Best Web Hosting Provider In India 2024

విజయవాడ: ఎంతో చరిత్ర కలిగిన ఎన్టీఆర్కు.. తనకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుతో దండ వేయించేకునే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు పేర్ని నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనం గుండెల్ని గెలిచిన వ్యక్తి ఎన్టీఆర్ అని, దేశంలో రాజకీయ పార్టీల నేతలకు సింహస్వప్నమని కీర్తించారు. పేదలకు రూ.2లకే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిన గొప్ప నాయకుడని పొగడ్తల వర్షం కురిపించారు.