TGPSC Group 1 Hall Tickets 2024 : రేపు గ్రూప్ 1 మెయిన్స్ హాల్ టికెట్లు విడుదల – మొత్తం 7 పేపర్లు, పూర్తి షెడ్యూల్ ఇదే

Best Web Hosting Provider In India 2024


తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. అక్టోబర్ 21వ తేదీ నుంచే పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లు రేపు(అక్టోబర్ 14) అందుబాటులోకి రానున్నాయి. https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాలని టీజీపీఎస్సీ పేర్కొంది.

అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నారు. గ్రూప్-1 మెయిన్స్ లో ఆరు పేపర్లు ఉంటాయి. వీటికి తోడు జనరల్ ఇంగ్లీష్ పేపర్ రాయాల్సి ఉంటుంది. అంటే మెయిన్స్ లో భాగంగా ఏడు పేపర్లు రాయాల్సి ఉంటుంది. ప్రతీ పేపర్ ను 3 గంటల వ్యవధిలో 150 మార్కులకు నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలను ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.00 వరకు నిర్వహిస్తారు.

Open PDF in New Window

గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ :

  • జనరల్ ఇంగ్లీష్(క్వాలిఫైయింగ్ పేపర్) – అక్టోబర్ 21, 2024.
  • పేపర్-I (జనరల్ ఎస్సే) -అక్టోబర్ 22, 2024.
  • పేపర్-II (చరిత్ర, సంస్కృతి, భూగోళశాస్త్రం) – అక్టోబర్ 23, 2024.
  • పేపర్ -III (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, అడ్మినిస్ట్రేషన్) – అక్టోబర్ 24, 2024.
  • పేపర్ -IV (ఎకానమీ, డెవలప్మెంట్) – అక్టోబర్ 25, 2024.
  • పేపర్- V (సైన్స్ &సాంకేతికత, డేటా ఇన్టర్ప్రెటేషన్ ) – అక్టోబ్ 26, 2024.
  • పేపర్-VI (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర నిర్మాణం) – అక్టోబర్ 27, 2024.

గ్రూప్ 1 మెయిన్స్ కు మొత్తం 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. జూన్‌ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఎగ్జామ్ కు మొత్తం 3.02 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. మెయిన్స్ పరీక్షను ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్షలో జనరల్ ఇంగ్లిష్ తప్ప మిగిలిన పేపర్లను అభ్యర్థులు ఎంచుకున్న భాషల్లో రాయాలి. 

మెయిన్స్ పరీక్షల సమయంలో అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలను కూడా టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఎట్టి పరిస్థితుల్లో నిబంధనలను ఉల్లంఘించవద్దని స్పష్టం చేసింది. అభ్యర్థులకు అవగాహన కోసం వెబ్ సైట్ లో మోడల్ ఆన్సర్ బుక్ లెట్లను కూడా ఉంచింది. 

టాపిక్

TgpscTelangana NewsRecruitmentTs Group 1

Source / Credits

Best Web Hosting Provider In India 2024