OTT Crime Thriller Series: ఈవారం ఓటీటీల్లోకి రెండు థ్రిల్లర్ వెబ్ సిరీస్‍లు.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Best Web Hosting Provider In India 2024


ఓటీటీల్లోకి కొత్త థ్రిల్లర్ వెబ్ సిరీస్‍లు ఎప్పుడొస్తాయా అని చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. ఈ జానర్ సిరీస్‍లకు ఆ స్థాయిలో క్రేజ్ ఉంటుంది. ఈ క్రమంలో ఈ వారం రెండు ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సిరీస్‍లు స్ట్రీమింగ్‍కు వచ్చేస్తున్నాయి. 1000 బేబీస్, స్నేక్ అండ్ లాడర్స్ సిరీస్‍లు స్ట్రీమింగ్‍కు రెడీ అయ్యాయి. ఈ సిరీస్‍ల ట్రైలర్లు క్యూరియాసిటినీ బాగానే పెంచాయి. ఈ రెండు సిరీస్‍లు తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి రానున్నాయి. ఈ సిరీస్‍లు ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్‍కు వస్తాయనే విషయాలతో పాటు మరిన్ని వివరాలు ఇక్కడ చూడండి.

1000 బేబీస్

క్రైమ్ థ్రిల్లర్ ‘1000 బేబీస్’ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ నుంచే ఇంట్రెస్ట్ పెంచుతూ వస్తోంది. ఇటీవలే వచ్చిన ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. ఈ సిరీస్ ఈ శుక్రవారం (అక్టోబర్ 18) డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍‍కు రానుంది. మలయాళంలో రూపొందిన ‘1000 బేబీస్’ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠి భాషల వెర్షన్‍ల్లోనూ స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ సిరీస్‍లో నీనా గుప్తా, రహమాన్ ప్రధాన పాత్రలు పోషించారు. సంజూ శివరామ్, ఆదిల్ ఇబ్రహీం, అశ్విన్ కుమార్, జాయ్ మాథ్యూ, షాజు శ్రీధర్ కీరోల్స్ చేశారు. మెడికల్ ల్యాబ్‍లో ప్రయోగాలు జరగడం, వృద్ధురాలి పాత్ర పోషించిన నీనా ఏదో టైప్ చేస్తుండటం, కేసును పోలీస్ ఆఫీసర్ కేసును విచారించడం, హత్యలు జరగడం ఇలా ట్రైలర్ ఉత్కంఠభరితంగా సాగింది.

1000 బేబీస్ సిరీస్‍కు నీజమ్ కోయ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‍ ఉత్కంఠభరితంగా ట్విస్టులతో సాగుతుందనే అంచనాలు ఉన్నాయి. షాజి నదేషన్, ఆర్య ఈ సిరీస్‍ను ప్రొడ్యూజ్ చేశారు. అక్టోబర్ 18 నుంచి ఈ సిరీస్‍ను హాట్‍స్టార్ ఓటీటీలో వీక్షించొచ్చు.

స్నేక్స్ అండ్ లాడర్స్

‘స్నేక్స్ అండ్ లాడర్స్’ వెబ్ సిరీస్ అక్టోబర్ 18వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. గేమ్ పేరుతో టైటిల్ ఉన్నా.. ఈ సిరీస్ మాత్రం థ్రిల్లర్‌గా సీరియస్‍గా సాగుతుంది. నలుగురు పిల్లలది ఈ సిరీస్‍లో ప్రధాన పాత్రలు ఉన్నాయి. తెలుగు యాక్టర్ నవీన్ చంద్ర కూడా లీడ్ రోల్ చేశారు. అక్టోబర్ 18న తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీల్లో స్నేక్స్ అండ్ లాడర్స్ సిరీస్ హాట్‍స్టార్‌లో అందుబాటులోకి వస్తుంది.

తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్.. స్నేక్స్ అండ్ లాడర్స్ సిరీస్‍కు క్రియేటివ్ ప్రొడ్యూజర్‌గా ఉండటంతో ఆసక్తి మరింత ఎక్కువగా ఉంది. అశోక్ వీరప్పన్, భరత్ మురళీధరన్, కమలా అల్కెమిస్ ఈ సిరీస్‍కు దర్శకత్వం వహించారు. నలుగురు స్కూల్ పిల్లలు అడ్వెంచర్ చేయాలని అడవిలోకి వెళ్లగా వారికి చైన్ డాలర్ దొరుకుతుంది. ఆ విలువైన పురాతన డాలర్ కోసం ఓ క్రిమినల్ గ్యాంగ్ వెతుకుతుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ సిరీస్‍లో ఉంటుంది. నవీన్ చంద్రతో పాటు నందా, ముత్తుకుమార్, మనోజ్ భారతి రాజా, శ్రీమత్ ఈ సిరీస్‍లో కీరోల్స్ చేశారు. కల్యాణ్ సుబ్రమణియం ఈ సిరీస్‍ను నిర్మించారు.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024