇప్పటి వరకు సాయం గురించి ప్రకటన రాలేదు. దోపిడీ .. దోపిడీ .. దోపిడీ.. మోసం..మోసం.. మోసం.. దగా.. దగా..దగా’ అంటూ మండిపడ్డారు.

Best Web Hosting Provider In India 2024