Unstoppable With Nbk: దెబ్బ‌కు థింకింగ్ మారి తీరాలంటున్న బాల‌కృష్ణ‌ – అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 4 స్ట్రీమింగ్‌ డేట్ ఇదే!

Best Web Hosting Provider In India 2024


Unstoppable With Nbk: బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 4 స్ట్రీమింగ్ డేట్ అఫీషియ‌ల్‌గా అనౌన్స్ అయ్యింది. అక్టోబ‌ర్ 24 నుంచి ఆహా ఓటీటీలో ఈ టాక్ షో కొత్త సీజ‌న్ మొద‌లుకానుంది. అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 4కు సంబంధించి ప్ర‌మోష‌న‌ల్ వీడియోను రిలీజ్ చేశారు. యానిమేష‌న్ రూపంలో రిలీజ్ చేసిన ఈ వీడియో టీజ‌ర్‌లో బాల‌కృష్ణ సూప‌ర్ హీరోగా క‌నిపించి అభిమానుల‌ను అల‌రించారు.

యానిమేష‌న్‌లో బాల‌కృష్ణ‌…

అది పండుగ‌లేని ఒక ప్రాంతం… అనే అక్ష‌రాల‌తో టీజ‌ర్ ప్రారంభ‌మైంది. ప్ర‌జ‌లు పీడించ‌బ‌డుతున్న‌ట్లుగా టీజ‌ర్‌లో క‌నిపించారు. అమ్మ కొత్త బ‌ట్ట‌లు కావాలి, పాయ‌సం కావాలి అని ఓ చిన్నారి అడ‌గ్గా…అవి కావాలంటే పండుగ రావాలి అని త‌ల్లి స‌మాధానం చెప్పింది.

ఆయ‌న క‌న్నెర్ర‌ చేస్తే ప్ర‌ళ‌యం, మీసం తిప్పితే శ‌త్రువుకు మ‌ర‌ణం, మాటిస్తే శాస‌నం అని ఓ వ్య‌క్తి అన‌గానే సూప‌ర్ హీరోగా ఈ వీడియో టీజ‌ర్‌లో బాల‌కృష్ణ ఎంట్రీ ఇచ్చాడు. అదుగో మా ధైర్యం తాలూకు రూపం అంటూ ప్ర‌జ‌లు బాల‌కృష్ణ‌ను చూపించ‌డం ఆక‌ట్టుకుంటుంది

జై బాల‌య్య‌….

జై బాల‌య్య అని ఓ చిన్నారి పిల‌వ‌గానే….ప్రేమ‌తో పిలిచే ఆ పిలుపు…ఎదురించే స‌వాళ్లు ఎలాంటివైనా ప‌టాపంచ‌లు చేసే ప‌వ‌ర్‌ను ఇస్తుంద‌ని, ప్ర‌జ‌లే మా బ‌లం…వారి ఆనంద‌మే మా అభిమ‌తం అంటూ బాల‌కృష్ణ చెప్పిన డైలాగ్స్ వీడియో టీజ‌ర్‌లో ఆక‌ట్టుకుంటున్నాయి. టీజ‌ర్ చివ‌ర‌లో సీజ‌న్ 4 లాంఛింగ్ డేట్‌ను అనౌన్స్‌చేశారు.

అల్లు అర‌వింద్‌, అనిల్ రావిపూడి…

సీజ‌న్ 4 అనౌన్స్‌మెంట్ సంద‌ర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల స‌మావేశంలో బాల‌కృష్ణ‌తో పాటు డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి, ప్రొడ్యూస‌ర్, ఆహా ఓటీటీ అధినేత అల్లు అర‌వింద్ పాల్గొన్నారు.

ఈ వేడుక‌లో బాల‌కృష్ణ మాట్లాడుతూ…వ‌ర‌ల్డ్ వైడ్‌గా బెస్ట్ టాక్ షోల‌లో 18వ ప్లేస్‌లో నిలిచింది. మ‌న దేశంలో నంబ‌ర్ షోగా అన్‌స్టాప‌బుల్ నిల‌వ‌డం ఆనందంగా ఉంద‌ని బాల‌కృష్ణ అన్నాడు. సీజ‌న్ 4లో ప్ర‌తి ఎపిసోడ్ ఓ పండుగ‌లా ఉంటుంద‌ని బాల‌కృష్ణ తెలిపాడు.

అల్లు అర్జున్‌…

అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 4కు గెస్ట్‌లుగా అల్లు అర్జున్‌, సూర్య‌తో పాటు ప‌లువురు ద‌క్షిణాది స్టార్ హీరోలు అటెండ్ కానున్న‌ట్లు చెబుతోన్నారు. ఫ‌స్ట్ ఎపిసోడ్ అల్లు అర్జున్‌తోనే ఉంటుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. చిరంజీవి కూడా గెస్ట్‌గా హాజ‌రు కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.అన్‌స్టాప‌బుల్ సీజ‌న్1, సీజ‌న్ 2 పెద్ద స‌క్సెస్ అయ్యారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్, ప్ర‌భాస్‌, మ‌హేష్‌బాబుతో పాటు ప‌లువురు స్టార్ హీరోలు ఈ టాక్ షోలో సంద‌డి చేశారు.

బాల‌కృష్ణ 109 మూవీ…

ప్ర‌స్తుతం బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ చేస్తోన్నాడు బాల‌కృష్ణ‌. బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 109వ సినిమా ఇది. ఈ మూవీ రిలీజ్ డేట్‌, టైటిల్‌ను ద‌స‌రా సంద‌ర్భంగా ఆదివారం (నేడు అనౌన్స్ చేయ‌బోతున్నారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ కానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024